Bomb threats to several hotels in Tirupati:తిరుపతి నగరంలో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. నగరంలోని రాజ్పార్కు హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరో మూజు హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు, బాంబ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఆ హోటళ్లలోని మూలమూలలా గాలించారు. చివరకు ఎటువంటి బాంబు లేదని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.
'విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జైలు శిక్ష'- కొత్త రూల్స్ ప్రకటించిన రామ్మోహన్ నాయుడు
అదే విధంగా రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు సైతం గురువారం మెయిల్లో అపరిచిత వ్యక్తుల సుమారు నుంచి బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా కూడా పేలుడు సామగ్రి లేవని నిర్థారించుకుని ఊరట చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.