APSRTC Launches Electric Bus Service :ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) విద్యుత్ బస్సుల దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే ఐదు సంవత్సరాలల్లో డీజిల్ బస్సుల అన్నీ పక్కన పెట్టి వాటి స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకోవడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన విద్యుత్ వాహనాల విధానం 2024-2029కి అనుగుణంగా 2029 నాటికి సంస్థలో అన్నీ విద్యుత్ బస్సులే నడపాలని భావిస్తున్నారు. అప్పటికల్లా ఏపీఎస్‌ఆర్టీసీ సొంత బస్సులు 10,155, అద్దెవి 2,562 కలిపి మొత్తం 12,717 బస్సులూ విద్యుత్‌వే ఉండాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు.
Electric Buses in AP :ప్రస్తుత మోటారు వాహన చట్టం ప్రకారం 15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ వాహనాలను తుక్కు (స్క్రాప్)గా మార్చాలి. వచ్చే ఐదు సంవత్సరాలల్లో 2,537 బస్సులకు 15 సంవత్సరాలు దాటుతుంది. వీటినీ తుక్కుగా మార్చి, వాటి స్థానే విద్యుత్ బస్సులు తీసుకు రానున్నారు. 12 లక్షల కి.మీ. తిరిగిన ఏసీ బస్సులు, 10 లక్షల కి.మీ. తిరిగిన అల్ట్రా డీలక్స్‌లు, సూపర్ లగ్జరీ, 8 లక్షల కి.మీ. నడిచిన ఎక్స్‌ప్రెస్‌లు, 6.5 లక్షల కి.మీ. ప్రయాణించిన తిరుమల ఘాట్ (Saptagiri Express) సర్వీసులు, 8 లక్షల కి.మీ. పూర్తి అయిన మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, 12 లక్షల కి.మీ. దాటిన పల్లె వెలుగు, 13 లక్షల కి.మీ. తిరిగిన సిటీ ఆర్డినరీ బస్సులను పక్కన పెట్టాలి. వచ్చే ఐదు సంవత్సరాలల్లో ఇలాంటివి 5,731 బస్సులను పక్కన పెట్టనున్నారు. 2029లో తీసుకోబోయే 1,285 అద్దె బస్సులు, 2025-29 వరకు కొత్తగా పెంచబోయే 1,698 బస్సులు, 2029లో అదనంగా చేర్చబోయే 2,726 కూడా విద్యుత్ బస్సులే తీసుకుంటారు.
Electric Bus: కడప-తిరుపతి మధ్య విద్యుత్ బస్సులు.. ప్రారంభించిన ఆర్టీసీ ఛైర్మన్