AP Assembly Speaker Ayyanna Patrudu :శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడు నేడు బాధ్యతలు స్వీకరిస్తారు. అసెంబ్లీలో అధికారిక ప్రకటన తర్వాత సభాపతి స్థానంలో ఆశీనులవుతారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అయ్యన్న సభా గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని ప్రకటించారు.
స్పీకర్ గురించి చంద్రబాబు నాయుడు ప్రసంగం :ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాల్లో రెండో రోజైన ఇవాళ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరుగనుంది. ఉదయం పదిన్నర గంటలకు సభ సమావేశంకాగానే తొలి రోజు మిగిలిపోయిన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.! ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి ప్రమాణం చేస్తారు. తరువాత సభకు స్వల్ప విరామం ప్రకటిస్తారు. ఉదయం 11 గంటలకు తిరిగి సభ ప్రారంభంకాగానే, ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపడతారు.
శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు- నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు - SPEAKER AYYANNA PATRUDU
స్పీకర్ పదవికి, చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్ ప్రకటించగానే ఆయన్న పాత్రుడును సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ శాసన సభా పక్ష నేతలు కలిసి స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు. ఆ తర్వాత సభా నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీకర్ గురించి ప్రసంగిస్తారు. సీఎం ప్రసంగాన్ని బలపరుస్తూ ఇతర ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు. వీటికి సభాపతి సమాధానం ఇచ్చాక అసెంబ్లీ నిరవధిక వాయిదా పడనుంది.