తెలంగాణ

telangana

ETV Bharat / state

రాత్రివేళ​ కారు హెడ్​లైట్స్ సరిగ్గా వెలగట్లేదా? - ఈ టిప్స్ పాటించారంటే ఫుల్ లైటింగ్!

Car Headlights Visibility Improve Tips: పగటిపూట కారులో ఎక్కడ తిరిగినా పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు.. కానీ, రాత్రివేళ జర్నీ అంటే పూర్తిగా హెడ్​లైట్ల మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. కానీ.. కొన్ని కార్ల లైట్లు సరైన లైటింగ్ ఇవ్వవు. మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టయితే.. మేము చెప్పే ఈ టిప్స్ పాటించండి.

Tips for Improve Car Headlights Visibility
Best Tips for Improve Car Headlights Visibility

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 11:57 AM IST

Best Tips for Improve Car Headlights Visibility :నైట్ టైమ్ కారు లైట్లు సరిగా వెలగకపోతే.. డ్రైవింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. రోడ్డుపై గుంతలు సరిగా కనిపించవు.. ఎదురుగా వచ్చేవారూ సరిగా కనిపించరు. కాబట్టి.. లైటింగ్ విషయంలో జాగ్రత్తలు తప్పకుండా అవసరం. కానీ.. కొన్ని కార్ల హెడ్ లైట్లు పూర్తిస్థాయిలో వెలుగు ఇవ్వవు. మీరు కూడా ఈ సమస్య ఎదుర్కొంటుంటే.. ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీ వాహనం లైటింగ్ మెరుగుపడడం పక్కా! అవేంటో ఇప్పుడు చూద్దాం..

క్లీనింగ్ : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే కారు బయటకు తీసేటప్పుడు బాడీని తుడుస్తారు. కానీ, హెడ్​లైట్స్ క్లీన్ చేయకుండా అలానే వెళ్లిపోతారు. దాంతో దుమ్ము, ధూళి పేరుకుపోయి లైటింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు హెడ్​లైట్స్ అద్దాలు క్లీన్ చేస్తుండాలి. వీలైతే వారానికి ఒకసారి హెడ్​లైట్ లెన్స్​లను సోప్ వాటర్​తో శుభ్రం చేయండి. ఫలితంగా అవి నీట్​గా ఉండడమే కాకుండా ఎక్కువ కాంతిని వెదజల్లుతాయి.

హెడ్‌లైట్స్ అప్​గ్రేడ్ :మీ కారు హెడ్​లైట్లు ఫుల్ లైటింగ్ ఇవ్వట్లేనట్లయితే వాటిని LED లేదా HIDకి అప్​గ్రేడ్ చేయండి. ఎందుకంటే అవి చాలా ప్రకాశవంతమైన కాంతిని ఇస్తాయి. అదనంగా ఎల్​ఈడీ లైట్స్ శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా బ్యాటరీపై ఎక్కువ భారం పడదు. కానీ, మీరు వాహనానికి ఆ లైట్స్ అమర్చే ముందు మీ కారుకు ఎంత కాంతి తీవ్రత హెడ్​లైట్స్ అవసరమో దగ్గరలోని RTO నుంచి తెలుసుకోవడం మంచిది.

ఎక్స్​ట్రా లైట్లు :మీరు రాత్రి వేళల్లో కారులో ప్రయాణించేటప్పుడు ఎక్కువ కాంతి అవసరం. కానీ మీ వాహనం లైటింగ్ అనుకున్నంత స్థాయిలో రాకుంటే ఆ టైమ్​లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా అదనపు లైట్లను అమర్చడం మంచిది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. అదనపు లైట్లు సెట్ చేసుకోవడానికి ముందు అందుకు మీ ప్రాంతీయ RTO అనుమతిస్తుందో లేదో తెలుసుకోవాలి.

క్లచ్​ లైఫ్​ టైమ్​ పెరగాలా? కారు డ్రైవింగ్​ సమయంలో ఈ తప్పులు చేయకండి!

పొజిషనింగ్: సాధారణంగా మీరు కొత్తగా కారు కొనుగోలు చేసినట్లయితే హెడ్ లైట్ల పొజిషనింగ్​లో ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. కానీ, ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు వాటిని మార్చినట్లయితే అవి సరిగ్గా అమర్చారో లేదో చెక్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే హెడ్​లైట్లను సరైన పొజిషన్​లో అమర్చకపోతే లైటింగ్ తక్కువ రావడమే కాదు.. ఎదురుగా వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి పొజిషన్ తనిఖీ చేయాలి.ట

ఎలక్ట్రికల్ సర్క్యూట్‌ను చెక్ చేయడం : మీ కారు హెడ్​లైట్లు సరిగ్గా రానట్లయితే మీరు చేయాల్సిన మరో పని.. బ్యాటరీ నుంచి పవర్​ తీసుకొచ్చే వాహనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ చెక్ చేయడం. ఎందుకంటే అందులో ఏదైనా లోపం ఉన్న కారు లైటింగ్ తగ్గుతుందని మీరు భావించాలి. కాబట్టి మీ వాహనం లైటింగ్ తక్కువగా వస్తుందనిపిస్తే బ్యాటరీ, వైరింగ్, ఆల్టర్నేటర్ మొదలైనవి సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి.

కొత్త వాటిని అమర్చడం : ఇక చివరగా మీ కారు హెడ్​లైట్లు తగినంత ప్రకాశవంతంగా వెలగనప్పుడు లేదా కాంతి మసకబారినట్లు కనిపిస్తే.. కొత్త వాటిని అమర్చడం మంచిది. మార్కెట్లో కార్ల ఇతర విడిభాగాల మాదిరిగానే హెడ్​లైట్​లు వివిధ మోడల్​లలో వస్తున్నాయి. అందులో మంచి హై క్వాలిటీ వచ్చే వాటిని ఎంచుకొని కొనుగోలు చేసి ఇన్​స్టాల్ చేసుకోమని సూచిస్తున్నారు నిపుణులు. ఇలా మేము చెప్పిన టిప్స్ పాటించారంటే మీ వాహనం హెడ్​లైట్ల్ ఫుల్ కాంతివంతంగా వెలగడం ఖాయం. రాత్రిపూట మంచి లైటింగ్​తో డ్రైవింగ్ చేయొచ్చు.

ఈ 5 టూల్స్ మీ కారులో ఉంటే చాలు - షోరూమ్​ బండిలా ఉంటుంది!

మీ కారు "గ్యారేజ్​కు దారెటు భయ్యా?" అంటోందా - ఇవి చెక్ చేయకుంటే అంతేమరి!

ABOUT THE AUTHOR

...view details