తెలంగాణ

telangana

ETV Bharat / state

అర్ధరాత్రి యువతిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం కేసు - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు - WOMAN RAPE IN GACHIBOWLI

గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధి మసీద్‌బండ ప్రాంతంలో దారుణం - ఆటో ఎక్కిన యువతిపై డ్రైవర్‌ అఘాయిత్యం - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

DRIVER RAPED WOMEN IN HYDERABAD
Auto Driver Rapes Woman in Gachibowli (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2024, 10:15 AM IST

Updated : Oct 16, 2024, 3:35 PM IST

Auto Driver Rapes Woman in Gachibowli Latest Update :గత అర్ధరాత్రి(మంగళవారం)హైదరాబాద్‌లో యువతిపై ఆటోడ్రైవర్‌ అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధి మసీద్‌బండ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. పరారీలో ఉన్న ఆటోడ్రైవర్​ను సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అటుగా వెళుతున్న ఫుడ్​ డెలివరీ బాయ్స్​ కాపాడి పోలీసులకు సమాచారం అందించారు.

గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ హబీబుల్లాఖాన్‌ తెలిపిన వివరాల ప్రకారం, చెన్నైకి చెందిన యువతి గచ్చిబౌలిలోని నానక్‌రాంగూడలో నివాసముంటోంది. ప్రైవేటు సంస్థలో ఆర్కిటెక్టుగా పనిచేస్తోంది. ఇటీవల దసరా సెలవుల నేపథ్యంలో సొంతూరు వెళ్లిన ఆమె సోమవారం అర్ధరాత్రి నగర శివారు రామచంద్రాపురం దగ్గర రాత్రి ఒకటిన్నర గంటలకు బస్సు దిగింది. అక్కడే నానక్‌రాంగూడ వెళ్లేందుకు ఆటో ఎక్కింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రధాన రోడ్డులో ఉన్న మసీద్‌బండ కమాన్‌ వద్దకు రాగానే డ్రైవర్‌ వాహనాన్ని పక్కకు నిలిపాడు. యువతి ప్రశ్నించేలోపే వెనుక సీటులోకి వచ్చి ఆమె నోరునొక్కి దాడి చేశాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించగా డ్రైవర్‌ జరిపిన దాడిలో తలకు గాయమైంది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ గమనించి ఆటో దగ్గరికి వచ్చారు.

సీసీ కెమెరాల ద్వారా నిందితుడు గుర్తింపు : ఈ క్రమంలో ఆటోడ్రైవర్‌ యువతిని కిందకు తోసేసి పారిపోయాడు. డయల్‌ 100కు సమాచారం అందించగా ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. ఆటోడ్రైవర్‌ తనపై అత్యాచారం చేసి పారిపోయినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాలు, ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. ఆటోడ్రైవర్ ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్‌ను లింగంపల్లి గోపీనగర్‌లో పట్టుకున్నారు. ప్రవీణ్ స్వగ్రామం నల్గొండ జిల్లా కేతిపల్లిగా గుర్తించారు. నిందితుడిని రేపు కోర్టులో హాజరు పరిచే అవకాశముంది.

ఒంటరి మహిళలపై ఇలాంటి దాడులు జరుగుతున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఉండకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరిపైన అయిన అనుమానంగా ఉంటే డయల్​ 100కు కాల్​ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అత్తాకోడళ్లపై అత్యాచారానికి ఒడిగట్టిన కిరాతకుల అరెస్ట్​ - నిందితుల్లో ముగ్గురు మైనర్లు

ఆటోలో అత్యాచారం! - ఆటో డ్రైవర్​పై ఫిర్యాదు చేసిన యువతి

Last Updated : Oct 16, 2024, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details