ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైకో పార్టీ సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది - ఆఖరికి తల్లిని, చెల్లిని వదల్లేదు: షర్మిల - YS SHARMILA ON FAKE POSTS

సోషల్ మీడియా సైకోల బాధితుల్లో తానూ ఉన్నానన్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

YS SHARMILA
YS SHARMILA (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 6:30 PM IST

YS Sharmila Tweet On Fake Posts : సామాజిక మాధ్యమాలు సమాజానికి మంచి చేయాలని కానీ కొందరు సైకోలు, సైకో పార్టీలతో కలిసి సోషల్ మీడియాను భ్రష్టు పట్టించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాలుగా మారారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

"సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి భ్రష్టు పట్టించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాలుగా మారారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి, సాటి మహిళా అనే ఇంగితం లేకుండా, రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందారు. సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిగా చెప్తున్నాను.

అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టి, పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి. నా మీద, అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని అవమానించారు. నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై నేను కూడా పోలీస్ కేసు పెట్టాను. అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నాం. అరాచక పోస్టులు పెట్టే వాళ్లు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం" అని షర్మిల ట్వీట్ చేశారు.

"చంద్రబాబుకూ కోపం తెప్పించారుగా" - వాళ్లందరి కొవ్వు కరిగిస్తామని హెచ్చరించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details