ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్మార్ట్​మీటర్లపై కథనాలు- APSPDCL ఎండీ సంతోషరావుని వివరణ అడిగిన మంత్రి గొట్టిపాటి - APSPDCL MD MEET MINISTER GOTTIPATI

స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లుల చెల్లింపు కథనాలపై వివరణ కోరిన మంత్రి - మీడియా కథనాలపై సీఎం అసంతృప్తిని సంతోష్‌రావు దృష్టికి తీసుకెళ్లిన మంత్రి

APSPDCL MD Santosh Rao Meet Minister Gottipati
APSPDCL MD Santosh Rao Meet Minister Gottipati (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2025, 6:04 PM IST

APSPDCL MD Santosh Rao Meet Minister Gottipati : నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లుల చెల్లింపులు, మీడియా కథనాలపై ఏపీఎస్పీడీసీఎల్(APSPDCL) ఎండీ సంతోషరావుని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరణ కోరారు. మీడియాలో వరుస కథనాలపై ముఖ్యమంత్రికి ఉన్న అసంతృప్తిని మంత్రి గొట్టిపాటి ఎండీ సంతోషరావు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కాకుండా ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని మంత్రి ఎస్పీడీసీఎల్ ఎండీకి స్పష్టం చేశారు. విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ని ఎస్పీడీసీఎల్ ఎండి సంతోష్ రావు అమరావతిలో కలిశారు. గ్రామాల్లో విద్యుత్ ప్రమాదాలు తగ్గాలని మంత్రి ఆదేశించారు. అలాగే వేసివిలో విద్యుత్ కోతలు ఉండరాదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ హామీ మేరకు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details