ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 1 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sun Sep 01 2024- ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - దక్షిణమధ్య రైల్వే నుంచి 80 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు - SCR Cancelled Trains

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Andhra Pradesh Live News Desk

Published : Sep 1, 2024, 7:00 AM IST

Updated : Sep 1, 2024, 10:54 PM IST

10:51 PM, 01 Sep 2024 (IST)

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - దక్షిణమధ్య రైల్వే నుంచి 80 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు - SCR Cancelled Trains

SCR Cancelled Trains : భారీ వర్షాలు నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. మొత్తం 80 రైళ్లను పూర్తిగా, 9 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు, 49 రైళ్లను దారి మళ్లించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనను విడుదల చేసింది. | Read More

ETV Bharat Live Updates

10:50 PM, 01 Sep 2024 (IST)

వరదలతో అతలాకుతలమైన విజయవాడ - బుడమేరు ఉద్ధృతికి ప్రజల తీవ్ర ఇబ్బందులు - Floods in Vijayawada

Heavy Rains and Floods in Vijayawada: విజయవాడ నగరాన్ని వరదలు వణికిస్తున్నాయి. 50 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయి వర్షం నమోదు కావడంతో బుడమేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో నుంచి హైదరాబాద్‌, కోల్‌కతా వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా నీటమునిగాయి. బుడమేరు ఉద్ధృతికి విజయవాడ అతలాకుతలం అవుతుంది. | Read More

ETV Bharat Live Updates

10:27 PM, 01 Sep 2024 (IST)

ఆర్టీసీ బస్సులు దారి మళ్లింపు - విజయవాడ టూ పిడుగురాళ్ల వయా హైదరాబాద్​ - Buses close between Hyd Vijayawada

Hyderabad to Vijayawada Traffic Stopped : తెలంగాణలోని సూర్యాపేట మీదగా హైదరాబాద్​ టూ విజయవాడ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూర్యాపేట ఎస్పీ సన్​ప్రీత్​ సింగ్​ అన్నారు. | Read More

ETV Bharat Live Updates

10:09 PM, 01 Sep 2024 (IST)

పవర్‌ బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపండి - అమిత్ షాను కోరిన చంద్రబాబు - Chandrababu Phone Call to Amit Shah

CM Chandrababu Phone Call to Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి రాష్ట్రంలో వరద సహాయ చర్యలను వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పవర్‌ బోట్లను రాష్ట్రానికి పంపాలని సీఎం కోరారు. అవసరమైన మేరకు సాయం చేస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. | Read More

ETV Bharat Live Updates

09:38 PM, 01 Sep 2024 (IST)

సాధారణ పరిస్థితి వచ్చే వరకూ ఎన్టీఆర్​ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉంటా:చంద్రబాబు - Chandrababu Inspected Flood Areas

Chandrababu Inspected With Flood Areas: విజయవాడలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం పడవలో వెెళ్లి వరద ప్రాంతాలను పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లక్ష మందికి సరిపోయేలా ఆహారం సరఫరా చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. | Read More

ETV Bharat Live Updates

06:13 PM, 01 Sep 2024 (IST)

ఉరకలెత్తుతున్న వరద నీటితో ఉమ్మడి గుంటూరు అస్తవ్యస్తం - Flood Effect in Guntur District

Heavy Rains in Joint Guntur District: ఎడతెరిపిలేని వర్షాల ధాటికి ఉమ్మడి గుంటూరు జిల్లా అస్తవ్యస్తంగా మారింది. దారులన్నీ చెరువులయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఎక్కడికక్కడ వాగులు, చెరువులకు గండ్లు పడ్డాయి. పెద్దఎత్తున పంటపొలాలు మునిగి రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. ముంపు తీవ్రత ప్రాంతాల్లోని జనాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. | Read More

ETV Bharat Live Updates

05:29 PM, 01 Sep 2024 (IST)

రాష్ట్రం అతలాకుతలమైంది- అందరిని ఆదుకుంటాం- తప్పుడు ప్రచారాలపై చర్యలు : సీఎం - Chandrababu Review On Floods

CM Chandrababu Review On Floods: వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తుపాను తీరం దాటిన చోట కంటే ఇతర చోట్ల ఎక్కువ వర్షాలు కురిశాయన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడ్డాయన్న సీఎం జలాశయాలన్నీ దాదాపు నిండిపోయాయని వెల్లడించారు. వాగులు, చెరువులకు నీరు వెళ్లే దారిలో సత్వర క్లియరెన్స్‌ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. అమరావతి మునిగిందని వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని తెలిపారు. | Read More

ETV Bharat Live Updates

05:05 PM, 01 Sep 2024 (IST)

100 పునరావాస కేంద్రాలు- 17 స్పెషల్ టీంలు-సిద్దంగా హెలికాప్టర్లు - Ministers review on flood situation

Ministers are Conducting Series of Reviews Due to Rains : రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు వరుస సమీక్షలకు దిగుతున్నారు. పరిస్థిని బట్టి క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి ప్రవాహలపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసే సూచనలు హెచ్చరికలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలని మంత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

04:34 PM, 01 Sep 2024 (IST)

విజయవాడ -హైదరాబాద్ నేషనల్ హైవేపై వాహనాల నిలిపివేత - Officials Stop RTC Buses

Officials Stop RTC Buses Between AP And Telangana: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది. దీంతో ఐతవరం వద్ద ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. ముందస్తు జాగ్రత్తగా ఇతర వాహనాలను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. | Read More

ETV Bharat Live Updates

04:27 PM, 01 Sep 2024 (IST)

రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన వర్షాలు- కొనసాగుతున్న వరద ఉద్ధృతి - Rains Decrease in AP

Rains Decrease in AP: మూడు రోజులుగా ఏపీని ముంచెత్తిన వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరద నీరుతో లోతట్టు ప్రాంతాలు ప్రమాదపు అంచుల్లోనే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ద్రోణి ప్రభావంతో మరో 24 గంటల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. | Read More

ETV Bharat Live Updates

04:25 PM, 01 Sep 2024 (IST)

ఏలూరును వణికించిన వర్షాలు- కాసేపు హనుమాన్‌ జంక్షన్‌ మూసివేత - Flood Effect in Eluru District

Heavy Rains in Eluru District: భారీ వర్షాలు ఏలూరు జిల్లాను వణికించాయి. జిల్లాలో ప్రధాన జలాశయం పెద్ద చెరువుకు గండిపడి జాతీయ రహదారిపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో పరిస్థితి మరింత దిగజారింది. కలపర్రు వద్ద జాతీయ రహదారి టోల్ గేటుకు ఇరువైపులా కి.మీ ల పరిధిలో వాహనాలు నిలిచిపోయాయి. హనుమాన్​ జంక్షన్​ను కాసేపు మూసివేయడం అక్కడి తీవ్ర పరిస్థితికి అద్దం పడుతోంది. | Read More

ETV Bharat Live Updates

03:08 PM, 01 Sep 2024 (IST)

రికార్ఢు వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా అతలాకుతలం - Heavy Rains in Krishna District

Heavy Rains in AP : భారీ వర్షాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా తడిసిముద్దవుతోంది. వాగులు, వంకలు ఉగ్రురూపం దాల్చాయి. లోతట్టు ప్రాంతాలు, నివాసాలు జలమయం కావడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇక పూర్తిగా నీటమునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు. | Read More

ETV Bharat Live Updates

01:21 PM, 01 Sep 2024 (IST)

హైదరాబాద్-విజయవాడ మధ్య పలు రైళ్లు రద్దు- లబోదిబోమంటున్న ప్రయాణికులు - Trains Cancelled in Rains

SCR Cancelled Trains : భారీ వర్షాలతో కాజీపేట సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీంతో హైదరాబాద్ -విజయవాడ మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రైళ్లు రద్దు కావడంతో దూరం వెళ్లే ప్రయాణికులు పలు స్టేషన్లో చిక్కుకుపోయారు. అటు ప్యాసింజర్స్ కోసం అధికారులు హెల్ప్​లైన్ నంబర్లు, వైబ్​సైట్​ను అందుబాటులో ఉంచారు. | Read More

ETV Bharat Live Updates

11:04 AM, 01 Sep 2024 (IST)

ప్రాజెక్టులకు జలకళ - దిగువ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన - HEAVY FLOOD TO PROJECTS IN AP

Heavy Flood Water Flow To Irrigation Projects in AP : ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టాలు పెరుగుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

10:17 AM, 01 Sep 2024 (IST)

ఏపీలో భారీ వర్షాలు - సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఆరా - CM Chandrababu Review On Rains

CM Chandrababu Review On Rains AP: ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బలగాల ద్వారా సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు. | Read More

ETV Bharat Live Updates

09:36 AM, 01 Sep 2024 (IST)

పేపర్​లెస్ ఏపీ అసెంబ్లీ - త్వరలోనే నేషనల్‌ ఇ-విధాన్‌తో అనుసంధానం - AP Assembly Turns to Paperless

AP Assembly Turns to Paperless : ఏపీ అసెంబ్లీని పూర్తిగా డిజిటల్​ రూపంలోకి తీసుకొచ్చే దిశగా కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. బడ్జెట్​ సహా సభ్యుల ప్రశ్నలు, కమిటీల రిపోర్టులు మొదలైనవి డిజిటల్​ రూపంలోకి తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తోంది. త్వరలోనే నేషనల్​ ఇ-విధాన్​లో భాగస్వామి కాబోతోంది | Read More

ETV Bharat Live Updates

09:06 AM, 01 Sep 2024 (IST)

ఏపీలో విస్తారంగా వర్షాలు - అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు - Heavy Rains in AP

Heavy Rains in AP : ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల పైకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంట పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

07:32 AM, 01 Sep 2024 (IST)

విజయవాడలో గజవాన - గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడని వర్షం - ఆరుగురు మృతి - HEAVY RAINS IN VIJAYAWADA

Heavy Rains in Vijayawada : రెండు దశాబ్ధాలుగా ఎప్పుడూ నమోదుకానంతంగా కురిసిన వర్షానికి విజయవాడ నగరం వణికిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. జాతీయ రహదారిపై వరద ముంచెత్తడంతో వాహనాలు నిలిచిపోయాయి. | Read More

ETV Bharat Live Updates

07:19 AM, 01 Sep 2024 (IST)

పోలీసులకు బిగుస్తున్న ఉచ్చు - ముంబయి నటి వాంగ్మూలంలో కీలక విషయాలు - MUMBAI ACTRESS CASE

MUMBAI ACTRESS CASE: ముంబయి నటి కేసులో నకిలీ పత్రాలు సృష్టించిన పోలీసులకు ఉచ్చు బిగుస్తుంది. రెండో రోజూ హీరోయిన్, ఆమె కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు స్టేట్ మెంట్​ను రికార్డ్ చేసుకున్నారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనపై కేసు నమోదు చేయటం వెనుక కుట్ర ఉందని నటి పోలీసులకు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
Last Updated : Sep 1, 2024, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details