Sankranti Festival 2025 :సంక్రాంతి పండగ అంటే తెలుగు లోగిళ్లలో స్వచ్ఛమైన పల్లెటూరి పండగ. ఈ పెద్దల పండక్కి దేశ నలుమూల ఎక్కడున్న సరే జనాలు సొంతూళ్లలో వచ్చి వాలిపోతుంటారు. అందరిని ఒక దగ్గరకి చేర్చుతూ, కుటుంబాలను కలసిమెలసిగా ఉల్లాసంగా ఉంచుతుంది ఈ సంక్రాంతి. సంక్రాంతి ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు సొంతూరికి వెళతామా అని ఎదురు చూసేవాళ్లు ఉన్నారు. ముఖ్యంగా సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకే ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ ఖాళీ అవుతుందంటే నమ్మగలరా? సంక్రాంతి పండగను ఇంటిళ్లవాది ఘనంగా చేసుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండక్కి 2,400 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్న వెల్లడించింది.
సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటినుంచే చాలా మంది ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. అందులోనూ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి సంక్రాంతి పండక్కే లక్షల మంది తరలివెళతారు. అలాంటి వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ చక్కనైన శుభవార్త చెప్పింది. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వారి కోసం ఏకంగా 2,400 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.