BRS approach High Court on Danam issue : దానం నాగేందర్ అనర్హత పిటిషన్ వ్యవహారంలో బీఆర్ఎస్(BRS) హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానంపై, అనర్హత వేటు వేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సభాపతి గడ్డం ప్రసాద్ వద్ద ఇప్పటికే అనర్హత పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్న బీఆర్ఎస్, సభాపతి ఇంకా స్పందించడం లేదని ఫిర్యాదులో తెలిపింది. దానంపై త్వరగా చర్యలు తీసుకోవాలని సభాపతిని ఆదేశించాలని పిటిషన్లో పేర్కొంది. ఇప్పటికే సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పేరును ప్రకటించిందని బీఆర్ఎస్ పేర్కొంది.
KTR on Danam Nagender : గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై(Danam Nagender), వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే సభాపతిని కోరిన విషయం తెలిసిందే. ఇటీవల ఇదే విషయంపై భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) స్పందించారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై హస్తం పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించిన దానం నాగేందర్ వ్యవహారంలో, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం వరకు నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.