తెలంగాణ

telangana

ETV Bharat / state

మీరు కారు కొనే ఆలోచనలో ఉన్నారా?- ఐతే కేవలం ఫీచర్లే కాదండోయ్- ఈ రేటింగ్​లపై ఆరా తీయాల్సిందే! - PRECAUTIONS TO BE TAKEN BUYING CAR

కారు కొనేవారికి వాహనరంగ నిపుణుల సూచనలు - క్రాష్‌ టెస్టింగ్‌ చేసిన కార్లను కొనాలంటూ సలహా

Precaution Should Be Taken While Buying A Car
Precaution Should Be Taken While Buying A Car (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2024, 8:54 AM IST

Updated : Oct 20, 2024, 11:07 AM IST

Precaution Should Be Taken While Buying A Car :కారు కొనేటప్పుడు అనేక మంది ధర, మైలేజీ, మోడల్‌, అలాయ్‌ వీల్స్‌ , వాటిలోని ఫీచర్లను చూస్తుంటారు. కానీ ప్రమాదాలు జరిగితే అందులోని ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ ఎంత అన్నది ఎంత మంది ఆలోచించేవారి సంఖ్య తక్కువే. కానీ అదే చాలా కీలకం. అందుకే కారు కొనేందుకు షోరూంకు వెళ్తే, ఎన్‌క్యాప్‌ (న్యూ కార్ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌) రేటింగ్‌పై ఆరా తీయాలని వాహనరంగ నిపుణులు సూచిస్తున్నారు. అత్యాధునిక బ్రేకింగ్‌, ప్రమాదాన్ని పనిగట్టి సమన్వయంగా అప్రమత్తమయ్యే అడాస్‌ వ్యవస్థలున్న కార్ల ధర కాస్త ఎక్కువైనా వాటినే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లోనూ సురక్షిత వ్యవస్థలున్న కార్లు అందుబాటులో ఉన్నాయని, ముఖ్యంగా బాడీ పటిష్ఠతను దృష్టిలో పెట్టుకుని కారు తీసుకోవాలని అంటున్నారు.

క్రాష్‌టెస్ట్‌ రేటింగ్ చూసారా :కొన్నాళ్ల కిందట హైదరాబాద్‌లో ఓ పోలో కారు వంతెనపై నుంచి పల్టీ కొట్టి కింద పడింది. అయినా అందులో ఉన్న ప్రయాణికులకు ఏమీ కాలేదు. మరో ప్రమాదంలో కారు వేగంగా ఢీ కొట్టడంతో బ్రిడ్జి బద్దలైంది, అయినా ప్రయాణికులు సురక్షింగా ఉన్నారు. రెండిటిలో చూసుకుంటే గట్టిదనం గల కారు బాడీ, సురక్షితమైన భద్రతా వ్యవస్థలే దీనికి ప్రధాన కారణం. కారు ప్రమాధానికి గురైతే, డ్రైవర్‌, ప్రయాణికుల భద్రత ఎంతన్నది క్రాష్‌ టెస్ట్‌ ద్వారా అంచనా వేయడానికి గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌లు రూపొందించారు. ఇందులో కారు వేగం, వివిధ కోణాల్లోంచి ఢీ కొడితే పడే ప్రభావం, లోపలున్న పిల్లలకు, పెద్దలకు కలిగే నష్టం తదితర పరీక్షల ఆధారంగా పిల్లలు, పెద్దలు వేర్వేరుగా 1 నుంచి 5 స్టార్‌ రేటింగ్‌ ఇస్తారు. కొన్ని కంపెనీలు తమ కార్లను క్రాష్‌ టెస్టుకు పంపించవు. కారు కొనేటప్పుడు వాటి గురించి వారిని అడగాలి.

మార్కెట్లోకి ఒకేరోజు రెండు కియా లగ్జరీ కార్లు- ధర, ఫీచర్లు ఇవే..! - Kia Cars Launched in India

కాప్‌ క్రాష్‌ టెస్టింగ్‌ అంటే : క్రాష్ టెస్ట్‌ అంటే చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. ప్రమాదంలో గాయాల తీవ్రతను అంచనా వేయడానికి పిల్లలు, పెద్దల డమ్మీ బొమ్మల తల, ఛాతీ, పొత్తికడుపు, కాళ్లు, చేతుల్లో బహుళ యాక్సిలోమీటర్లు, లోడ్‌ సెన్సర్లు అమర్చుతారు. ముఖ్యమైన అవయావాలకు జరిగే నష్టాన్ని గ్రాఫ్‌ వేసి దాని ద్వారా విశ్లేషిస్తారు. వాటి ప్రకారం పాయింట్లు ఇస్తారు. ఏడాదిన్నర నుంచి మూడేళ్ల లోపు వయసున్న పిల్లల నమూన బొమ్మలను ఐఎస్‌ఓఎఫ్‌ఐఎక్స్ సీట్లలో ఉంచుతారు. 49 పాయింట్లను ప్రామాణికంగా తీసుకుని పరీక్షిస్తారు. ఇందుకు కెమెరాలు, సెన్సర్లు సహా అధునాతన సాంకేతికతను వినియోగిస్తారు. పరీక్షించాల్సిన కారును ఉక్కు, అల్యూమినియంతో చేసిన ట్రాలీలతో ఢీ కొట్టి చూస్తారు. ఈ పరీక్షలు వాటి ఫలితాలు రోడ్లపై జరిగే వాస్తవ ప్రమాదాలకు భిన్నగా ఉండొచ్చు అయినా ఈ ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుంటారు.

రేటింగ్స్‌ బట్టి కొంటే :కారు భద్రతా ప్రమాణాలను విశ్లేషించేందుకు దేశంలోని కార్ల తయారీ సంస్థలు ఇప్పటి వరకు గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ రేటింగ్‌పై ఆధారపడుతున్నాయి. గతేడాది నుంచి కేంద్రం భారత్‌ ఎన్‌క్యాప్‌ను మొదలుపెట్టింది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూచ్ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఆటోమేజీవ్ రీసెర్చి అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్‌ సెంటర్ ఫల్‌ ఆటోమేటీవ్‌ టెక్నాలజీ సంస్థల నిపుణుల సేఫ్టీ రేటింగ్‌ను ఇస్తారు. గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో 5 స్టార్‌ రేటింగ్, కొత్త ప్రోటోకాల్‌ విధానంలో పిల్లలు, పెద్దల రక్షణకు అధిక పాయింట్లు సాధించిన కార్లను ఎంచుకునేందుకు ఉపయోగపడుతుంది.

అప్రమత్తమవుతున్న బ్రేక్‌ సిస్టమ్ :డ్రైవర్లు సేఫ్‌గా డ్రైవ్‌ చేయడనికి, మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలను నిరోధించడానికి రాడార్లు, కృత్రిమ మేధస్సు, సైబర్‌ సెక్యూరిటీ సెన్సర్లు, కెమెరాలతో అడాస్‌ (అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌) ఉపయోగపడుతుంది. ఇది ప్రమాదాన్ని ముందే గుర్తించి, ఆటోమెటిక్​ బ్రేక్‌లు వేస్తుంది. డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఇందులోని కెమెరా, సెన్సర్‌, రాడార్, లేజర్‌, జీపీఎస్‌ వ్యవస్థలు ముందున్న రహదారిలో అడ్డుంకులను గుర్తించి తక్షణమే అలర్ట్‌ అయ్యి వాహన వేగాన్ని తగ్గిస్తాయి. ఇలా ప్రమాదాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ప్రమాదాలను గుర్తించడం, హెచ్చరికలు జారీ చేయడం, స్వయంచాలక బ్రేకింగ్‌ వ్యవస్థల నిర్వహణకు కావాల్సిన సెన్సర్లు, కెమెరాలు ఇందులో అమర్చుతారు. పాదచారుల్ని గుర్తించి బ్రేక్‌ వేస్తుంది. రోడ్డుపైన లైన్‌ పక్కకు వెళ్తే హెచ్చరికలు జారీ చేస్తుంది. కనిపించని వైపు నుంచి వచ్చే ప్రమాదాలను గుర్తించి అలర్ట్‌ అవుతుంది. పార్కింగ్‌లోనూ సహాయ పడుతుంది. 2030నాటికి ఈ తరహా కార్లు ప్రపంచవ్యాప్తంగా విక్రయించే వాహనాల్లో 90శాతం వరకు అడాస్‌ కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

  • బీడీఎస్‌ - బ్రేక్‌ అసిస్ట్‌ సిస్టమ్‌ అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని నిలపడానికి, దూరాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. డ్రైవర్ బ్రేక్‌ వేయగానే పెడల్‌పై పడే ప్రెజర్‌ను బట్టి ఎమర్జెన్సీని గుర్తిస్తుంది. ఏబీఎస్‌కు ముందు ఇది అలర్ట్ అవుతుంది. ఇందులో మెకానికల్‌, ఎలక్ట్రానిక్‌ అని రెండు రకాలు ఉంటాయి.
  • యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఇది బ్రేక్ వేసినప్పుడు టైర్‌ లాక్‌ కాకుండా నియంత్రించేందుకు, ఆపే దూరాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • ఎలాక్ట్రానిక్‌ బ్రేకింగ్ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఒత్తిడిని ప్రతి చక్రానికి వర్తింపజేస్తూ బ్రేకింగ్‌ ఫోర్స్‌ను నియంత్రించేందుకు దోహదపడుతుంది, ఇది ఏబీఎస్‌తో కలిసి పని చేస్తుంది.
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ వేగంలో స్థిరత్వం కల్పిస్తుంది. హఠాత్తుగా బ్రేక్‌ వేసినప్పుడు కారు పల్టీలు కొట్టకుండా, పక్కనున్న వాహనాలను ఢీ కొట్టకండా ఉపయోగపడుతుంది.

ఎయిర్‌ బ్యాగ్‌ల ఉపయోగం :కారును ఎటువైపు నుంచైనా వాహనాలు ఢీ కొన్నప్పుడు మిల్లీ సెకన్లలోనే ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకుని ప్రయాణికుల తల, ఛాతీ, మెడ భాగలపై ఒత్తిడి పడకుండా, తీవ్రగాయాలు కాకుండా రక్షిస్తాయి. కొన్ని కార్ల తయారీ సంస్థలు ముందు, వెనుక కూర్చున్నవారికి రక్షణ కల్పించేలా సైడ్‌. కర్టెన్‌ ఎయిర్‌బ్యాగ్స్‌ను 2,4,6 చొప్పున అమర్చుతున్నాయి, ఢీ కొట్టే వేగం, దిశను బట్టి అధునాతన సెన్సర్లు, ఇన్‌ఫ్లేషన్ మెకానిజం, క్రాష్‌ సెన్సర్లు, ఎలక్ట్రానిక్‌ అంట్రోల్‌ యూనిట్‌, వైరింగ్‌, కనెక్టర్లు అన్ని సరిగ్గా పని చేసి ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకునేలా పనిచేస్తాయి. ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకోవాలంటే ప్రయాణికులు తప్పకుండా సీట్‌ బెల్డ్‌ ధరించాలి. సరైన పొజిషన్‌లో కూర్చోవడంతో పాటు నిర్దిష్ట బరువు ఉండాలి. 50కిలోల బరువున్న వ్యక్తి కూర్చునే సీట్లలో 5కిలోల చిన్నారిని కూర్చోబెడితే అది విచ్చుకోకపోవచ్చు. ఎయిర్‌బ్యాగ్‌ ఒకసారి తెరుచుకుంటే మళ్లీ కొత్తవి అమర్చుకోవాల్సిందే. అవి కార్ల మోడళ్లకు అనుగుణంగా ఇవి రూ.లక్షల్లో ఉంటుంది. కొన్ని బీమా సంస్థలు రీప్లేస్‌మెంట్‌ ఛార్జీలు భరిస్తాయి. ఐఎస్‌ఓఎఫ్‌ఐఎక్స్‌ చైల్డ్‌ సీట్లు ఏర్పాటు చేస్తుండగా వాటిని పరిశీలించాలి.

కార్‌ టైర్లలో గాలి పీడనంతో పాటు ప్రయాణింతే ప్రదేశాల్లోని పరిస్థితులపై ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉండాలి. భద్రత కారణాల దృష్ట్యా టైర్‌ లోతు కనీసం 3మి.మీ వరకు ఉండాలి. కొత్త టైర్లు సాధారంగా 8.9 మి.మీ లోతు ఉంటాయి. నాణేన్ని ట్రెడ్‌లో ఉంచి వాటి లోతు తెలుసుకోవచ్చు. అలా దాన్ని తెలుసుకునే పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

  • టైర్‌ ప్రెజర్ మానిటరింగ్‌ సిస్టమ్‌ ఎప్పటికప్పుడు టైర్లపై ఒత్తిడిని గమనిస్తూ డ్రైవర్‌ను అలర్ట్ చేసే విధానం ఇది. కొన్ని కార్లలో డ్యాష్‌ బోర్టులోనే టైర్లలోని పీడన స్థితి కనిపిస్తుంది.
  • ట్రాక్షన్‌ కంట్రోల్‌ తడి, మంచుతో నిండిన రహదారులు టైర్ల పట్టును తగ్గిస్తుంటాయి. ప్రతి చక్రం వేగాన్ని పర్యవేక్షించడానికి చక్రాలు జారకుండా ఇది సహాయపడుతుంది.
  • హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌ ఇది ఏటవాలు ప్రాంతాల్లో వాహనం వెనక్కి జారకుండా దోహదపడుతుంది.
  • ఫాటిక్యూ మానిటరింగ్‌ డ్రైవర్ అలసటకు గురైనా, పరధ్యానంలో నడుపుతున్నా వారిని అలర్ట్‌ చేస్తుంది.
  • క్రూయిజ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ఏం చేస్తుందంటే యాక్సిలరేటర్‌ నొక్కకుండా స్థిరమైన వేగాన్ని నిర్వహిస్తుంది.

రూ.8-14 లక్షల్లో బెస్ట్​ CNG కార్ కొనాలా? 25కి.మీ మైలేజ్ ఇచ్చే టాప్​ మోడల్స్​ ఇవే!

పండగ వేళ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు- సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 530 కి.మీ ప్రయాణం - BYD eMax 7 Launched

Last Updated : Oct 20, 2024, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details