Bangladesh Residents Arrested For Illegl Staying in Khammam : ఖమ్మంలో నలుగురు బంగ్లాదేశ్ వాసులు అక్రమంగా నివాసం ఉంటున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరంతా నకిలీ పత్రాలతో ఆధార్ సహా వివిధ ధ్రువపత్రాలు పొందినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు పాస్‌పోర్టులు సైతం పొందటం గమనార్హం. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
నిందితులను మహమ్మద్ నూర్‌నబీ అలియాస్ షేక్ నూర్‌నబీ (32), మహమ్మద్ సాగర్ అలియాస్ బోడ సాగర్ (24), షేక్ జమీర్ అలియాస్ మహమ్మద్ జమీర్ (30), మహమ్మద్ అమినూర్ మండల్ (26)గా గుర్తించారు. వీరిలో మొదటి ఇద్దరికి సోదరి అయిన శాగురి ఖాతూన్ అలియాస్ శిల్ప చాలా సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ముంబయికి వచ్చి, అక్కడ ఖమ్మంవాసి అయిన బోడ రాములుతో సహజీవనం చేసింది. వీరిద్దరికి ఒక బాబు పుట్టాడు.
నకిలీ పాస్‌పోర్ట్‌ల కేసులో ఎస్బీ పోలీసుల అక్రమాలు - అబ్దుల్ సత్తార్ ముఠాకు సహకరించినట్లు గుర్తింపు
Bangladesh Residents Arrested For Possessing Fake Passports : అనంతరం శిల్ప బంగ్లాదేశ్ వెళ్లి తన సోదరులైన నూర్‌నబీ, మహమ్మద్ సాగర్‌లను ఖమ్మంనకు వెంటబెట్టుకుని తీసుకొచ్చింది. బోడ రాములు, శిల్పలను తల్లిదండ్రులుగా పేర్కొంటూ సాగర్కునకిలీ ఆధార్ కార్డును సంపాదించారు. వీరంతా ఖమ్మం శ్రీనివాస్ నగర్‌కు మకాం మార్చి, సెంట్రింగ్, ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తర్వాత వీరి బంధువైన జమీర్ సైతం ఖమ్మంనకు వచ్చాడు. నాలుగో నిందితుడైన మండల్ సైతం 11 ఏళ్ల కిందట బెంగళూరు వచ్చి, తర్వాత స్నేహితుడి ద్వారా ఖమ్మం శ్రీనివాస్ నగర్లో ఓ సెంట్రింగ్ షాపులో పని చేస్తున్నాడు. ఈ నలుగురు ఇక్కడి మహిళలను పెళ్లిళ్లు చేసుకున్నారు. నకిలీ నివాస పత్రాలతో అందరూ ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు సంపాదించారు.
నకిలీ పాస్‌పోర్ట్‌ల కేసులో కీలక పరిణామం - సీఐడీ అదుపులో ఏఎస్ఐ
బాలకార్మికుల కేసుతో వెలుగులోకి:సెంట్రింగ్ పనుల్లో ఉన్న వీరు పశ్చిమబంగా నుంచి బాల కార్మికులను ఖమ్మంనకు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. ఇక్కడి పోలీసులు ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా బాల కార్మికులను గుర్తించి, విచారించడంతో ఈ అక్రమ చొరబాట్లు వెలుగులోకి వచ్చాయి.
ఫేక్ పాస్‌పోర్టు స్కామ్‌లో వెలుగులోకి సంచలన విషయాలు - నిరక్షరాస్యులు, డ్రాపౌట్స్ కోసం టెన్త్ నకిలీ సర్టిఫికెట్స్