తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో ల్యాండ్ అయిన 'మానవ రహిత విమానం' - చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

మానవ రహిత విమానాన్ని కనిపెట్టిన బ్లూజే ఏరోస్పేస్‌ - హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలన - 2026 నాటికి పూర్తిగా వాడుకలోకి

BLUJ Invented Autonomous VTOL Aircraft
BLUJ Invented Autonomous VTOL Aircraft (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

BLUJ Invented Autonomous VTOL Aircraft : నిట్ట నిలువుగా టేకాఫ్‌తో పాటు, భూమి మీదకు దిగే సామర్థ్యం (వీటీఓఎల్‌) ఉన్న మానవ రహిత సరకు రవాణా విమానాన్ని బ్లూజే ఏరోస్పేస్‌ ఆవిష్కరించింది. దీని పనితీరును హైదరాబాద్‌ సమీపంలోని నాదర్‌గుల్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించింది. వాణిజ్య స్థాయిలో పూర్తి విమానాన్ని 2026 నాటికి సిద్ధం చేయనున్నట్లు బ్లూజే ఏరో సహ వ్యవస్థాపకులు అమర్‌దీప్‌ శ్రీ వత్సవాయ, ఉత్తమ్‌ కుమార్‌ వివరించారు. 100 కిలోల బరువును 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉందని, సరకు రవాణాలో ఇది ఎంతో కీలకంగా మారుతుందని చెప్పారు.

హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు 30 నిమిషాల వ్యవధిలో చేరగలదని, గ్రామీణ ప్రాంతాలకూ సేవలు అందించేందుకు ఇది తోడ్పడుతుందని విశ్లేషించారు. 2026 నాటికి హైడ్రోజన్‌-విద్యుత్‌ ప్రొపెల్షన్‌తో అటానమస్‌ ఫ్లైట్‌ తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. అప్పుడే మనుషులను తీసుకెళ్లే వీటీఓఎల్‌ విమానాన్నీ ఆవిష్కరించబోతున్నట్లు వెల్లడించారు. దీనివల్ల విమానాశ్రయాలు లేని ప్రాంతాలకూ విమాన సేవలను అందించేందుకు వీలవుతుందని అన్నారు.

డ్రోన్‌ ద్వారా మందులు పిచికారీ చేస్తున్న యువకులు - 3 నెలల్లో రూ. 3 లక్షల సంపాదన - Drone Pilot Suresh Special Story

2022లో హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభించిన ఈ అంకురం ఇప్పటి వరకు రూ.18 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. ఎండియా క్యాపిటల్‌, ఐడియాస్ప్రింగ్‌ క్యాపిటల్‌, రైన్‌మ్యాటర్ క్యాపిటల్, జెరోధా ఈ మొత్తాన్ని సమకూర్చేందుకు తోడ్పాటు అందించాయి. రెండు, మూడు సంవత్సరాల్లో సిరీస్‌ ఏ ఫండింగ్‌లో భాగంగా రూ.250 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు తెలిపారు. రక్షణ అవసరాల కోసం ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లోనూ బహుళ ఉపయోగాల కోసం బ్లూజే ఒక విమానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక, మారుమూల ప్రాంతాల్లోని సైనికులకు నిత్యావసరాలను దీంతో అందిచవచ్చని వివరించారు.

Drone Port in Hyderabad: ఇదిలా ఉండగా డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ కోసం ఇస్రోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సమక్షంలో ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాశ్‌ చౌహాన్, రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ సీఈసీ ఎస్‌.ఎన్‌.రెడ్డి ఒప్పందాలపై సంతకాలు చేశారు.

YUVA : ఏఐ సాయంతో మూసీ సుందరీకరణ - సీబీఐటీ స్టూడెంట్స్ ఐడియా అదుర్స్ - YUVA ON MUSI BEAUTIFICATION

YUVA : రైతన్నకు 'డ్రోన్​' సాయం - సాఫ్ట్​వేర్​ ప్రాకేజీలకు తీసిపోని ఆదాయం - drones usage in agriculture

ABOUT THE AUTHOR

...view details