Bandla Ganesh Sensational Comments on Roja :బండ్ల గణేష్ సినీ నిర్మాత, నటుడు, తెలంగాణ కాంగ్రెస్ నేత. ఆయన పేరు చెప్పగానే స్టైల్ ఆఫ్ సెటైర్స్ గుర్తుకు వస్తాయి. ఈ మధ్య కాలంలో ఆయన ఏది మాట్లాడినా కాంట్రవర్సీగా మారడం సాధారణమయ్యింది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. ఓ అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను 7 O’clock బ్లేడుతో గొంతు కోసుకుంటానంటూ, టాక్ ఆఫ్ ది టౌన్‌గా అప్పుడు మారాడు. తీరా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి, టీఆర్ఎస్ (బీఅర్ఎస్) అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బండ్ల గణేష్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు.
దూకుడు పెంచిన బండ్ల: మళ్లీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం యాక్టివ్‌గా మారిన బండ్ల, తన దూకుడు మరింత పెంచారు. తాజాగా మంత్రి రోజాను డైమండ్ రాణి అంటూ విమర్శించారు. అలా ఏపీ, తెలంగాణాలో తాను అభిమానించే నేతలపై ఎవరైనా కామెంట్స్ చేస్తే ఒక్క క్షణం ఆగకుండా వెంటనే తనధైన స్టైల్లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా రేవంత్ యాక్సిడెంటల్ సీఎం అంటూ రోజా చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించారు.
మంత్రి రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు నిర్మాత బండ్లగణేశ్‌కు ఏమైంది.. అలా అన్నారేంటి?
నాన్నగారు చనిపోతే సీఏం అయిన వ్యక్తులు ఉన్నారు: రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం అన్న రోజా వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందించారు. అసలు రోజాకు టికెట్ వస్తుందో రాదో తెలియదని ఎద్దేవా చేశారు. రేవంత్ ఫైటర్, జగన్ యాక్సిడెంటల్ సీఎం అన్నారు. నాన్నగారు చనిపోతే సీఏం అయిన వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. రోజా పులుసు వండి పెట్టింది కనుకే పులుసు పాప అని ఎద్దేవా చేశారు. రోజా ఓ డైమండ్ రాణి అంటూ విమర్శించారు. ఎన్నికల అనంతరం రోజా, ఆ నేత మాజీ అవుతారని జోస్యం చెప్పారు. ఓడిపోయిన అనంతరం ఇద్దరు కలిసి హైదరాబాద్‌లో షోలు చేసుకుంటారని బండ్ల గణేష్ విమర్శించారు.
ఆయన ఒక్క పోరాట యోధుడు: మాజీ సీఎం కేసీఅర్ కొడుకుగా తప్పా కేటీఆర్‌కు ఎలాంటి గుర్తింపు లేదని బండ్ల గణేష్ విమర్శించారు. కేసీఆర్ పేరుతో కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మాత్రం అలా కాదని, ఆయన ఒక్క పోరాట యోధుడన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టిన చిత్ర హింసలు, మానసిక క్షోభను అధిగమిస్తూ సీఎం అయ్యారని బండ్ల పేర్కొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఇగో ఉంటుందని బండ్ల గణేష్ విమర్శలు గుప్పించారు. తెలంగాణాకు రేవంత్ రెడ్డి సీఏం కావడంతో కేటీఆర్ బాధలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌ను నేరుగా ఏమీ అనలేకనే వందల యూట్యూబ్ ఛానళ్లు పెట్టి తిట్టిస్తున్నారని బండ్ల గణేష్ విమర్శించారు.
చెక్ బౌన్స్ కేసు - బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష