Biker Helps Family on Highway in Anantapur:బండి మీద రయ్ రయ్ మంటూ దూసుకుపోతుంటే ఆ కిక్కే వేరుంటది. కానీ ఆ స్పీడ్‌లో పెట్రోలు లేక బండి ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. మరీ సిటీలో కాకుండా ఎక్కడో హైవే మీద అదీ ఫ్యామిలీతో ఉంటే సీన్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. బండి మీద వెళ్లేటప్పుడు ఉంటే హాయి ఏమో కానీ అదే బండిని తోసేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. అదే చుట్టు పక్కలా ఎక్కడా పెట్రోల్ బంక్ లేకపోతే అది ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పెట్రోలు ఇస్తే ఆ సంతోషానికి హద్దే ఉండదు. అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో కనిపించింది.
ఒక వ్యక్తి అనంతపురం హైవే మీద తన కుటుంబంతో ప్రయాణం చేస్తుండగా అనుకోకుండా పెట్రోల్ అయిపోయింది. చుట్టు పక్కల ఎక్కడా పెట్రోల్ బంక్ కూడా లేదు. దీంతో ఆ వ్యక్తి చేసేది ఏమీ లేక బండిని నెట్టుకుంటూ వెళ్తున్నాడు. అతనితో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అనుకోకుండా ఒక వ్యక్తి అటుగా వెళ్తూ ఆ బండిని తోసుకు వెళ్తున్న వ్యక్తిని చూసి ఏమైందని అడగగా పెట్రోల్ అయిపోయిందని సమాధానం ఇచ్చాడు. దీంతో బైక్‌పై వచ్చిన వ్యక్తి తన దగ్గర అదనంగా ఉన్న పెట్రోల్ బాటిల్‌ను ఇచ్చాడు. దీంతో బండిని తోసుకుంటూ వెళ్తున్న వ్యక్తి సంతోషం వ్యక్తం చేశాడు.
రాష్ట్రంలో ఎడతెరపిలేని వర్షాలు - ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు - SCHOOL HOLIDAYS DUE TO RAINS