AP Students Become Toppers in Telangana EAP Set:తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో (Telangana EAP Set Results) ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీలోనూ మొదటి రెండు ర్యాంకులూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కాయి. ఆయా విభాగాల్లో తొలి 10 ర్యాంకుల్లో ఐదేసి చొప్పన మన రాష్ట్ర విద్యార్థులే సొంతం చేసుకున్నారు.
మెడికల్ విభాగం నీట్‌లోకి వెళ్లిన తర్వాత తెలంగాణలో ఈఏపీ సెట్ పేరుతో నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 3 లక్షల 32 వేల 251 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 89 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ ర్యాంకుల్లో తొలి 10 ర్యాంకుల్లో అబ్బాయిలే సత్తాచాటినట్లు తెలంగాణ విద్యాశాఖ (Telangana Education Department) వెల్లడించింది.
ఆలయ భూములపై కన్ను - పూజారి కిడ్నాప్! 12 రోజులు చిత్రహింసలు - PRIEST KIDNAP
శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన ఎస్.జ్యోతిరాదిత్య మొదటి ర్యాంకు సాధించారు. కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన గొల్లలేఖ హర్ష రెండో ర్యాంక్, కర్నూలుకు చెందిన మురసాని సాయి యశ్వంత్‌రెడ్డి ఐదో ర్యాంక్ కైవసం చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీలో మదనపల్లెకు చెందిన ఆలూరు ప్రణీత ఒకటో ర్యాంకు కైవసం చేసుకుంటే విజయనగరం వాసి నాగుదాసరి రాధాకృష్ణ రెండు, చిత్తూరు వాసి సోంపల్లి సాకేత్ రాఘవ్ 4వ ర్యాంక్ సాధించారు.