తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో హుక్కా కేంద్రాలపై నిషేధం - బిల్లుకు అసెంబ్లీకి ఏకగ్రీవ ఆమోదం - తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం

Assembly Approves Hookah Centers Ban Bill in Telangana : తెలంగాణలో హుక్కా కేంద్రాలపై నిషేధ బిల్లును అసెంబ్లీలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ లేకుండానే శాససనభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని సభాపతి ప్రసాద్​కుమార్ వెల్లడించారు. శాసనమండలిలోనూ ఈ బిల్లును ప్రవేశపెట్టగా, ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు.

Hookah Centers Ban in Telangana
Hookah Centers Ban in Telangana

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 12:07 PM IST

Updated : Feb 12, 2024, 2:25 PM IST

Assembly Approves Hookah Centers Ban Bill in Telangana : రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపంతో సభ మొదలైంది. ఈ క్రమంలోనే తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరఫున మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభ ముందుకు తీసుకొచ్చారు. ఎలాంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా అసెంబ్లీ దీనికి ఆమోదం తెలిపింది. అలాగే సిగరెట్లు, పొగాకు ఉత్పత్తి, సరఫరా నియంత్రణ, ప్రకటనల నిషేధ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ మేరకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు.

Telangana Assembly Sessions 2024 : సిగరెట్‌ కంటే హుక్కా పొగ మరింత హానికరమని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. బొగ్గు ఉపయోగించడం వల్ల కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలవుతుందని చెప్పారు. దీన్ని సేవించే వారి వల్ల చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదమని పేర్కొన్నారు. అందుకే హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) భావించారని శాసనసభలో ఆయన ప్రస్తావించారు.

శాసనమండలిలోనూ మంత్రి శ్రీధర్​బాబు హుక్కా కేంద్రాల (Hookah Centers Ban Telangana)నిషేధ బిల్లు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల బిల్లును ప్రవేశపెట్టారు. యువతను అవకాశంగా తీసుకుని హుక్కా నిర్వాహకులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని అన్నారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని మండలి సభ్యులను ఆయన కోరారు. ఈ బిల్లుపై సానుకూలంగా స్పందించిన సభ్యులు మద్దతు తెలిపారు.

Legislative Council Approves on Hookah Centers Ban Bill :అనంతరం దీనిపై మండలిలో చర్చ కొనసాగింది. ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి స్పందించారు. హుక్కా చాలా ప్రమాదకరమని, దీనికి యువత బానిసలు అవుతున్నారని చెప్పారు. మాదకద్రవ్యాల విక్రయదారులపై కఠిన శిక్షలు ఉండాలని సూచించారు. హైదరాబాద్​లో ఎక్కడ చూసినా డ్రగ్స్ అనే పేరు వినిపిస్తోందని వాణీదేవి వివరించారు.

చిన్న పిల్లలు కూడా హుక్కాకు బానిస అవుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్​కుమార్ గౌడ్ అన్నారు. వీటిని నిషేధించడంతో పాటు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. పొరుగు రాష్ట్రాల వారితో కూడా మాట్లాడి చర్యలు చేపట్టాలని కోరారు. పొగాకు, గంజాయి వంటి సిగరెట్లు దొరుకుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని మరో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. గంజాయి చాక్లెట్లు కూడా మార్కెట్​లో దొరుకుతున్నాయని, దీంతో హైస్కూల్ స్థాయి నుంచే యువత నష్టపోతుందని ఆయన చెప్పారు.

Telangana Government Banned Hookah Centers :సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రంలో గుట్కాపై నిషేధం విధించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా గంజాయి విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా మంచి బిల్లు అని ఆమె అన్నారు. గ్రామాల్లో గంజాయి వాడకం భారీగా పెరిగిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మండలి దృష్టికి తీసుకువచ్చారు. హుక్కా పార్లర్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టిసారించాలని ఛైర్మన్ సూచించారు.

అసెంబ్లీ సమావేశాలు పొడిగించే అవకాశం - 16 వరకు ఉభయసభల భేటీ!

రాష్ట్రంలో డ్రగ్స్, నకిలీ విత్తనాలు అనే పదాలు వినిపించేందుకు వీల్లేదు - పోలీసులకు సీఎం కీలక ఆదేశాలు

Last Updated : Feb 12, 2024, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details