Awesome Projects with AI Technology VR Siddhartha Engineering College Students Makes Merry :ఏఐ మన జీవితాలను మరో ప్రపంచానికి తీసుకెళ్లింది. ఆ అద్భుత సాంకేతికత జోడించి రూపొందించే వాటిని చూసి వావ్ వాట్ ఏ ఐడియా సర్ జీ అంటాం! అయితే ఆ ఆవిష్కరణలను మనమే రూపొందిస్తే ఎలా ఉంటుందని ప్రయత్నాలు మెుదలు పెట్టారు.. ఆ ఇంజినీరింగ్ విద్యార్థులు. కళాశాల ప్రోత్సాహంతో ఏడాది పాటు కష్టపడి ట్రెండింగ్‌లో ఉన్న ఆవిష్కరణల్ని సరికొత్తగా తయారు చేశారు. ఇంతకీ ఆ విద్యార్థులు రూపొందించిన AI రోబోట్ ప్రాజెక్టులు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పిన మాటలు విజయవాడకి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు నిజం చేస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఐఏ, ఐవోటీ, మిషన్ లెర్నింగ్‌తో హ్యుమనాయిడ్ రోబో, అటానమస్ కార్, సెంటియన్ డాగ్‌లు తయారుచేసి అబ్బురపరుస్తున్నారు.
రోబో ఫుట్‌బాల్ ఆడుతుంది, కమాండ్ ఇస్తే చాలు ఎవరినైనా ఫాలో చేస్తుంది. చేతులతో మనుషులకు హాయ్ చెబుతుంది. అలాగే త్వరలో మనిషి మాట్లాడే మాటను వినే విధంగా దీన్ని రూపొందించనున్నారు. ఫేస్ రికగ్నైజేషన్, మిషన్ లెర్నింగ్, పైథాన్ అల్గారథిమ్స్ పరిజ్ఞానంతో దీనిని రూపొందించామని ఇంజినీరింగ్ విద్యార్థిని రిషిత చెబుతోంది.
ఐడియా అదుర్స్ - హైడ్రోజన్‌తో నడిచే హైబ్రిడ్ స్కూటీ ఆవిష్కరణ - Hybrid Bike Runs with Hydrogen
డ్రైవర్ లేకుండానే నడిచే కారు ఇది. దీని ముందు భాగంలో ఉన్న ఈ కెమెరా ద్వారా ఎదురు వస్తున్న వాహనాలను, వస్తువులను, మనుషులను గుర్తిస్తుంది. ఏదైనా కారుకు అడ్డు వచ్చినపుడు ఆగిపోయి పక్క నుంచి వెళ్తుంది. వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు దీనిని రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్‌లో న్యూరాన్ నెట్‌వర్క్‌తో నడిచే విధంగా ఈ కారును రూపొందించామని ఇంజినీరింగ్ విద్యార్థి ప్రవీణ్ వివరిస్తున్నాడు.
'సెంటియన్ డాగ్ శునకంలా నడుస్తున్న ఇది ఏఐ పరిజ్ఞానంతో పని చేస్తుంది. తల భాగంలో ఉన్న కెమెరాతో ఫేస్ రిగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా మనుషులను గుర్తిస్తుంది. ముందుకి, వెనక్కి నడుస్తుంది. ఏదైనా వస్తువును అనుసరించాలని కమాండ్ ఇస్తే ఫాలో అవుతుంది. మొత్తం 12 మోటార్లతో ఇది పనిచేస్తుంది. దీనిని ఆర్మీలో వినియోగించే విధంగా తీర్చిదిద్దుతున్నాం.'-వంశీ, విద్యార్థి
ఔరా అనిపిస్తున్న తెనాలి యువకుడి ప్రతిభ - టైప్‌రైటర్‌తో అందమైన బొమ్మలకు ప్రాణం - Tenali Type writing Artist
చదువుకునే దశలో ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక ఆవిష్కరణలు రూపొందించడం ప్రశంసించే విషయమని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు ఉండే ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నామని కళాశాల అధ్యాపకులు తెలిపారు. వీళ్లు రూపొందించిన ఏఐ ఆవిష్కరణలు కొత్తవేమి కాదు. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ, రూపకల్పనలో సరికొత్త ఫీచర్స్ జత చేస్తూ తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆలోచనలకు మేకిన్ ఇండియా స్ఫూర్తి అంటున్నారు ఇంజినీరింగ్ విద్యార్థులు.
కంపెనీల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా విద్యార్ధుల ప్రాజెక్టులు రూపకల్పన చేయటం మంచి పరిణామమని తెలిపారు. విద్యార్ధుల ప్రాజెక్ట్‌లు తయారు చేసేందుకు యూనివర్శిటీ పూర్తిగా సహకరిస్తుంది. ఆర్థిక సాయం అందిస్తుంది. ఇవి డెమో నుంచి కమర్షియల్ ప్రాజెక్ట్‌లుగా తయారు చేసేందుకు ఇన్నోవేషన్ హబ్ నుంచి యూనివర్శిటీ, అధ్యాపకులు సహాయం చేస్తారు. విద్యార్ధి దశ నుంచే నూతన పరికరాలను రూపొందిస్తే ఎంటర్ పెన్యూర్స్ గా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు.