తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఏ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? - మీ కోసం బోలెడన్ని జాబ్ ఆఫర్స్! చెక్ చేసుకోండి

బీఏ చదివి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా - ఏ శాఖలో ఉద్యోగావకాశాలున్నాయో తెలుసా - ఉన్నత చదువులు ఏ సబ్జెక్టుల్లో చేయొచ్చు అన్న దానిపై ప్రత్యేక కథనం

BA Graduate Job Opportunities in Govt and Private Sector
BA Graduate Job Opportunities in Govt and Private Sector (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

BA Graduate Job Opportunities in Govt and Private Sector :చదువుల్లో వెనుకపడో లేక ఇతర కారణాల వల్లో కానీ చాలా మంది బీఏ కోర్సులో చేరిపోతారు. ఈ కోర్సు తీసుకున్న విద్యార్థుల సంఖ్య తక్కువే. కారణం వారికి తక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయని. మరి కొందరు ఈ కోర్సు కేవలం డిగ్రీ సర్టిఫికేట్ కోసం చదువుతుంటారు. కానీ ఈ కోర్సులో చదివేవారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అని తెలిసిన వారు తక్కువే. మరీ ఈ కోర్సు చదివిన వారికి ఏ శాఖల్లో ఉద్యోగా అవకాశాలుంటాయి, వాళ్ల కోర్సుకు దేంట్లో మంచి స్కోప్‌ ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రభుత్వ శాఖలో ఉద్యోగ అవకాశాలు : బీఏలో కోర్సు చేస్తున్న విద్యార్థుల్లో చాలామంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ చేస్తారు. అలా చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పరిశోధనలు, పరిపాలను సంబంధించిన వివిధ శాఖల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఈ సబ్జెక్ట్ చదివినవారు చాలామంది సివిల్ సర్వీసెస్‌, రాష్ట్ర స్థాయి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలు కోసం ప్రయత్నిస్తూంటారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదివిన విద్యార్థులు పాలసీ అనలిస్టులు, ఫీల్డ్‌ ఆఫీసర్లు, కన్సల్టెంట్లు లాంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రపంచ బ్యాంకు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఐఎంఎఫ్, యునెస్కో యూఎన్‌డీపీ, లాంటి అంతర్జాతీయ సంస్థలు, వివిధ కన్సల్టింగ్‌ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. వీటితో పాటు ప్రభుత్వరంగ సంస్థలు, సామాజిక రంగాలు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలను ట్రై చేయవచ్చు.

అమెరికాలో చదుకోవాలనుకుంటున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే పక్కా విసా కన్ఫామ్​ - Study In America

ఉన్నత చదువులు చదివితే ఇలా :బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్, సోషల్‌ వర్క్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్‌ పాలసీ, పొలిటికల్‌ సైన్స్, లా, జర్నలిజం సబ్జెక్టుల్లో పీజీ చేయవచ్చు. పీజీ చేసిన అనంతరం నెట్‌/ సెట్/ పీహెచ్‌డీతో విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో లెక్చరెర్‌ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఆసక్తి ఉంటే డేటా అనాలిసిస్, డెవలప్‌మెంట్‌ స్టడీస్, టౌన్‌ ప్లానింగ్, పబ్లిక్‌ ఫైనాన్స్, కమ్యూనికేషన్‌ లాంటి వాటిలో స్వల్పకాలిక కోర్సులు చేసి సంబంధిత వాటిల్లో ఉద్యోగాలు సాధించవచ్చు. బోధన రంగంలో ఆసక్తి ఉంటే డీఈడీ, బీఈడీ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ గ్రాడ్యుయేషన్‌తో డిగ్రీ అర్హత ఉన్న అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ అప్లై చేసుకోవచ్చు.

జాబ్ చేస్తూ బీఈడీ చదవాలనుకుంటున్నారా?- నిపుణులు ఏమంటున్నారంటే?

పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే హార్డ్​ వర్క్​ కాదు బ్రో - ఇలా "స్మార్ట్ వర్క్" చేయాలి! - Exams Preparation Tips

ABOUT THE AUTHOR

...view details