ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆశ కార్యకర్తలపై పోలీసుల ప్రతాపం- ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించిన అక్క, చెల్లెమ్మలు - ఆశా కార్యకర్తలు రాస్తారోకో

Asha Workers Fires On YSRCP Govt : రాష్ట్రమంతా ఆశ కార్యకర్తలు నిరసనలు, ధర్నాలతో హోరెత్తుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఆశ కార్యకర్తలు చలో విజయవాడ పేరిట మహాధర్నాకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో విజయవాడకు తరలిన నిరసన కారులపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని వారు వాపోయారు.

asha_workers_fires_on_ysrcp_govt
asha_workers_fires_on_ysrcp_govt

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 5:13 PM IST

Asha Workers Fires On YSRCP Govt :విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆశ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ వెళ్తున్న ఆశా కార్యకర్తలు అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆశాల నినాదాలు హోరెత్తాయి. కనీస వేతనం 26 వేలు పెంచి, 10లక్షల రూపాయలు గ్రూప్‌ ఇన్సూరెన్స్ సౌకర్యం, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే తమపై పోలీసులను ఉసిగోల్పి కర్కశంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు.

ఆశావర్కర్లపై పోలీసుల ఉక్కుపాదం - బలవంతంగా అరెస్ట్​

Andhra Pradesh Asha Workers Protest in Vijayawada :అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆశా కార్యకర్తలు నిరసన చేపట్టారు. రావులపాలెం తహశీల్దారు కార్యాలయం వద్ద తమ డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాకు వెళుతున్న తమపై పోలీసులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటని ఆశా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆశా వర్కర్లపై పోలీసుల దౌర్జన్యం - రోడ్లపై ఈడ్చుకుంటూ అరెస్టులు

Asha Workers Chalo Vijayawada :ధర్నాకు వెళ్తున్న తమపై నిరంకుశంగా వ్యవహరించిన పోలీసుల తీరుని నిరసిస్తూ, సమస్యలు పరిష్కారం చాలని కోరుతూ గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా అక్కలు నా చెల్లెలు అంటున్న ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన గౌరవ దుస్తులు ధరించుకుని రోడ్డు మీదకు వస్తున్న తమను వివస్త్రలను చేయడమేనా అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.

'ఆశా వర్కర్ల ఛలో విజయవాడ' అడ్డుకున్న పోలీసులు - పలువురి అరెస్టు

Asha Workers Fires On Police :ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేసి ఇష్టానుసారంగా మమ్నల్ని తరలించి, నీరు, తిండి లేకుండా చేస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా పోలీసుల వైఖరి అరాచకందగా ఉందని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కా,చెల్లెళ్లకు ఇలానే న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. గౌరవ వేతనం పెంచడంతోపాటు పని భారం తగ్గించాలని పలు డిమాండ్లు చేశారు.

సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్ల 36 గంటల నిరసన దీక్ష- కలెక్టరేట్‌ ముట్టడికి యత్నం

ABOUT THE AUTHOR

...view details