ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 3 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Tue Sep 03 2024- సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదనే పర్యటించలేదు: పవన్​ కల్యాణ్​ - PAWAN KALYAN COMMENTS ON YSRCP

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Andhra Pradesh Live News Desk

Published : Sep 3, 2024, 7:55 AM IST

Updated : Sep 3, 2024, 10:48 PM IST

10:45 PM, 03 Sep 2024 (IST)

సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదనే పర్యటించలేదు: పవన్​ కల్యాణ్​ - PAWAN KALYAN COMMENTS ON YSRCP

Deputy CM Pawan Kalyan Comments on YSRCP: వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఖరి వల్లే ప్రస్తుతం విజయవాడకు వరద ముప్పు వచ్చిందని మండిపడ్డారు. ఈ పరిస్థితిలో బాధితులను రక్షించటం ముఖ్యం తప్ప ఆ పార్టీపై విమర్శలు చేయటానికి సమయం కాదన్నారు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవకు ముందుకు రావాలని పవన్‌ అన్నారు. | Read More

ETV Bharat Live Updates

09:58 PM, 03 Sep 2024 (IST)

వరద బాధితులకు టాలీవుడ్​ హీరోల సాయం - కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్​కల్యాణ్​ - Actors Donation to Flood Victims

Tollywood Actors Donation to Flood Victims: వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు టాలీవుడ్ కదిలింది. సినీ నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అలాగేే నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు సీఎం సహాయనిధికి ఇవ్వనున్నారు. ఇప్పటికే జూనియర్​ ఎన్టీఆర్​ తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. | Read More

ETV Bharat Live Updates

08:47 PM, 03 Sep 2024 (IST)

వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటున్నారా? - బ్యాంక్​ ఖాతాల నంబర్లు ఇవే - Donate For Flood Victims

Government Gave Accounts For Donations: వరద బాధితులకు సహాయం చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది. దాతలకు సమాచారం అందించేందుకు హెల్ప్​ లైన్​ నెంబరు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా కూడా సహాయం చేయవచ్చని అధికారులు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates

08:25 PM, 03 Sep 2024 (IST)

వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది - జనజీవనం సాధారణ స్థితికి వచ్చేవరకు విశ్రమించమన్న మంత్రులు - Ministers on Flood Affected Areas

Ministers Engaged in Relief Operations in Flood Affected Areas: సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద ప్రాంతాల్లోనే పర్యటిస్తున్న మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు ధైర్యం చెప్తూ ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో వరద ప్రభావం తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై మున్సిపాలిటీ కమిషనర్లతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. | Read More

ETV Bharat Live Updates

08:09 PM, 03 Sep 2024 (IST)

ధైర్యంగా ఉండండి - అందరినీ ఆదుకుంటామని వరద బాధితులకు చంద్రబాబు హామీ - Chandrababu Tour in Vijayawada

CM Chandrababu Tour in Flooded Area in Vijayawada: ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో మూడో రోజు నాలుగు గంటల పాటు నిర్విరామంగా పర్యటించారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీలో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలు తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో అందుతున్న సాయాన్ని పర్యవేక్షించి, ప్రజలకు ధైర్యం చెప్పారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా దాదాపు 22 కి.మీ మేర జేసీబీపైనే సీఎం ప్రయాణం సాగింది. | Read More

ETV Bharat Live Updates

07:33 PM, 03 Sep 2024 (IST)

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - రాష్ట్రానికి వర్ష సూచన ! - Rains Alert in AP

Another Low Pressure is Expected: ఇప్పటికే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అమరావతి వాతావరణ విభాగం​ మరో షాకింగ్​​ న్యూస్​ చెప్పింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. | Read More

ETV Bharat Live Updates

05:38 PM, 03 Sep 2024 (IST)

వరద బాధితుల కోసం 'అక్షయపాత్ర' - 5 లక్షల మందికి భోజనం - AkshayaPatra Food for Flood Victims

Akshaya Patra Preparing Food for Flood Victims: మంగళగిరిలోని అక్షయపాత్ర వరద బాధితుల కోసం భోజన ప్యాకెట్లను సిద్ధం చేసింది. అక్షయపాత్ర వంటశాలలో వరద బాధితుల కోసం 5 లక్షల ప్యాకెట్లు సిద్ధం చేసింది. ప్రభుత్వం, దాతల సహకారంతో ఈ అరుదైన రికార్డు సాధించామని అక్షయపాత్ర అధికారి చెప్పారు. | Read More

ETV Bharat Live Updates

04:25 PM, 03 Sep 2024 (IST)

ఏవరూ భయపడొద్దు - అన్ని విధాలా ఆదుకుంటాం: ప్రజలకు మంత్రుల భరోసా - Ministers Visit Flooded Areas

Ministers Visiting Flood Affected Areas: వరద ముంపు ప్రాంతాల్లో రేయింబవళ్లనే తేడా లేకుండా సహాయక చర్యల్లో మంత్రులు నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని ఏవరూ భయపడొద్దని వారికి ధైర్యం చెప్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

03:20 PM, 03 Sep 2024 (IST)

పెద్ద మనసు చాటుకున్న సీనీ హీరోలు - వరద సాయం ఎవరెంత ఇచ్చారంటే! - Tollywood donates to flood victims

Tollywood Donation: భారీ వర్షాలకు అతలాకుతలమైన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాయం అందించడంలో పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. జూ.ఎన్టీఆర్ సహా విశ్వక్​ సేన్​, సిద్ధు జొన్నలగడ్డ, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్​, ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ, నాగవంశీ హా పలువురు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. | Read More

ETV Bharat Live Updates

02:08 PM, 03 Sep 2024 (IST)

తేరుకుంటున్న ముంపు ప్రాంతాలు- హైవేపై యథావిధిగా రాకపోకలు - flood relief

flood relief: మున్నేరుకు వరద పూర్తిగా తగ్గడంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకీ వరద ఉధృతి వేగంగా తగ్గిపోవడంతో పాటు విజయవాడలోని ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతల తరఫున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. | Read More

ETV Bharat Live Updates

12:04 PM, 03 Sep 2024 (IST)

పేరుకే అది గుడారం - లోనే ఉంది అసలైన యవ్వారం! - Unsocial Activities in Gandikota

Unsocial Activities in Gandikota : అసాంఘిక కార్యకలాపాలకు గండికోట అడ్డాగా మారింది. పోలీసుల నిఘా కొరవడడంతో అక్కడ రిసార్టులు, ప్రైవేట్ హోటళ్లు యజమానులు రెచ్చిపోతున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నారు. వారికి మందు, విందుతో పాటు కావాల్సిన సౌకర్యాలను అందిస్తున్నారు. దీంతో వారు రాత్రంతా అక్కడే ఉంటూ రచ్చచేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

11:54 AM, 03 Sep 2024 (IST)

విజయవాడలో హెలికాప్టర్ల ద్వారా వరద ప్రాంతాల్లో ఆహారం పంపిణీ - Food distribution With Helicopters

Food Distribution Through Helicopters: విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ జోరుగా సాగుతోంది. సింగ్ నగర్, అంబాపురం, వాంబే కాలని, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్టు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ఆహార పంపిణీ చేస్తున్నారు. వాయు సేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులు, ఇతర అత్యవసర వస్తువులను వరద ప్రాంతాల్లో జార విడుస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరో 200ల మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. | Read More

ETV Bharat Live Updates

11:49 AM, 03 Sep 2024 (IST)

దివిసీమను ముంచిన వరద- సాయం కోరుతున్న అన్నదాతలు - Farmers Problems Due to Floods

Diviseema Farmers Problems Due to Floods : ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం, కృష్ణా నదిలో పెరుగుతున్న వరద దివిసీమను నీట ముంచింది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పంటలు నీట మునిగాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పరవళ్లు తొక్కుతూ వస్తున్న కృష్ణా వరద దివిసీమను కునుకులేకుండా చేస్తోంది. | Read More

ETV Bharat Live Updates

11:50 AM, 03 Sep 2024 (IST)

విజయవాడలో భారీగా ఆహారం పొట్లాలు సిద్ధం - పంపిణీని పరిశీలించిన మంత్రి నారాయణ - Narayana on Food Distribution

Minister Narayana on Food Distribution to Flood Victims : విజయవాడ ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇతర జిల్లాల నుంచి లారీల్లో ఆహారం,పండ్లు, వాటర్​ బాటిళ్లులను పెద్దయెత్తున విజయవాడకు చేరుకున్నాయి. సీఎం ఆదేశాలతో పెద్దఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. | Read More

ETV Bharat Live Updates

11:46 AM, 03 Sep 2024 (IST)

జలవిలయంతో అల్లాడుతున్న విజయవాడ - బాధితులకు అండగా స్వచ్ఛంద సంస్థలు - Help to Vijayawada Flood Victims

Help to Vijayawada Flood Victims : జలవిలయంతో అల్లాడుతున్న విజయవాడ ప్రజల్ని ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఆహారం, సామగ్రి, డబ్బుతో పాటు ఇతర వస్తువుల రూపంలో తమవంతుగా సాయం అందిస్తున్నారు. కష్టకాలంలో ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

11:46 AM, 03 Sep 2024 (IST)

వరద సహాయక చర్యలపై లోకేశ్ సమీక్ష - బాధితులకు అందుతున్న సాయంపై ఆరా - Lokesh Review Flood Relief

Lokesh Review Flood Relief : రాష్ట్రంలో వరద సహాయక చర్యలపై మంత్రి లోకేశ్ నిరంతరం సమీక్ష చేస్తున్నారు. బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ శాఖల మంత్రులు, అధికారులకు పలు సూచనలు, సలహాలు చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

09:53 AM, 03 Sep 2024 (IST)

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణమ్మ ఉగ్రరూపం - ఊళ్లకు ఊళ్లే నీటమునక - Flood Effect in Joint Guntur

People Suffer Due to Flood Effect in Joint Guntur District : కృష్ణమ్మ ఉగ్రరూపానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు గ్రామాలు వరద నీటితో నిండిపోయాయి. చాలాచోట్ల కరకట్టకు గండ్లు పడడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గ్రామస్థులు గడుపుతున్నారు. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామాలను వరద ముంచెత్తడంతో వారందరినీ ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలించారు. | Read More

ETV Bharat Live Updates

09:31 AM, 03 Sep 2024 (IST)

కృష్ణానది మహోగ్రరూపం - కరకట్ట వెంబడి ప్రమాద ఘంటికలు - flood to krishna river karakatta

Flood to Krishna River Karakatta: కృష్ణానదికి రికార్డుస్థాయిలో వరదనీరు పోటెత్తింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి 11.45 లక్షల క్యూసెక్కులు నీరు నదిలోకి విడుదల చేశారు. ఊహించని స్థాయిలో వరద రావడంతో కృష్ణానది కరకట్ట ప్రమాదంలో పడింది. టీడీపీ హయాంలో కరకట్ట బలోపేతం, విస్తరణ పనులను సగానికి పైగా పూర్తి చేశారు. మిగతా పనులను తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీసం నిర్వహణను పట్టించుకోకపోవటంతో చాలచోట్ల కరకట్ట బలహీనపడింది. ఇప్పుడు రికార్డు స్థాయిలో వస్తున్న వరదతో కరకట్ట ఎక్కడ, ఎప్పుడు తెగుతుందోనని జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. | Read More

ETV Bharat Live Updates

08:56 AM, 03 Sep 2024 (IST)

కృష్ణమ్మ మహోగ్రరూపం - విలవిల్లాడుతున్న లంక గ్రామాలు - క్షణం క్షణం కమ్మేస్తోన్న వరద - Krishna River Floods

Krishna Floods in Lanka Villages : చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద పోటెత్తడంతో నదీ తీర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకాశం బ్యారేజీకి 11.4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. కరకట్ట లోపల గ్రామాలు నీటిలో చిక్కుకోవడంతో అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడే ఉన్నవారికి పడవల ద్వారా ఆహారం సరఫరా చేశారు. భారీ వరదతో కరకట్ట బలహీనంగా ఉన్నచోట్ల గండి పడుతుందనే భయం తీర ప్రాంత ప్రజలు, అధికారుల్ని కలవరపెడుతోంది. గతంలో ఎన్నడూ ఇలాంటిది చూడలేదని కరకట్ట పైఅంచు తాకుతూ ఇలా ప్రవహించడం ఇదే తొలిసారని చెబుతున్నారు. | Read More

ETV Bharat Live Updates

08:55 AM, 03 Sep 2024 (IST)

వరద ధాటికి సొంతూళ్లకు పయనం - బస్సుల్లేక బస్టాండ్‌లో బాధితుల తిప్పలు - PEOPLE FACE TO TRANSPORT PROBLEM

People Suffer Due to Transport System Blocked in Vijayawada : రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దారులన్నీ ఏరులయ్యాయి. రైల్వే స్టేషన్​, ఆర్టీసీ బస్​ డిపోల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో భారీగా రైళ్లు రద్దు, బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దూరప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు | Read More

ETV Bharat Live Updates

07:02 AM, 03 Sep 2024 (IST)

బుడమేరు ప్రళయం ఎఫెక్ట్ - వరద గుప్పిట్లో అల్లాడుతున్న జనం - Vijayawada Floods

Vijayawada Floods 2024 : బుడమేరు విజయవాడలో ప్రళయం సృష్టించింది. చాలా ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే అల్లాడుతున్నాయి. మరోవైపు పలు ప్రాంతాలు సోమవారం కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. నీటిమట్టం కొద్దిగా తగ్గడంతో వరద బాధితులు పెద్ద సంఖ్యలో బయటకొచ్చారు. కొందరు ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్తుండగా మరికొందరు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మిగిలిన వారు తాగునీరు, పాలు, ఆహారం తీసుకుని తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. | Read More

ETV Bharat Live Updates
Last Updated : Sep 3, 2024, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details