బడి ఈడు పిల్లల బడిలో ఉండాలి - రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాలు (ETV Bharat) Badi Bata in Telangana From June 3rd 2024: చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలలకు రప్పించడమే ప్రథమ ఎజెండాగా రూపొందిన బడిబాడ కార్యక్రమం జూన్ 3న ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేయనున్నారు. బడి ఈడు ఉండి చదువుకు దూరమైన విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్చేందుకు సర్కారు షెడ్యూల్ నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను జూన్ 3 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నట్టు సర్కారు ప్రకటించింది.
ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కార్యక్రమంలో బడి వయసు పిల్లలను గుర్తించి దగ్గర్లోని పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలలను బలోపేతం చేయనున్నట్లు నిర్ణయించింది. ఇందులో కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల పరిషత్ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పేర్కొంది.
Mana ooru Mana Badi program : భలే మంచి మాస్టార్.. 'బడిబాట'ను ఎంత బాగా ప్రచారం చేస్తున్నారో..!
Telangana Badi Bata Schedule 2024 :ఇందులో భాగంగా జూన్ 3 నుంచి 11 వరకు రోజూ ఉదయం ఉదయం 7నుంచి 11 గంటల వరకు విద్యార్థుల నమోదు చేపట్టనున్నారు. గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల నమోదుపై చర్చించనున్నారు. 4న ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లల్లో విద్యకు దూరమైన వారిని గుర్తించి వారి పేర్లను పాఠశాలల్లో నమోదు చేయనున్నారు. ఇక 5 నుంచి 10 వరకు ఇంటింటికి వెళ్లి విద్యార్థుల నమోదుతో పాటు అంగన్వాడీల్లో పిల్లలను గుర్తించి వారిని ప్రాథమిక పాఠశాలల్లో నమోదు చేయనున్నారు.
11న గ్రామ సభ నిర్వహించి బడిబాట లక్ష్యాలపై చర్చిస్తారు. 12న పాఠశాలల పునఃప్రారంభంతో పాఠశాలలను ఆలంకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. 13న ఫౌండేషన్, న్యూమరసీ డేలు నిర్వహించి 14 స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టనున్నారు. 15న బాలికా విద్యా దినోత్సవంలో భాగంగా వారిని విద్యావంతులను చేస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు. 18న క్లాస్ రూమ్ డిజిటలైజేషన్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంతో పాటు మొక్కలు నాటిస్తారు. ఆ తరువాత 19న చేపట్టే క్రీడా దినోత్సవంతో బడిబాట కార్యక్రమానికి ముగింపు పలకనున్నారు.
Reading Festival in Telangana Schools : 'రేపటి నుంచి ఈ నెల 31 వరకు అన్ని స్కూళ్లలో పఠనోత్సవం'
Telangana Badi Bata Schedule 2023 : 'సర్కారు బడికే సై'.. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి బడిబాట