ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

ETV Bharat / state

ఏపీ టెట్ హాల్‌టికెట్లు విడుద‌ల‌ - తప్పులు ఉంటే ఇలా చేయండి! - AP TET Hall Tickets Released

AP TET Hall Tickets Released : ఏపీ టెట్ 2024 పరీక్ష హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం వంటి పొరపాట్లు దొర్లాయి. దీంతో టెట్‌ అభ్యర్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించారు. హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే అవసరమైన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించి పరీక్ష కేంద్రం వద్ద నామినల్‌ రోల్స్‌లో సరిచేయించుకోవచ్చని అభ్యర్థులకు సూచనలు చేశారు

AP TET Hall Tickets Released
AP TET Hall Tickets Released (ETV Bharat)

AP TET Hall Ticket 2024 :ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. టెట్‌ జులై-2024కు 4,27,300 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లు విద్యాశాఖ వెబ్​సైట్​లో http://cse.ap.gov.in నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2,84,309 మంది హాల్ టికెట్స్​ డౌన్​లోడ్ చేసుకున్నారని చెప్పారు.

కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం వంటి పొరపాట్లు దొర్లాయని విజయరామరాజు తెలిపారు. హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే అవసరమైన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించి పరీక్ష కేంద్రం వద్ద నామినల్‌ రోల్స్‌లో సరిచేయించుకోవచ్చని అభ్యర్థులకు సూచించారు. వీటి కోసం పరీక్షా కేంద్రాల దగ్గర అధికారులు ఏర్పాట్లు చేస్తారని ఆయన చెప్పారు.

అభ్యర్థులు గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 11, 12 తేదీలు మినహా అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని విజయరామరాజు పేర్కొన్నారు. సందేహాలు ఉంటే డైరెక్టరేట్ కమీషనర్ కంట్రోల్ రూమ్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇంకా అభ్యర్థుల సందేహాల కొసం 9398810958, 6281704160, 8121947387, 8125046997, 7995789286, 9398822554, 7995649286, 9963069286, 9398822618 నంబర్లకు ఫోన్‌ చేస్తే సమాధానం ఇస్తారన్నారు. సందేహాలను ఈ మెయిల్ grievences.tet@apschooledu.inకి పంపాలని విజయరామరాజు వెల్లడించారు.

వ్యాపారానికి పట్టణమే అవసరం లేదు - మంచి ఆలోచన ఉంటే చాలంటున్న యువతి - Eco Friendly Bags

AP TET 2024:16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీకి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి టెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జులై 2న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్‌, డీఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెట్‌ షెడ్యూల్‌లో పలు మార్పులతో సవరించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్‌ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వరకు టెట్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా వాటిని అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.

కుక్కల విద్యాసాగర్‌ రిమాండ్ రిపోర్ట్​లో కీలక అంశాలు - నిందితుల్లో పలువురు ఐపీఎస్‌లు - Kadambari Jethwani Case Updates

కోనసీమ కొబ్బరికి మంచి రోజులు - నెల రోజుల్లోనే రెట్టింపు ధర - Konaseema Coconut Prices Hike

ABOUT THE AUTHOR

...view details