Kishan Reddy on Modis Oath Ceremony :తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న వేళ ఆయన దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంకల్ప పత్రం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే ఐదేళ్లు చిత్తశుద్ధితో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి వర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి చోటు - UNION MINISTRY TO BANDI SANJAY AND KISHAN REDDY
తెలంగాణలో గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రోడ్లు, రేషన్ బియ్యం, గ్రామాలకు మంచి నీటి సరఫరా వంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు నిర్మించామని, రాబోయే రోజుల్లో పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీని, మోదీ నాయకత్వాన్ని ప్రజలందరూ ఆకాంక్షించినట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరిధిలో తన గెలుపు కోసం పని చేసిన పదాధికారులు, మోర్చాల అధ్యక్షులకు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేసిందని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలు ఆ కుట్రలను తిప్పికొట్టారన్నారు.
మోదీ ప్రమాణస్వీకారం పూర్తి కాగానే మేళతాళాలతో కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారని తెలిపారు. రాష్ట్రంలోనూ మండల కేంద్రాల్లో ఆ కార్యక్రమాలను కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడిగా ఆదేశిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీ మరింత పుంజుకుంటుందని, ప్రజలకు సమర్థవంతగా సుపరిపాలన అందిస్తామని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తాం. సంకల్ప పత్రం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే ఐదేళ్లు చిత్తశుద్ధితో ముందుకుసాగుతాం. తెలంగాణలో గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసింది. రోడ్లు, రేషన్ బియ్యం, గ్రామాలకు మంచి నీటి సరఫరా వంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తాం. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు నిర్మించాం. రాబోయే రోజుల్లో పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తాం.- కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
సంకల్పపత్రం పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం : కిషన్‌రెడ్డి (ETV BHARAT) తెలుగు భాష గురించి ప్రపంచానికి చాటిచెప్పిన మహానీయుడు రామోజీ రావు : కిషన్‌రెడ్డి - kishan Reddy Condolences to Ramoji Rao
ఇక్కడ ఒక్కసారి గెలిస్తే - ఇంకోసారి విజయం పక్కా - ఆనవాయితీని కొనసాగించిన కిషన్ రెడ్డి - Secunderabad Lok Sabha Poll Results 2024