Boy Died in Dogs Attack at Secunderabad :తెలంగాణరాష్ట్రంలోని పలు ప్రాంతాలలో కుక్కల బెడదతో జనం బెంబేలెత్తి పోతున్నారు. సికింద్రాబాద్, జవహర్ నగర్ పరిధిలోని దివ్యాంగుల కాలనీలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు విహాన్‌పై విచక్షణారహితంగా దాడి చేశాయి. బాలుడి తల, శరీరంపై తీవ్రంగా గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. విహాన్ శరీరం ఇన్ఫెక్షన్కు గురై మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు. వీధి కుక్కల బెడద ఉందని పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడలో జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం - ఇద్దరు చిన్నారులపై దాడి
గత కొన్ని రోజులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ పాలకులు అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దివ్యాంగుల కాలనీకి వచ్చిన మున్సిపల్ కమిషనర్ మోహన్‌రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. పలుమార్లు కుక్కలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నిలదీశారు. మృతి చెందిన బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కరిచిన పెంపుడు కుక్క - తండ్రి, కుమారుడు మృతి - Son and Father Died in Dog Bite
Dogs Attack On Two Years Boy : రెండు నెలల క్రితమే దివ్యాంగుల కాలనీకి వచ్చినట్లు బాలుడు తండ్రి భరత్ తెలిపారు. రాత్రి ఆడుకుంటూ బయటికి వచ్చిన క్రమంలో ఒక్కసారిగా పదుల సంఖ్యలో కుక్కలు దాడి చేసి చాలా దూరం ఈడ్చుకెళ్లినట్లు వెల్లడించారు. వీధి కుక్కల స్వైర విహారం కారణంగా బయటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోయారు. వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
"మంగళవారం రాత్రి మా అబ్బాయి, ఆడుకుందామని గేట్ తీసుకొని బయటకు వచ్చాడు. అంతలోనే కుక్కలు మీద పడి దాడి చేసి, చాలా దూరం ఈడ్చుకెళ్లాయి. నేను అప్పుడే డ్యూటీ చేసి ఇంటికి వచ్చాను. నా 18 నెలల బిడ్డ కుక్కల దాడికి బలవ్వటం జీర్ణించుకోలేకపోతున్నాను." -భరత్, మృతి చెందిన బాలుడు తండ్రి
మద్యం మత్తులో కుక్క పిల్లను తెచ్చి పిల్లికి వైద్యం చేయాలంటూ హల్ చల్ - man behaves influence of alcohol
Dog Attack Boy in Jagtial District :మరోవైపు జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం మంగేళలో దేవేందర్ అనే బాలుడిని వీధి కుక్క విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచింది. అక్కడే ఉన్న స్థానికులు రావటంతో శునకం పారిపోయింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. గాయపడ్డ బాలుడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పిచ్చికుక్క దాడిలో 8 మందికి గాయాలు- రైతుపై ఎలుగుబంటి అటాక్ - Mad Dog Attacks Anantapur