ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 12 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Thu Sep 12 2024- సవాళ్లతో హీటెక్కిన తెలంగాణ - పాడి కౌశిక్​రెడ్డి Vs అరెకపూడి గాంధీ - Kaushik Reddy Vs Arekapudi Gandhi

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Andhra Pradesh Live News Desk

Published : Sep 12, 2024, 9:19 AM IST

Updated : Sep 12, 2024, 5:24 PM IST

05:23 PM, 12 Sep 2024 (IST)

సవాళ్లతో హీటెక్కిన తెలంగాణ - పాడి కౌశిక్​రెడ్డి Vs అరెకపూడి గాంధీ - Kaushik Reddy Vs Arekapudi Gandhi

Kaushik Reddy Vs Arekapudi Gandhi: తెలంగాణ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. కౌశిక్ సవాల్ స్వీకరించిన గాంధీ తన అనుచరులతో కలిసి హైదరాబాద్ కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. | Read More

ETV Bharat Live Updates

04:39 PM, 12 Sep 2024 (IST)

రాష్ట్రంలో వరద ప్రభావిత గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన - Central Team Visit in Guntur

Central Team Visit in AP : ‍వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించిన బృందం సభ్యులు, పరిస్థితిపై బేరీజు వేస్తున్నారు. తాజాగా వారు గుంటూరు జిల్లాలో పర్యటించి బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. | Read More

ETV Bharat Live Updates

04:41 PM, 12 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ వేగవంతం - రంగంలోకి అబ్బులు టీం - BOATS REMOVAL AT PRAKASAM BARRAGE

BOATS REMOVAL AT PRAKASAM BARRAGE: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలిగింపు ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బ్యారేజీ వద్ద జరుగుతున్న బోట్లు కత్తిరించే ప్రక్రియను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు 70 శాతం పనులను పూర్తి చేశామన్నారు. | Read More

ETV Bharat Live Updates

02:51 PM, 12 Sep 2024 (IST)

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం - Road Accident in Tirupati District

Chandragiri Road Accident Today : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భాకరాపేట కనుమ రహదారిలో కంటైనర్‌ లారీ కారు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. | Read More

ETV Bharat Live Updates

01:39 PM, 12 Sep 2024 (IST)

విజయనగరం జిల్లాలో వరదలు - వందల ఎకరాల్లో పంటలు నేలమట్టం - Crop Damage in Vizianagaram

Crop Damage in Vizianagaram District: అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తాయి. కొన్నిచోట్ల కాలవలు, చెరువులకు గండ్లు పడి లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీటమునిగాయి. వందలాది ఎకరాల్లో వరి పంట ముంపు బారిన పడింది. అరటి నేల మట్టమైంది. కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. మన్యం జిల్లాలో పత్తి, మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. | Read More

ETV Bharat Live Updates

01:25 PM, 12 Sep 2024 (IST)

'ఎన్నికల్లో పోటీ చేసుకోండి - డబ్బులు ఇవ్వొద్దు, మద్యం తాగించొద్దు' - Flexi against Bribe in Elections

Viral Flexi on Local Elections : 'స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వారు, గ్రామంలో డబ్బులు ఇవ్వొద్దు, మద్యం తాగించొద్దు' అంటూ తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలోని తండాల్లో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే వారిని హెచ్చరిస్తూ వినూత్నంగా తండాల్లో ఆయాచోట్ల యువకులు ఇలా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. | Read More

ETV Bharat Live Updates

01:04 PM, 12 Sep 2024 (IST)

'హైడ్రా'కు స్వయం ప్రతిపత్తి! - ఆర్డినెన్స్ తీసుకురానున్న తెలంగాణ ప్రభుత్వం - Hydra With More Powers

Hydra with More Powers : హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు పలు శాఖల అధికారాలను హైడ్రాకు బదిలీ చేసేందుకు చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేని కారణంగా ఆర్డినెన్స్ తీసుకురానుంది. | Read More

ETV Bharat Live Updates

12:59 PM, 12 Sep 2024 (IST)

టవల్ చుట్టుకుని గర్భిణిగా నమ్మించింది- ప్రసవానికి ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు షాక్ - PREGNANT CHEATING

Woman Pretending to be Pregnant : తాను గర్భం దాల్చినట్లు అందరినీ నమ్మించింది. అలా 9 నెలలు గడిపింది. పురిటి నొప్పులు వస్తున్నాయని ఆసుపత్రిలో చేరింది. ప్రసవం చేసే సమయానికి బాత్​రూమ్​కు వెళ్లి అరిచి రక్తస్రావమైనట్లు అందరినీ నమ్మించబోయింది. అనుమానం వచ్చిన డాక్టర్లు, పరీక్షలు చేయగా అసలు విషయం బయటపడింది. | Read More

ETV Bharat Live Updates

12:56 PM, 12 Sep 2024 (IST)

పదో తరగతి పరీక్షలపై తేల్చని తెలంగాణ ప్రభుత్వం - ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో అయోమయం - Tenth Paper Pattern in Telangana

TG Tenth Exam Papers Pattern : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల స్వరూపంపై స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. కొత్త విధానం తేలితేనే విద్యార్థులను సన్నద్ధం చేయవచ్చని టీచర్లు చెబుతున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) సైతం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా, విద్యా శాఖ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. | Read More

ETV Bharat Live Updates

12:51 PM, 12 Sep 2024 (IST)

సైబర్ నేరాల ఉచ్చులో యువత, మహిళలే ఎక్కువ - అత్యధికంగా విశాఖలో నమోదు - CYBER CRIMES IN AP

Cyber ​​Frauds in AP : మీకు లాటరీ తగిలింది. మీరు మా కంపెనీ బహుమతికి అర్హత సాధించారు. అది కావాలంటే కొంత సొమ్ము మాకు పంపండి! ఫోన్‌లో ఈ లింక్‌ తాకితే అద్భుతం చూస్తారు! మీ బ్యాంకు ఖాతా ఆధునీకరణకు పిన్‌ చెప్పండి! మీ పేరు నేరగాళ్ల జాబితాలో ఉంది తొలగించాలంటే చెప్పినంత ఇవ్వండి ఇలా సైబర్ నేరగాళ్లు విశాఖ వాసుల సొమ్ములను స్వాహా చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

12:49 PM, 12 Sep 2024 (IST)

ప్రజారోగ్యానికి సవాలుగా వరద- అంటువ్యాధులకు అవకాశం- వైద్య బృందాల ఇంటింటి సర్వే - Flood Water Dangerous To Health

Flood Water Dangerous To Health : విజయవాడలో వరద నీరు ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతోంది. రోజుల తరబడి నిల్వ ఉన్న బురద నీటితో సంక్రమిత వ్యాధులు పెరిగే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధుల నియంత్రణ చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బృందాలు ఇంటింటా సర్వే చేపట్టి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

10:24 AM, 12 Sep 2024 (IST)

'పేదవాళ్లు డబ్బులు ఇవ్వలేకపోయినా - వైద్యం చేయడమే మా సూత్రం' : అదే LVP సక్సెస్ మంత్ర - DR Nageswara Rao Interview

LV Prasad Eye Institute in Hyderabad : దేశంలో కంటి వైద్యానికి కొత్త రూపు ఇచ్చిన సంస్థ ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌. తక్కువ ఖర్చుతో పేద, ధనిక అనే భేదం లేకుండా కంటి చూపును ప్రసాదిస్తారు. ఇప్పటివరకు 50 వేల కార్నియాలు మార్పిడి చేసి, ప్రపంచంలోనే మొదటి సంస్థగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ సంస్థ పనితీరుపై సంస్థ వ్యవస్థాపకులు గుళ్లపల్లి నాగేశ్వరరావు, సంస్థ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ ప్రశాంత్​ గార్గ్​, సంస్థలో భాగమైన శాంతిలాల్​ సంఘ్వీ, కార్నియా ఇన్​స్టిట్యూట్​ డైరెక్టర్​ డాక్టర్​ ప్రవీణ్​ వడ్డపల్లితో ఈటీవీ భారత్ ప్రత్యేకంగా ముచ్చటించింది. | Read More

ETV Bharat Live Updates

10:12 AM, 12 Sep 2024 (IST)

కొనసాగుతున్న బోట్ల కటింగ్​ వర్క్​ - కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం - Boats Removal At Prakasam Barrage

Boats Removal At Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల వెలికితీత కోసం అధికారులు ప్లాన్ బీ అమలు చేస్తున్నారు. భారీ క్రేన్లతో తీసే ప్రయత్నం విఫలమవడంతో బోట్లను రెండుగా కట్​ చేసి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ పడవలు కావడంతో వాటిని కత్తిరించడం డైవింగ్ టీంలు గంటల తరబడి శ్రమిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కోత ప్రారంభించగా ఇంకా కొనసాగుతూనే ఉంది. నేటీ మధ్యాహ్నానికి ఓ పడవను రెండుగా కోసే పనులు పూర్తికానున్నాయి. అనంతరం భారీ క్రేన్లతో బయటకు వెలికి తీసి మరో రెండు పడవల కోతను ప్రారంభించనున్నారు. భారీ పడవలు ధృడంగా ఉండటం వల్ల పనులు పూర్తయ్యేందుకు మూడు రోజుల పడుతుందని అధికారులు చెబుతున్నారు. | Read More

ETV Bharat Live Updates

10:04 AM, 12 Sep 2024 (IST)

'ఆ ప్లెక్సీలు తొలగించాల్సిన బాధ్యత అధికారులదే' - HC on Unauthorised Hoardings

Authorities are Responsible For Removing Hoarding and Flexi : రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ప్లెక్సీలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలు అసౌకర్యం కల్పిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని తొలిగించే బాధ్యత అధికారులదే అని సృష్టం చేసింది. హోర్డింగ్ లు, బ్యానర్ల విషయంలో అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. | Read More

ETV Bharat Live Updates

10:05 AM, 12 Sep 2024 (IST)

మీకు తెలుసా? 'బిగ్‌బాస్‌లో పాల్గొనాలంటే ఆ పరీక్ష చేయించుకోవాలి' - High Court on Bigg Boss show

High Court Heard the Petition Filed on Bigg Boss Show : హైకోర్టులో బిగ్‌బాస్‌ రియాల్టీ షోపై దాఖలైన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ షోలో అశ్లీలత, అసభ్యతను అడ్డుకోవాలని, షో పై పరిమితులు విధించి రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు మాత్రమే ప్రసారం చేయాలని పిల్ దాఖలైంది. అలాగే కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు గర్భనిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. | Read More

ETV Bharat Live Updates

10:02 AM, 12 Sep 2024 (IST)

జత్వానీ ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలుఎక్కడున్నాయో చెప్పండి - పోలీసులకు హైకోర్టు ఆదేశం - Mumbai Actrees Petition

Mumbai Actrees Petition on High Court in AP : ముంబయికి చెందిన సినీ నటి వ్యాజ్యంపై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేప్టటింది. ఈ నేపథ్యంలో విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాదంబరీపై కేసు నమోదు చేసి, ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు ఎక్కడున్నాయో చెప్పాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. | Read More

ETV Bharat Live Updates

09:53 AM, 12 Sep 2024 (IST)

కూల్చివేత ఖర్చును విజయసాయిరెడ్డి కుమార్తె నుంచి వసూలు చేయండి: హైకోర్టు - Vijayasai Daughter Encroachment

High Court On Vijayasai Reddy Daughter Encroachment : విశాఖ జిల్లా భీమిలి బీచ్‌ వద్ద సముద్రం నీటికి అతి సమీపంలో సీఆర్‌జడ్‌ నిబంధనలను ఉల్లంఘించి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డి కాంక్రీట్‌ ప్రహరీ గోడ నిర్మించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రహరీ గోడకు కూల్చడానికి అయిన ఖర్చును నేహారెడ్డి నుంచి వసూలు చేయాలని సూచించింది. | Read More

ETV Bharat Live Updates

08:10 AM, 12 Sep 2024 (IST)

వరద సాయాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు - ఎకరాకు పదివేలు- అదనంగా మరో పదివేలు - Chandrababu on Flood Compensation

CM Chandrababu Announced Flood Compensation: ఏలేరు వరద బాధితులకు ఈ నెల 17లోగా న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పది వేలు, నీట మునిగిన పంటలు తిరిగి కోలుకునేలా ఉంటే ఉచితంగా ఎరువులు అందిస్తామని ప్రకటించారు. ముంపు బాధితులు దుస్తులు, వంటసామాగ్రి కొనుక్కునేందుకు రూ.10వేల ఇస్తామని వెల్లిడించారు. | Read More

ETV Bharat Live Updates

07:21 AM, 12 Sep 2024 (IST)

కళ్లెదుటే కొట్టుకుపోయిన కర్షకుల కష్టం - కేంద్ర బృందం ఎదుట ఆవేదన వ్యక్తం - Central Team To Assess Flood Damage

Central Team To Assess Flood Damage: వరద నష్టం అంచనాల కోసం రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. కృష్ణా, బాపట్ల జిల్లాల్లో దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది. నష్టపోయిన వారికి తగిన పరిహారం ఇవ్వాలని రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు వినతి ప్రతాలు అందించారు. | Read More

ETV Bharat Live Updates

07:21 AM, 12 Sep 2024 (IST)

వరద బాధితులకు గుడ్ న్యూస్ - నష్టం వివరాల నమోదుకు గడువు పొడగింపు - Government Extended Enumeration

Government has Extended Deadline for Registrations : విజయవాడ వరద నష్టాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం మరో రోజు గడువు పొడిగించింది. ఇవాళ సంబంధిత వార్డు సచివాలయాల్ని సంప్రదిస్తే గణాంక బృందాలు ఇళ్లకే వచ్చి వివరాలు సేకరిస్తాయని వెల్లడించింది. వాహన బీమా క్లెయిమ్స్‌కూ త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. | Read More

ETV Bharat Live Updates
Last Updated : Sep 12, 2024, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details