APTF 80th Year Celebrations Concluded :ఏపీటీఎఫ్ 80 వసంతాలను పురస్కరించుకుని విజయనగరంలో గత మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర మహాసభలు విజయవంతంగా ముగిశాయి. చివరి రోజున రాష్ట్ర అధ్యక్షుడు జి. హృదయరాజు అధ్యక్షతన ప్రతినిధుల సభ నిర్వహించారు. ముందుగా రాష్ట్ర కార్యదర్శి ఎస్.చిరంజీవి ప్రవేశపెట్టిన విధాన పత్రంపై చర్చ సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వివిధ జిల్లాల ముఖ్య నాయకులంతా తమ అభిప్రాయాలను తెలియజేశారు. మహాసభలకు హాజరైన మేధావుల అభిప్రాయాలను జోడించి తీర్మానాలు రూపొందించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ తీర్మానాలను నివేదించనున్నట్లు ముఖ్య నాయకులు తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించి, విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికే గత ప్రభుత్వం 117 జీవోను తీసుకొచ్చిందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి పేర్కొన్నారు. గత అయిదేళ్లు విధ్వంసం సృష్టించిన ఈ జీవోను రద్దు చేసి, విద్యావ్యవస్థను బాగుచేయాలని కోరారు. ఇప్పటికే రద్దు చేయానికి కూటమి ప్రభుత్వాన్ని కోరామని, విద్యా సంవత్సరం మధ్యలో ఉండడంతో కొంత సమయం అడిగిందని తెలిపారు. రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తామని, జీవో రద్దుతో పాటు ప్రపంచబ్యాంకు షరతులను ఉపసంహరించుకోవాలన్నారు.
ప్రజల జీవితాలతో చెలగాటమాడిన వైఎస్సార్సీపీకి తగిన బుద్ధి చెప్పారు: ఏపీటీఎఫ్ - APTF Leaders on YSRCP Govt
విద్యాశాఖలో ప్రస్తుతం పని చేస్తున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించి, భవిష్యత్తులో చేపట్టే ఉపాధ్యాయ నియామకాలు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని, డీఎస్సీ నియామకాలు పూర్తయ్యే వరకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని, పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు, ఇతరత్రా అంశాల్లో నెలకున్న సందిగ్ధతను ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పరిష్కారం చూపాలన్నారు. అదే విధంగా ఉపాధ్యాయులకు సేచ్చాయుత బోధన చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాప్ల భారాన్ని తగ్గించాలని, మరుగుదొడ్ల చిత్రీకరణకు ప్రత్యేక సిబ్బందిని నియమించి విద్యాబోధన సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఉపాధ్యాయులను 48 పిరియడ్ల నుంచి 32 పిరియడ్కు కుదించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఫించనర్ల ప్రయోజనాలకు సంబంధించి డిమాండ్లను పరిష్కారించాలని తీర్మానాలు చేసినట్లు తెలిపారు. గురుకులాలు, సొసైటీలకు అడగకుండా పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు చేశారని అన్నారు. విద్యాశాఖకూ వర్తింప జేయాలని, మూడు నెలల కాలంలో ఉపాధ్యాయుల జీతాల నుంచి మినహాయించిన మొత్తం నుంచి బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత పీఆర్సీలో లోపాలను సవరించాలని, 12వ పీఆర్సీ నూతన కమిటీ నియమించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో ప్రతినిధులు తీర్మానించారు.
విమర్శలకు తావులేకుండా మెగా డీఎస్సీ నిర్వహించాలి - అధికారులను ఆదేశించిన మంత్రి లోకేశ్ - Nara Lokesh Review With Officials
చంద్రబాబు ఒక్క సంతకంతో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ - జగన్ ఈ పని ఎందుకు చేయలేదు? - MEGA DSC WITH 16347 POSTS