ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్ర నిధుల వినియోగంపై ఫ్లెక్సీ కడితే దాడి చేస్తారా ?: బీజేపీ యువ మోర్చా - mangalagiri aiims

BJYM State President Condemns Attack: బీజేపీ యువ మోర్చా నేత సుబ్బరాజుపై దాడిని ఖండిస్తున్నట్లు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ తెలిపారు. కేంద్రం ఇస్తున్న నిధులపై వివరాలపై ఫ్లెక్సీ పెడితే తప్పేముందని ప్రశ్నించారు. దాడి చేసిన సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబందించిన నిధుల వివరాలను తెలియజేస్తూ మరిన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.

BJYM state president condemns attack
BJYM state president condemns attack

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 4:43 PM IST

BJYM State President Condemns Attack:బీజేపీ యువ మోర్చా నేతపై సీఐ దాడి చేసిన ఘటనపై, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పేరు వాడుకోవడం పరిపాటిగా మారిపోయిందని విమర్శించారు. ఇదే అంశాన్ని ఫ్లెక్సీ ద్వారా ప్రశ్నిస్తే సీఐ దాడి చేశాడని ఆరోపించారు.

ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఆదివారం దేశవ్యాప్తంగా ఐదు ఎయిమ్స్ కళాశాల హాస్పిటల్స్​ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్​ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు పేరుతో బీజేపీ యువ మోర్చా ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీ ఏర్పాటుపై సీఐ మధుసూదన్ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడికి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సుబ్బరాజును సీఐ కొట్టడంపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ ఖండించారు. మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులు తప్పా, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఇదే అంశంపై సీఎం జగన్​, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని, సీఐ మధుసూధన్​కు సవాల్ విసురుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులకు సంబంధించి వివరాలు వెల్లడించాలని మిట్టా వంశీ తెలిపారు.

కేంద్ర నిధుల వినియోగంపై ఫ్లెక్సీ కడితే దాడి చేస్తారా?

టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: తంగిరాల సౌమ్య

తాము ఫ్లెక్సీల్లో చేసిన ఆరోపణల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లు నిరూపించాలని మిట్టా వంశీ డిమాండ్ చేశారు. నిరూపిస్తే లక్ష రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు మరోసారి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన మరిన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. కేంద్ర పథకాల్లో ఎప్పుడూ ప్రధాన మంత్రి అనే పేరుతో పథకాలు ఉంటాయని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరుతో పథకాలు ఉండవని స్పష్టంచేశారు. కానీ, రాష్ట్రంలో ప్రజల డబ్బుతో ప్రవేశపెట్టే పథకాలకు జగన్ పేరును పెట్టుకున్నారని విమర్శించారు.

బీజేపీ యువ‌మోర్చా నేతపై సీఐ దాడి చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పటికే ఖండించారు. ఓట్లతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుందని, ఎయిమ్స్ నిర్మాణానికి భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా‌ ప్రతి రూపాయి కేంద్రమే‌ ఇచ్చిందని చెప్పారు. ఎయిమ్స్ ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నీరు కూడా‌ ఇవ్వడం లేదని ఆరోపించారు. యువ మోర్చా ఫ్లెక్సీ పెట్టడంలో తప్పేం లేదన్నారు. ఎయిమ్స్ నిర్మాణంలో ప్రతి రూపాయి కేంద్రమే‌ ఇచ్చిందని, లేకపోతే లక్ష ఇస్తామని తమ యువ మోర్చా నేతలు ఫ్లెక్సీ పెట్టి మరీ అడిగారన్నారు. సీఐ యువ మోర్చా కార్యకర్తపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులు సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని వదిలేది లేదని స్పష్టం చేశారు.

20వేల కోట్ల సబ్​ప్లాన్ నిధులను ఉచిత పథకాలకు మళ్లించుకున్నారు: బీజేపీ నేత సత్యకుమార్

ABOUT THE AUTHOR

...view details