తెలంగాణ

telangana

ETV Bharat / state

క్యూలైన్​లో చిన్నపిల్లాడి వేషాలు - గ్రిల్‌లో ఇరుక్కున్న తల - చివరికి? - BOY HEAD STUCK IN GRILS IN YADADRI

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ - గ్రిల్స్‌లో ఇరుక్కున్న బాలుడి తల - గమనించి తలను బయటకు తీసిన భక్తులు

Boy Head Stuck in Grills in Yadadri Temple
Boy Head Stuck in Grills in Yadadri Temple (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2024, 2:32 PM IST

Updated : Dec 29, 2024, 3:24 PM IST

Boy Head Stuck in Grills in Yadadri Temple :క్యూలైన్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు అల్లరి చేష్టలు చేయడం మామూలే. వారు చేసే అల్లరికి కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏమీ చేయలేక నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చుంటారు. అందరిలో కొట్టలేరు, బెదిరించలేరు. వారు చేస్తుంది చూస్తూ ఉండటం తప్ప మరొకటి చేయలేరు. ముఖ్యంగా ఆలయాల్లో క్యూలైన్‌లో నిల్చున్నప్పుడు పిల్లలు అక్కడ ఏర్పాటు చేసి ఉన్న గ్రిల్స్‌తో ఆడుకోవడం, వాటిపై ఎక్కి నిల్చోవడం, అందులో తల, చేతులు, కాళ్లు పెట్టడం లాంటివి చేస్తుంటారు. అలాంటి ఘటనే యాదగిరి గుట్టలో చోటుచేసుకుంది.

కూల్ డ్రింక్ డబ్బాలో ఇరుక్కుపోయిన పాము - చివరకు ఏవిధంగా బయటపడిందంటే? - A snake stuck in an empty bottle

భక్తులు తెలిపిన వివరాల మేరకు, హైదరాబాద్‌ బోడుప్పల్‌కు చెందిన ఓ కుటుంబం శనివారం రాత్రి యాదాద్రికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం యాదాద్రి కొండపై రూ.150 టికెట్‌ ప్రవేశ దర్శన క్యూలైన్‌లో నిల్చున్నారు. అందులో ఓ చిన్న బాలుడు ఉన్నాడు. ఎలాగో రద్దీ ఉండడంతో లైన్లో ఏర్పాటు చేసిన గ్రిల్స్‌తో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ బాలుడి తల గ్రిల్‌లో ఇరుక్కుపోయింది. గమనించిన తోటి భక్తులు తలను బయటికి తీయడానికి ప్రయత్నించారు. కాసేపటికి గ్రిల్‌ రాడ్లను పక్కకు జరిపి తలను తీశారు. పిల్లాడికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

ఎరక్కపోయి వచ్చి- గ్యాస్​ సిలిండర్​లో ఇరుక్కుపోయిన పాము - Cobra Trapped In Gas Cylinder

Last Updated : Dec 29, 2024, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details