BJP Vijaya Sankalpa Yatra in Telangana :పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్రలతో బీజేపీ(BJP) నేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పటికే 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తైనట్లు కాషాయ శ్రేణులు వివరిస్తున్నాయి. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లేస్తేనే అమలు చేస్తామనటం ఏంటని కొమురం భీం, కాగజ్ యాత్రలోబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) ప్రశ్నించారు.
కాగజ్‌నగర్‌లో రోడ్‌షో నిర్వహించిన కిషన్‌రెడ్డి బెంగాల్ ఎస్పీఎమ్ కార్మికులు, బెంగాలీ క్యాంపులోని కాందిశీకులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు.విజయ సంకల్ప యాత్రతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్(Laxman) విమర్శించారు. యాత్రలకు వస్తున్న ప్రజాదారణను జీర్ణించుకోలేకే బీఆర్ఎస్, కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మండిపడ్డారు.
విజయ సంకల్ప యాత్రతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి : ఎంపీ లక్ష్మణ్
"లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రావడం కూడా చాలా కష్టంగా ఉంది. ఏ ప్రాతిపదికన కాంగ్రెస్‌కు ఓటు వేస్తే దేశానికి మేలు జరుగుతుందో చెప్పాలి. ఇవాళ ముఖ్యమంత్రి అంటున్నారు. తెలంగాణలో 17కు 17సీట్లు గెలిస్తే దేశంలో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని మోదీ అయితే ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అంటున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ పోయింది అన్నమాట. రాహుల్ గాంధీ అస్సలు ప్రధాని మంత్రి కాలేరు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు." - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు