AP Sadhu Parishad Srinivasananda Saraswati :మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా తిరుపతిలో హిందూ ధార్మిక సంఘాలు మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో ఏపీ సాధుపరిషత్ శ్రీనివాసానంద సరస్వతి, టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని అన్నారు. జగన్ ఏనాడైనా ఆయన సతీమణిని దర్శనానికి తీసుకొచ్చారా? అని శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. ఇంట్లో పూజ చేస్తేనే పక్కన భార్య ఉండేట్లు చూసుకుంటామని అన్నారు.
జగన్‌కు అభ్యంతరం ఏంటి? : గత ఐదేళ్లలో ఏనాడైనా డిక్లరేషన్‌పై జగన్ సంతకం చేశారా? తిరుమలకు ఏ రోజైనా కుటుంబంతో కలిసి జగన్ వచ్చారా? తిరుమల సంప్రదాయాలను జగన్ ఎందుకు పాటించట్లేదని శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. జగన్ డిక్లరేషన్ ఇచ్చేందుకు ఎందుకు అభ్యంతరమని నిలదీశారు. జగన్ గత ఐదేళ్లలో హిందూ మనోభావాలు, విశ్వాసాలను జగన్ ఏనాడూ గౌరవించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలు, పూజారులపై దాడులు జరిగినా జగన్ ఏనాడూ స్పందించలేదని గుర్తు చేశారు. హిందువులపై అనేక అఘాయిత్యాలు జరిగాయని, హిందువులపై భయానక వాతావరణం సృష్టించారని అన్నారు. ఇలాంటి వాళ్లు తిరుమల క్షేత్రానికి వస్తున్నారంటే జాగ్రత్తగా ఉండాల్సిందేనని, హిందువుల పక్షాన మాట్లాడేందుకు మఠాధిపతులు, పీఠాధిపతులు ముందుకురావాలని సూచించారు.
జగన్ తిరుమల పర్యటనపై తీవ్ర ఉత్కంఠ - డిక్లరేషన్ కోరనున్న టీటీడీ - EX CM Jagan Tirumala Tour
జగన్ పర్యటనతో తిరుమల అపవిత్రం : గత ఐదేళ్లలో తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని శ్రీనివాసానంద ఆరోపించారు. తన కుటుంబసభ్యులను పాలకమండలిలో నియమించుకుని అక్రమాలు చేశారని తెలిపారు. తిరుమలను శాంతియాగం, ప్రోక్షణతో పవిత్రం చేశారని, జగన్ పర్యటనతో మళ్లీ అపవిత్రమవుతుందని అన్నారు. కొండపైకి వచ్చి కోట్ల మందిని క్షోభకు గురిచేయవద్దని హితవు పలికారు.