APPSC Chairman Gautam Sawang Resign :ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గౌతమ్ సవాంగ్ కొంతకాలం డీజీపీగా కొనసాగారు. 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు పదవిలో ఉన్న ఆయన ఉద్యోగ విరమణకు రెండేళ్ల ముందే రాజీనామా చేశారు. అనంతరం సవాంగ్‌ను అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించింది. 2022 మార్చిలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి - అది భావప్రకటన స్వేచ్ఛ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు :వైఎస్సార్సీపీతో అంటకాగిన అధికారిగా గౌతమ్ సవాంగ్ ముద్ర వేసుకున్నారు. డీజీపీగా గౌతమ్ సవాంగ్ వ్యవహార శైలి పలుమార్లు విమర్శల పాలైంది. ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ఆయన హయాంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ విధానాల్ని, లోపాల్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టారు. ప్రభుత్వ పెద్దలు చెప్పారంటూ వారికి అనుకూలంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.
గ్రూప్-1లో అక్రమాలు రుజువైనా బుకాయిస్తున్నారు- సవాంగ్ రాజీనామా చేయాలి: పట్టాభి
ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నాయకులపై గౌతమ్ సవాంగ్ హయాంలో తీవ్ర అణచివేత కొనసాగింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు నిర్వహించే కార్యక్రమాలకు కోవిడ్ నిబంధనల పేరిట పోలీసులు అనుమతి ఇచ్చేవారు కాదు. అధికార పార్టీ నాయకులు వేలమందితో కార్యక్రమాలు చేసినా పట్టించుకునేవారే కాదు. ప్రతిపక్షాల నాయకులు, ప్రజాసంఘాలు నాయకులు తమపై జరుగుతున్న దాడుల గురించి విన్నవిద్దామని డీజీపీని కలిసేందుకు వెళ్లినా సవాంగ్ వారిని కలిసేవారు కాదు. ప్రతిపక్ష నాయకులు లేఖలు రాసినా స్పందించేవారు కాదు.
కోర్టు ధిక్కరణ కేసు.. హైకోర్టుకు హాజరైన మాజీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి
వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన కొన్నాళ్లకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు రాజధానిలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు రాళ్లు, చెప్పులు విసిరారు. ఆ ఘటనపై గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ.. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, అది భావప్రకటన స్వేచ్ఛ అని వ్యాఖ్యానించారు. అమరావతిలో రాజధాని ఉండాలని పోరాడుతున్న రైతులపై సవాంగ్ హయాంలో తీవ్ర అణచివేత, లాఠీఛార్జీలు సాగాయి. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. రైతులకు సంకెళ్లు వేసి మరీ తరలించారు. వారు చేపట్టిన మహా పాదయాత్రకు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు. విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటిస్తే.. ఆయన్ను విమానాశ్రయం నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకుని నోటీసులిచ్చారు. ఈ వ్యవహారంలో డీజీపీ హైకోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Gautam Sawang: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ నియామకం