Bigg Boss Fame Shanmukh Caught with Ganja :ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్ జశ్వంత్(Bigboss Fame Shanmukh)ను గంజాయి కేసులో నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడలో అతని నివాసంలో పోలీసులు 18 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా షణ్ముఖ్ గంజాయితో పట్టుబడగా, అతని సోదరుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విశాఖపట్టణానికి చెందిన సంపత్ వినయ్ యూట్యూబ్ వీడియోలు(Youtube Videos) చేస్తుంటాడు. ఈ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్‌కు సోదరుడు. వీరిద్దరూ కలిసి నగర శివారు ప్రాంతం పుప్పాలగూడలో నివాసం ఉంటున్నారు. విశాఖకు చెందిన వైద్యురాలైన యువతితో షణ్ముఖ్‌కు పరిచయం ఉంది. ఈ పరిచయం ద్వారా 2015లో ఆమెకు సంపత్ వినయ్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇంట్లో చెప్పగా, పెద్దలు నిశ్చితార్థం కూడా చేశారు. గత ఏడాది డిసెంబరులో వివాహం చేసుకుందామని భావిస్తే యువతి తల్లి అనారోగ్యం బారినపడడంతో వాయిదా పడింది. మళ్లీ ఈ ఫిబ్రవరి 24న పెళ్లి తేదీ నిర్ణయించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో షణ్ముఖ్ సోదరుడు ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు.
మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టిన యూట్యూబ్ ఫేం షణ్ముఖ్
YouTuber Shanmukh Jaswanth : అయితే ఈ నెల 27న మరో యువతితో సంపత్‌కు వివాహం చేస్తున్నామని అతడి తల్లిదండ్రులు యువతికి చెప్పారు. వెంటనే తాను మోసపోయానని గుర్తించిన యువతి, గురువారం నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని అతని ఇంటివద్దకు వెళ్లారు. ఆ ఇంట్లో సోదాలు నిర్వహించగా షణ్ముఖ్ జశ్వంత్ 18 గ్రాముల గంజాయితో పట్టుబడ్డాడు.