తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యం' - మేడిగడ్డకు బయల్దేరిన గులాబీ సైన్యం - BRS Leader Visits Medigadda

BRS Chalo Medigadda Tour Live News Today : కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కదిలింది. తెలంగాణ భవన్​ నుంచి మేడిగడ్డకు ఆ పార్టీ నేతలంతా బస్సులు, కార్లలో బయలుదేరారు. గులాబీ దళపతి కేసీఆర్ మినహా మిగతా నాయకులంతా పయనమయ్యారు. మేడిగడ్డ సందర్శన తరువాత అన్నారం బ్యారేజీ పరిశీలన చేయనున్నారు.

KTR Calls Chalo Medigadda
BRS Chalo Medigadda Tour Today

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 9:41 AM IST

Updated : Mar 1, 2024, 12:11 PM IST

'ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యం' - మేడిగడ్డకు బయల్దేరిన గులాబీ సైన్యం

BRS Chalo Medigadda Tour Live News Today :కేటీఆర్ పిలుపు మేరకు 'చలో మేడిగడ్డ' సందర్శనకు రాష్ట్ర గులాబీ సైన్యం సిద్ధమయ్యింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మినహా ముఖ్య నాయకులంతా, తెలంగాణ భవన్​ నుంచి మేడిగడ్డకు బయలుదేరారు. ఉదయం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి రెండు బస్సుల్లో గులాబీ నాయకులు వెళ్లారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శన తరవాత నేతలు అన్నారం బ్యారేజీ(Annaram Barrage) పరిశీలన చేయనున్నారు. అనంతరం అన్నారం వద్ద కేటీఆర్ పవర్​పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

KTR Fires on Congress Govt : ప్రభుత్వానికి రైతుల కన్నా రాజకీయమే ముఖ్యమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్ఎస్​పై ఉన్న కోపాన్ని రైతులపై చూపించవద్దని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నారని మండిపడిన ఆయన, వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్టుకు మరమ్మతులు(Project Repairs) చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

నేడే బీఆర్ఎస్ చలో మేడిగడ్డ - ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు నేతలు రె'ఢీ'

"తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికి, చిన్నలోపాన్ని భూతద్దంలో చూపుతున్న బాధ్యత మరిచిన కాంగ్రెస్‌ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకే, చలో మేడిగడ్డకు శ్రీకారం చుట్టాం. బీఆర్ఎస్ పాలనలో పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండగాలా చేయాలని కాంగ్రెస్ పన్నాగాలు పన్నుతుంది. అందుకే మేడిగడ్డ టూర్‌కి వెళ్తున్నాం. రాజకీయాల కోసం తెలంగాణను బలిచేయడానికి ప్రయత్నిస్తే, ఉపేక్షించేది లేదు. మేడిగడ్డకు మరణశాసనం రాయాలని చూస్తే, తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌కు నూకలు చెల్లడం ఖాయం." -కేటీఆర్‌, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

BRS Pocharam on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైనదని మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. లక్షలాది ఎకరాలకు నీరందించి కరువును పారద్రోలిన ప్రాజెక్ట్‌ కాళేశ్వరమని తెలిపారు. కాంగ్రెస్ లేనిది ఉన్నట్లు చూపుతుందని విమర్శించారు. రైతుల పట్ల హస్తం పార్టీకి (Congress Govt) ఏమాత్రం ప్రేమ ఉన్నా మేడిగడ్డ మరమ్మతులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. 84 పిల్లర్లలో మూడు కుంగాయని వాటికి మరమ్మతులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

సాంకేతిక లోపాలను సవరించకుండా రాజకీయం చేయడం సరికాదని పోచారం మండిపడ్డారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుందన్న పోచారం గత ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని ఆక్షేపించారు. నీరు లోతుగా ఉన్న ప్రాంతంలో పిల్లర్లు బాగున్నాయని గుర్తు చేసిన పోచారం, పనికిరాని ప్రాజెక్టుగా చిత్రీకరిస్తే ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. రాజకీయాల(Politics) కోసం రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టవద్దని సూచించారు.

మేడిగడ్డపై కాంగ్రెస్​ది రాజకీయం - రైతులకు నీళ్లివ్వకుండా కాలయాపన చేయడం దారుణం : కేటీఆర్

హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటైంది: హరీశ్‌రావు

Last Updated : Mar 1, 2024, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details