తెలంగాణ

telangana

ETV Bharat / state

'మా భవిష్యత్తు, జీవితాలు నాశనం చేశారు'- తమిళిసైకి దాసోజు శ్రవణ్​ బహిరంగ లేఖ - Dasoju Sravan on Governor about MLC

BRS Leader Dasoju Sravan on Governor : గత సర్కారుపై రాజకీయ శత్రుత్వం చూపించి, తప్పుడు నిర్ణయాలతో తమ జీవితాలను నాశనం చేసిన విషయాలను గుర్తు చేసుకోవాలని బీఆర్​ఎస్​ నేత దాసోజు శ్రవణ్ గవర్నర్​ తమిళిసైని కోరారు. ఇవాళ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసిన నేపథ్యంలో శ్రవణ్ తన ​సామాజిక మాధ్యమాల్లో ఆమెకు బహిరంగ లేఖ రాశారు.

Dasoju Sravan on Governor Decision about MLC
BRS Leader Dasoju Sravan on Governor :

By ETV Bharat Telangana Team

Published : Mar 18, 2024, 8:33 PM IST

BRS Leader Dasoju Sravan on Governor :రాజ్యాంగాన్ని తప్పుదారి పట్టిస్తూ, చట్టవిరుద్ధమైన నిర్ణయంతో తమ భవిష్యత్తు, జీవితాలు నాశనం చేశారన్న విషయాన్ని గుర్తించి ఆత్మశోధన చేసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను భారత రాష్ట్ర సమితి నేత దాసోజు శ్రవణ్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్​లో కోరారు. గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు తమిళిసైకి అభినందనలు తెలిపారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో హైకోర్టు(High Court) ఆదేశాల తర్వాత న్యాయం గెలుస్తుందన్న ఆశతో విజ్ఞప్తి చేశామన్న శ్రవణ్, గతంలో తీసుకున్న చట్టవిరుద్ధ నిర్ణయాన్ని సరిచేసి తమను శాసనమండలి సభ్యులుగా నియమిస్తారని ఆశించినట్లు పేర్కొన్నారు.

Dasoju Sravan on Governor Decision about MLC :అపరిపక్వ, తప్పుడు న్యాయ సలహాపై మీరు ఆధారపడడంతో పాటు మీ వివాదాస్పద రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం కారణంగా తమకు తీరని అన్యాయం జరిగిందని గవర్నర్​ను ఉదేశిస్తూ దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధమైన నిర్ణయంతో తమకు చాలా అన్యాయం జరిగిందని అన్నారు. రాజకీయ నేపథ్యాన్ని సాకుగా చూపి తమ త్యాగాలు, అర్హతలు, సమాజానికి చేసిన కృషిని విస్మరించారని శ్రవణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం పట్ల ఉన్న రాజకీయ శత్రుత్వం ప్రదర్శించారని, తప్పుడు నిర్ణయంతో తమ జీవితాలు నాశనం అయినప్పటికీ తమిళిసై రాజకీయ జీవితంలో తప్పనిసరిగా విజయం సాధించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు దాసోజు శ్రవణ్ ట్వీట్​లో తెలిపారు.

Telangana HC Verdict On MLCs Appointments :తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై ఈ నెల 7న హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం విదితమే. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రొ.కోదండరాం, ఆమిర్​ అలీఖాన్​లను రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయగా తమిళిసై అంగీకరిస్తూ ఆమోదం తెలిపారు. అయితే మరోవైపు గత బీఆర్ఎస్ సర్కార్ 2023 జులై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు పంపింది. 2023 సెప్టెంబర్ 25న ఈ ఇద్దరి పేర్లను తమిళిసై తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని తమిళిసై అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు.

ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్​ వేశారు. గవర్నర్‌ పరిధి దాటి వ్యవహరించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ల నియామకాలపై తెలంగాణ సర్కార్ ఇచ్చిన గెజిట్‌ను కొట్టివేసింది. గవర్నర్‌ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం తెలిపింది.

'ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా' - గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా

వరుసపెట్టి కారు దిగుతున్నారు - వలసలతో గులాబీ పార్టీలో గుబులు

ABOUT THE AUTHOR

...view details