Bandi Sanjay Fires on CM Revanth : సోనియా గాంధీ బలిదేవతని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, అలాంటిది ఇవాళ రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాను ఎలా ఆహ్వానిస్తారని బీజెేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర అధికారిక కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి, దిల్లీ వెళ్లి సోనియాను ఎలా కలుస్తారని ఆయన మండిపడ్డారు. సోనియాగాంధీ వల్లే అనేక మంది యువత చనిపోయారని బండి సంజయ్ దుయ్యబట్టారు.
రాష్ట్ర అవతరణ వేడుకలకు బీజేపీ నేతలను ఎందుకు పిలవలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ మీద సీఎం రేవంత్‌కు ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చిందని, కేసీఆర్ ఎక్కడ ఉన్నా వెతికి మరీ ఆహ్వానం ఇచ్చారని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలను కేసీఆర్ గాలికొదిలేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు.