IG Ashok Kumar Said No Hidden Cameras Found in Engineering College : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కళాశాలలో రహస్య కెమెరాలేమీ దొరకలేదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించామని చెప్పారు. విచారణలో కెమెరాలు కానీ, ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదని వెల్లడించారు. ఎవరో చెప్తేనే తమకు తెలిసిందనీ విచారణలో అందరూ చెప్పారని ఐజీ తెలిపారు. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 5 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Thu Sep 05 2024- రహస్య కెమెరాలేమీ దొరకలేదు - ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదు: ఐజీ - No Hidden Cameras Found
By Andhra Pradesh Live News Desk
Published : Sep 5, 2024, 7:00 AM IST
|Updated : Sep 5, 2024, 10:00 PM IST
రహస్య కెమెరాలేమీ దొరకలేదు - ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదు: ఐజీ - No Hidden Cameras Found
రాష్ట్రానికి అండగా ఉంటాం - కేంద్ర సాయం త్వరగా అందేలా చూస్తా: శివరాజ్‌సింగ్ - Shivraj Singh Chouhan on Floods
Union Minister Shivraj Singh Chouhan on Floods: రాష్ట్రంలో వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ చెప్పారు. అంతే కాకుండా కేంద్రం నుంచి సాయం త్వరగా అందేలా చూస్తానని కేంద్ర కమిటీ నివేదిక చూశాక ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చౌహాన్ సహాయ కార్యక్రమాలు బాగా చేశారని ప్రశంసించారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారని చౌహాన్ కొనియాడారు. | Read More
వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన - Central Minister visit floods
Union Minister Shivraj Singh Chauhan Inspect Flood Situation : రాష్ట్రంలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చిన కేంద్ర మంత్రి వరద పరిస్థితిని పరిశీలించారు. బ్యారేజీ వద్ద కొనసాగుతోన్న గేట్ల మరమ్మతు పనులనూ పరిశీలించారు. చౌహాన్‌తో పాటు బ్యారేజీ పరిశీలనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. | Read More
తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం - తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు విరాళం - Telugu Film Industry Donation
Telugu film industry Donation to Help Flood Victims: వరద బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల్లో వరద బాధితులకు విరాళం ప్రకటించింది. అంతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులపై ప్రత్యేక కమిటీ వేస్తున్నట్లు తెలిపింది. కమిటీ తెలిపిన సమాచారంతో సహాయ కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. | Read More
విపత్తు వేళ పరిమళించిన మానవత్వం - సీఎం సహాయనిధికి పెద్దఎత్తున విరాళాలు - Huge Donations to CMRF
Donors are Donating Heavily to CM Relief Fund : వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. విపత్తు వేళ మానవత్వం చాటాలన్న ప్రభుత్వం పిలుపుతో మనసున్న మారాజులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఎంతో మంది వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, గృహిణులు తమ వంతుగా బాధితుల కోసం విరాళాలను అందిస్తున్నారు. | Read More
వరద నష్టంపై రంగంలోకి దిగిన కేంద్ర బృందాలు - Central Team Visit in AP
Central Team Visit in AP : వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించిన బృందం సభ్యులు, పరిస్థితిపై బేరీజు వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు. | Read More
మధురానగర్‌లో సీఎం చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం - CM Chandrababu Missed an Accident
CM Chandrababu Missed an Accident: వరద ప్రాంతాల్లో పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. వరదను పరిశీలించేందుకు రైలు వంతెన పైకి కాలినడకన వెళ్తున్న సమయంలో రైలు హఠాత్తుగా వచ్చి చంద్రబాబు పక్కనుంచి వెల్లింది. సీఎం ఓ పక్కకు నిలబడి ఉండటంతో పక్కనుంచి రైలు వెళ్లడం జరిగింది. | Read More
సృజనాత్మకతకు సాంకేతికత జోడు - సాంఘిక శాస్త్రంలో అద్భుతాలు సృష్టిస్తున్న మాస్టారు - Teachers Day Special Story
Social Teacher Suresh Story: చదువుపై ఆయనకు అపారమైన శ్రద్ధ. పుస్తకాల్లో ఉన్నది పిల్లలతో బట్టీ పట్టించే రకం కాదాయన. సృజనాత్మకతకు సాంకేతికతను జోడించి సాంఘిక శాస్త్రంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆ మాస్టారు విశేష సేవలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రెండుసార్లు పురస్కారం దక్కించుకున్నారు. తిరుపతి జిల్లా ఉపాధ్యాయుడు సురేష్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. | Read More
ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు - రంగంలోకి కన్నయ్యనాయుడు - Damage Gates Repair Work Started
Prakasam Barrage damage gates Repair Work Started : ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతులు జరుగుతున్నాయి. బ్యారేజ్ 67, 69 నెంబర్ గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు. నిపుణులు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. బ్యారేజీ వద్ద ఇరుక్కున్న నాలుగు పడవలను బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ సిబ్బంది తొలగించనున్నారు. ఏడు రోజుల్లో బ్యారేజీ గేట్ల ఏర్పాటు పనులు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. | Read More
బల్లకట్టుపై బుడమేరు ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన - CM CBN Visit Flood Affected Areas
CM Chandrababu Field Visit to Flood Affected Areas: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ, బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. | Read More
ముంపు ప్రాంతాల్లో శరవేగంగా పారిశుద్ధ్య పనులు - దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నేతలు - Sanitation Works in Flooded Areas
Rapid Sanitation Works in Flooded Areas in Vijayawada : విజయవాడ ముంపు ప్రాంతాల్లో శరవేగంగా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు కాలనీలు వరద ముంపు నుంచి బయటకొస్తున్న నేపథ్యంలో అగ్నిమాపక, పారిశుద్ధ్య సిబ్బంది పలు చోట్ల బురదను తొలగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఫైరింజిన్ల, పారిశుద్ధ్య సిబ్బంది వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. | Read More
అలెర్ట్ - రాష్ట్రంలో మళ్లీ వర్షాలు - భయం గుప్పిట్లో ప్రజలు - IMD Issues Rainfall Alert to Ap
IMD Issues Rainfall Alert to Andhra pradesh : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వానలకు ప్రజా జీవనం ముంపులో కూరుకుంది. నిన్నటి వరకూ వరదలోనే ఉన్నారు. ఉద్ధృతి తగ్గి ఇప్పుడిప్పుడే అంతా కుదుట పడుతుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో అధికారులు మళ్లీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సారి ఏ విలయం రానుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. | Read More
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు - పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ - MLA Adimulam Suspended From TDP
MLA Adimulam Suspended From TDP : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగిక వేధించారని ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు ఆమె సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. | Read More
కదిపితే కన్నీళ్లే: వరద తెచ్చిన నష్టం కష్టం- కంటి మీద కునుకు లేదు -ఈటీవీ భారత్‌తో విజయవాడ వాసుల గోడు - AndhraPradesh Floods
కృష్ణా నదికి వరద పోటెత్తడంతో విజయవాడ నగరం అతలాకుతల మైంది. నాలుగు రోజులుగా ఇళ్లలోకి నీరు చేరి కంటి మీద కునుకు లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని పలు కాలనీల్లో బాధితులను 'ఈటీవీ భారత్ బృందం' పలకరించగా వరదతో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. | Read More
బైక్ ఇంజన్లో బురద- వరద కథల్లో ఇదో వ్యధ - Massive Damage to Two Wheelers
Massive Damage to Two Wheeler Vehicles Due to Floods in Vijayawada: విజయవాడలో వరద దెబ్బకు మోటార్ బైక్‌లు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి. ద్విచక్రవాహనాలు మూడు రోజులపాటు పూర్తిగా నీటిలో ఉండటంతో ఎక్కడికక్కడ మొరాయించాయి. ప్రస్తుతం వరద తగ్గడంతో రిపేర్ల కోసం మెకానిక్ షెడ్డుల వద్దకు బైకులు క్యూకట్టాయి. | Read More
ఆక్రమణల చెరలో ఉప్పుటేరు- దారిలేక లంకగ్రామాలను కుమ్మేస్తోన్న బుడమేరు - Kolleru Lanka Stuck in Flood Effect
Kolleru Lanka Villages Stuck in Flood Effect : విజయవాడని అల్లకల్లోలం చేసిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు లంక గ్రామాలపై విరుచుకుపడుతోంది. వరద నీరు భారీగా చేరడంతో లంకలు నీట మునిగాయి. కొల్లేరు నీటిని సముద్రానికి తీసుకెళ్లే ఉప్పుటేరు ఆక్రమణలు, నిర్వహణ లేమితో చిక్కిపోయింది. ప్రవాహానికి అడుగడుగునా ఏర్పడుతున్న అడ్డంకులతో లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. | Read More
దెయ్యాల భయం పోగొట్టేందుకు అక్కడే నిద్రించిన టీచర్ - Teacher Sleeps in Haunted Classroom
Ghost Teacher in Adilabad : తెలుగు మాస్టారు, లెక్కల మాస్టారు, సోషల్ మాస్టారు, అని విద్యార్థులు తమ ఉపాధ్యాయులను పిలుచుకుంటారు. మరి! దెయ్యం మాస్టారు అని పిలిస్తే? కొత్తగా ఉంది కదా! కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఓ ఉపాధ్యాయుడు దెయ్యం మాస్టారుగా మారుమోగిపోతున్నారు. ఇంతకీ ఆయనకు ఈ బిరుదు రావడం వెనుక కథేంటో చూద్దాం. | Read More
భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ - ఆరుగురు మావోయిస్టులు హతం - 6 MAOISTS KILLED IN TELANGANA TODAY
Six Naxals killed in Bhadradri District : మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. భద్రాద్రి జిల్లా ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. భద్రాద్రి జిల్లాలోని కరకగూడెం మండలం రఘునాథపాలెంలో ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. | Read More
శాంతించిన కృష్ణమ్మ - అయినా ముంపులోనే లంకగ్రామాలు, వేలాది ఎకరాలు - KRISHNA River Flood Flow Decrease
Krishna River Flood Decrease : గత నాలుగు రోజులుగా జలవిలయం సృష్టించిన కృష్ణమ్మ శాంతించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం మూడు లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. గత రెండు రోజుల్లోనే ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరకు తగ్గింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ పరిస్థితులు క్రమక్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. | Read More
చిన్నారులను ఆకట్టుకొనేలా బోధన - ఈ మేడం చెప్పే పాఠాలంటే పిల్లలకు ఎంతో ఇష్టం - Special Story On Vijayawada Teacher
Special Story On Vijayawada Teacher : విద్యార్థుల ప్రాథమిక విద్యలో నాణ్యత కొరవడిందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఆమె చిన్నారుల బంగారు భవితకు గట్టి పునాది వేయాలని నిర్ణయించుకున్నారు. పై తరగతులకు చెప్పే సామర్థ్యం ఉన్నా కావాలనే చిన్నారులను ఆకట్టుకొనేలా బోధన చేసే బాధ్యతను తీసుకున్నారు. కార్పొరేట్ బడుల్లో పనిచేసే టీచర్ల కన్నా ప్రభుత్వ ఉపాధ్యాయులు తీసిపోరని నిరూపిస్తున్నారు. | Read More
వరద ఉద్ధృతి నుంచి కోలుకుంటున్న విజయవాడ - పునరావాసాలు వీడి ఆవాసాలవైపు కదులుతున్న బాధితులు - Relief operations in Vijayawada
Vijayawada Floods : బుడమేరు వరద ఉద్ధృతికి జలదిగ్భందంలో చిక్కుకున్న విజయవాడలోని పలు కాలనీలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. వరద ముంపులో కొనసాగుతున్న బాధితులు తమ నివాసాలను వదిలి బయటకు వస్తున్నారు. నీళ్లు తగ్గిన చోట్ల తిరిగి ప్రజలు తమ ఆవాసాలకు చేరుకుంటున్నారు. ఇళ్లు, వీధుల్లో పేరుకుపోయిన బురద, ఇతర చెత్తాచెదారాలను తొలగించేందుకు అగ్నిమాపకశాఖ రంగంలోకి దిగింది. నీటిలో లేని కాలనీలు, నివాస ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సైతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. | Read More
వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ - మంగళగిరి తరలిస్తున్న పోలీసులు - EX MP Nandigam Suresh Arrest
EX MP Nandigam Suresh Arrest : వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయణ్ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరికి తరలిస్తున్నారు. | Read More