తెలంగాణ

telangana

ETV Bharat / state

బీటెక్​ చేసిన వారికి గుడ్​న్యూస్​ - ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ అవకాశాలు - మొదటి నెల నుంచి రూ.40వేల జీతం

బెల్​లో ప్రాజెక్ట్​ ఇంజినీర్​, ట్రైయినీ ఇంజినీర్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ - దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు మీ కోసం

BEL(Bharat Electronics Limited) Recruitment 2024
BEL(Bharat Electronics Limited) Recruitment 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

BEL(Bharat Electronics Limited) Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్​ అవుతున్నవారికి గుడ్​న్యూస్​. ఘజియాబాద్​లోని బెల్​(భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​(బెల్​) 77 ట్రెయినీ ఇంజినీర్​, ప్రాజెక్టు ఇంజినీరింగ్​ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఉద్యోగాలు :ట్రెయినీ ఇంజినీర్‌-1-49

అర్హత : ఎలక్ట్రానిక్స్‌ (ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజినీరింగ్, అప్లైడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, టెలికమ్యూనికేషన్‌),

మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌సైన్స్‌ (కంప్యూటర్‌ సైన్స్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, సీఎస్​ఈ, ఐటీ)/ఎలక్ట్రికల్​ (ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, ఈఈఈ) బ్రాంచ్‌లతో నాలుగేళ్ల బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్​ను) పూర్తిచేయాలి.

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-1-28 : పైన వివరించిన విద్యార్హతలతో పాటు రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. అకాడమీ/ టీచింగ్‌/ రిసెర్చ్‌ వర్క్, ఇంటర్న్‌షిప్‌/ ప్రాజెక్ట్‌ వర్క్‌లను ఎక్స్​పీరియన్స్​గా పరిగణనలోకి తీసుకోరు. పని అనుభవానికి సంబంధించిన డాక్యుమెంట్​లను సమర్పించాలి.

వయోపరిమితి : 01.09.2024 నాటికి ట్రెయినీ ఇంజినీర్‌ ఉద్యోగాలకు 28 ఏళ్లు, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుకు 32 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్​ ఫీజు : ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టుకు రూ.150 + 18 శాతం జీఎస్టీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుకు రూ.400 + 18 శాతం జీఎస్టీ ఉంటుంది.

ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టుకు :100 మార్కులకు రిటన్​ ఎగ్జామ్​ నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు(నెగిటివ్​ మార్కింగ్​).

  • రాత పరీక్షలో జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 30 శాతం కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
  • దిల్లీ-ఎన్‌సీఆర్, జమ్మూ, బెంగళూరు, కోల్‌కత, ఎగ్జామ్​ సెంటర్లలో ఒకదాన్ని దరఖాస్తు చేసుకునే సమయంలో ఎంచుకోవాలి. తర్వాత ఎలాంటి మార్పులకూ అవకాశం లేదు.
  • రాత పరీక్షకు ఎంపికచేసిన, తుది ఎంపికచేసిన అభ్యర్థుల పేర్లను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
  • ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-1 పోస్టుకు : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్ట్​ చేస్తారు. జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో 35 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో 30 శాతం కనీస అర్హత మార్కులను సాధించాలి.
  • ఎంపికలో రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఇస్తారు.

ఎగ్జామ్​ సెంటర్లు : వాద్సర్‌/అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, దిల్లీ/ఎన్‌సీఆర్‌లో ఒకదాన్ని ఎంచుకోవాలి.

రాత పరీక్ష/ ఇంటర్వ్యూ, తుది ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను(ఫైనల్​ లిస్ట్​ను) అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

ఒకరు రెండు పోస్టులకు అప్లికేషన్​ చేసుకుంటే వేర్వేరుగా దరఖాస్తులు నింపడంతో పాటు ఫీజు కూడా వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది.

వేతనం(జీతభత్యాలు) : ట్రెయినీ ఇంజినీర్​కు మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది రూ.35,000, మూడో సంవత్సరం రూ.35,000 శాలరీగా చెల్లిస్తారు. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుకు మొదటి ఏడాది నెలకు రూ.40,000, రెండో సంవత్సరం రూ.45,000, మూడో ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది 55,000 చెల్లిస్తారు.

దరఖాస్తుకు చేసుకునేందుకు చివరి తేదీ : 09.11.2024

వెబ్‌సైట్‌: https://bel.alobhatech.com/

కోల్​ ఇండియాలో ఉద్యోగాలు - మొదటి నెల నుంచే రూ.50వేల వేతనం

హైదరాబాద్​లోని ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాలు - అర్హతలు, జీతభత్యాల వివరాలివే! - ఆరోజే దరఖాస్తుకి చివరి తేదీ!

ABOUT THE AUTHOR

...view details