ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరుద్యోగులకు శుభవార్త - పెండింగ్ నోటిఫికేషన్స్​ కోసం ఏపీపీఎస్సీ చర్యలు

పెండింగ్​లో ఉన్న ఉద్యోగ నియామకాలు పూర్తి చేయడంపై ఏపీపీఎస్సీ దృష్టి - వీలైనంత త్వరగా పూర్త చేసేలా కార్యాచరణ

appsc_recruitments
appsc_recruitments (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2024, 9:22 PM IST

Updated : Nov 27, 2024, 10:41 PM IST

APPSC Actions for Pending Notifications Recruitments:పెండింగ్​లో ఉన్న ఉద్యోగ నియామకాలు పూర్తి చేయడంపై ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ అనురాధ దృష్టి పెట్టారు. గత ప్రభుత్వం పేరుకు పలు విభాగాల్లో అరకొర సంఖ్యలో ఖాళీల భర్తీ కోసం పలు ఉద్యోగ నోటిఫికేషన్లు వదలింది. సత్వరమే నియామక ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా తీవ్ర జాప్యం చేసింది. దీంతో పలు ఉద్యోగాల నియామకాలు ఏళ్ల తరబడి నిలిచిపోయాయి. దీనివల్ల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 సహా అంతకు ముందు విడుదల చేసిన 19 నోటిఫికేషన్ల నియామకాలు పెండింగ్​లో ఉండగా క్రమంగా వాటన్నింటినీ పూర్తి చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

పలు పరీక్షల ఫలితాలు విడుదల చేయడం సహా నియామక ప్రక్రియను పూర్తి చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 2 నోటిఫికేషన్​కు పరీక్ష తేదీలు నిర్ణయించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణ సహా మిగిలిన పలు నియామకాల ప్రక్రియ పూర్తి కోసం చర్యలు తీసుకుంటోంది. గతేడాది జూన్​లో నోటిఫికేషన్ విడుదల చేసి పెండింగ్​లో ఉన్న హోమియోపతిలో లెక్చరర్ల పరీక్షా ఫలితాలను విడుదల చేసిన ఏపీపీఎస్సీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తేదీలను కూడా ప్రకటించింది. డిసెంబర్ 3న దృవపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేసింది.

2021లో నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు జరిగినా ఫలితాలు విడుదల చేయకుండా మిగిలిన దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ వెబ్ సైట్​లో పొందుపరిచారు. ఇప్పటికే నోటిఫికేషన్లు వదలి నియామక ప్రక్రియ పెండింగ్​లో ఉన్న పలు ఉద్యోగ నియామకాల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కార్యాచరణను ఏపీపీఎస్సీ అమలు చేస్తోంది.

గంజాయి అడ్డుకట్టకు 'ఈగల్' - 1972టోల్​ ఫ్రీ నంబర్ ఆవిష్కరించనున్న సీఎం : హోంమంత్రి అనిత

ఏపీలో పర్యాటకం పరుగులు - తొలివిడతగా రూ.113 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

Last Updated : Nov 27, 2024, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details