Bride Appeared for Group2 Mains Exam in Tirupati : ఏపీ వ్యాప్తంగా పటిష్టమైన భద్రత నడుమ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ముగిసాయి. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు మెటల్ డిటెక్టివ్ ద్వారా తనిఖీ చేసి అభ్యర్ధులను పరీక్షా కేంద్రాల్లోకి పంపారు. బ్లూటూత్, చరవాణి తదితరవాతన్నింటిని అభ్యర్ధులు పరీక్ష కేంద్రం బయటనే పెట్టేసి వెళ్లారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ దశలో చోటు చేసుకోకుండా జిరాక్స్ కేంద్రాలను మూసివేశారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్ తొలి పేపర్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో పేపర్ . 92,250 మంది అభ్యర్థులు పరీక్షలకు హజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, పలుచోట్ల పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు హజరీలో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పలువురు అభ్యర్ధులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో అధికారులు, పోలీసులు వారిని వెనక్కి పంపించివేయడం పలువుర్ని కలచివేసింది.
తిరుపతిలో జరుగుతున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు ఓ నవవధువు హాజరైంది. చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో ఉదయం పెళ్లి ముహూర్తంలో తలపై జీలకర్ర బెల్లం పెట్టుకుని పరీక్షకు హజరైంది. పెళ్లి తంతంగం పూర్తికి ఇంకా సమయం ఉండటంతో తిరుపతిలోని శ్రీ పద్మావతి పీజీ, ిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రానికి చేరుకుని ఆ నవ వధువు పరీక్ష రాశారు.
వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రమైన కడపలో 13 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద మూడంచల భద్రతను ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. జిల్లా వ్యాప్తంగా 5825 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.