AP Police Arrested Red Sandalwood Smuggling Gang in Eluru District :రాష్ట్రంలో రోజురోజుకీ స్మగ్లర్ల అక్రమాలు పెరిగిపోతున్నాయి. అక్రమంగా ఇసుక, గ్రావెల్, మద్యం, గంజాయి తరలిస్తున్న వారు చెలరేగిపోతున్నారు. పోలీసులకు చిక్కికుండా మాస్టర్ ప్లాన్లు వేస్తూ అక్రమ రవాణాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో రెచ్చిపోయిన ఎర్రచందనం (Red Sandalwood ) స్మగ్లర్ మంచి ప్రణాళికతో దుంగలు తరలించానుకున్నా చివరకు అనుకోని సంఘటన చోటు చేసుకుంది.
ఎర్రచందనం స్మగ్లర్‌కు అసెంబ్లీ సీటు! - వైసీపీ సర్కార్ అండతో జోరుగా దందా
Red Sandalwood Smugglers Arrested : కంటెయినర్లో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా గురువారం ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో నిఘా పెట్టారు. టి. నరసాపురం మండలం బంధంచర్ల నుంచి ఎర్ర చందనాన్ని దిల్లీకి తరలిస్తున్నారు. అటవీశాఖ అధికారులు (Forest officials) తెలిపిన వివరాల ప్రకారం దిల్లీకి (Delhi) చెందిన ప్రేమ్‌సింగ్ అనే వ్యాపారి బంధంచర్లకు చెందిన రైతు (Farmer) వాసిరెడ్డి మోహనరావు వద్ద సుమారు 100 ఎర్ర చందనం చెట్లు కొనుగోలు చేశారు. వీటిని నరికి దుంగలుగా చేశారు. కంటెయినర్లో సుమారు నాలుగున్నర టన్నుల ఎర్ర చందనం దుంగలను బుధవారం రాత్రి లోడు చేశారు.