CM Chandrababu Babu Review Meeting : రాష్ట్రంలోని దర్యాప్తు, విచారణ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కేసుల విచారణ, దర్యాప్తు అంశాలపై సీఎం సమీక్షించారు. ఫైబర్ నెట్ కేసు, మదనపల్లిలో ఫైళ్ల దగ్ధం కేసు, ఇసుక దోపిడీ విచారణ, మద్యం కుంభకోణం తదితర వ్యవహరాల్లో జరుగుతున్న దర్యాప్తుపై ఆరా తీశారు. అదే సమయంలో వేర్వేరు కేసుల్లో వేగంగా దర్యాప్తు ముగించి కోర్టుల్లోనూ విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్షపడేలా చేయాలని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 30 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Mon Sep 30 2024- దర్యాప్తు, విచారణ సంస్థలతో సీఎం చంద్రబాబు భేటీ - వివిధ కేసుల పురోగతిపై ఆరా - CM Chandrababu Babu Review Meeting
By Andhra Pradesh Live News Desk
Published : Sep 30, 2024, 8:00 AM IST
|Updated : Sep 30, 2024, 10:45 PM IST
దర్యాప్తు, విచారణ సంస్థలతో సీఎం చంద్రబాబు భేటీ - వివిధ కేసుల పురోగతిపై ఆరా - CM Chandrababu Babu Review Meeting
దసరా స్పెషల్ - ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే - APSRTC DUSSEHRA SPECIAL BUSES
APSRTC SPECIAL BUSES FOR DUSSEHRA: దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే వార్త చెప్పింది. అక్టోబర్ 4 నుంచి 20 వరకు 6 వేల 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. అంతే కాకుండా రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ సైతం ఇవ్వనుంది. | Read More
'కుటుంబసభ్యులు అంగీకరిస్తేనే ఫొటో తీయాలి' - డిజిటల్ హెల్త్‌కార్డుల జారీపై తెలంగాణ సీఎం కీలక ఆదేశాలు - DIGITAL HEALTH CARDS IN TELANGANA
CM Revanth Reddy Review On Family Digital Cards : కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం అక్టోబరు 3 నుంచి 7 వరకు క్షేతస్థాయి పరిశీలన పైలట్ ప్రాజెక్టు సమర్థంగా చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని క్షేత్రస్థాయిలో నిర్ధారించడంతో పాటు సభ్యులను జత చేర్చడం, తొలగించడం వంటివి పూర్తి చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే కుటుంబ ఫొటోను తీయాలని సీఎం స్పష్టం చేశారు. | Read More
పాఠశాలల్లో హాజరు శాతం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలి: మంత్రి లోకేశ్ - Minister Lokesh Review on Education
Minister Nara Lokesh Review on Education Department: అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని మంత్రి నారా లోకేేశ్ సూచించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో సౌకర్యాలు, ఫలితాల మెరుగుదలలో ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలని కోరారు. | Read More
'భూ సమస్య'ల అర్జీలు పెండింగ్ - ఏళ్ల తరబడి విసిగిపోతున్న రైతన్నలు - Land issues in Anantapur District
Many Farmers are Committing Suicide due to Land Issues : ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూ సమస్యలు పరిష్కారం కాక ఆవేదనతో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి రికార్డులు లేవని, అగ్నిప్రమాదంలో కాలిపోయాయని కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. దీంతో బాధిత రైతులు ప్రాణాలు తీసుకోడానికి సైతం సిద్ధపడుతున్న పరిస్థితి నెలకొంది. | Read More
ఈ అమావాస్య రోజున "వారు" ఎదురుచూస్తుంటారు - ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయం! - Pitru Amavasya
Pitru Amavasya : హిందూ కాలమాని ప్రకారం మహాలయ పక్షాలు అక్టోబర్ 2న ముగియనున్నాయి. ఆ రోజున చంద్ర గ్రహణం, భాద్రపద పౌర్ణమి కూడా ఉన్నాయి. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య, పితృ అమావాస్య అనికూడా అంటారు. పితృ అంటే పూర్వీకులు అని అర్థం. ఈ మహాలయ సమయంలో పితృ దేవతలను స్మరించుకోవడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు పెరుగుతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి. | Read More
హైదరాబాద్ మెట్రో ఆఫర్లు పొడిగింపు - అక్డోబర్ 6 నుంచి ఆ స్టేషన్లలో పార్కింగ్ ఫీజు - Hyderabad Metro Offers
Hyderabad Metro Offers : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు అందిస్తున్న ఆఫర్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 వరకు ఆఫర్లు పొడిగించినట్లు సంస్థ ప్రకటించింది. అదే విధంగా అక్టోబర్ 6 నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. | Read More
"మాజీమంత్రి సుచరిత మరిది వేధిస్తున్నారు" - కలెక్టర్‌కు మహిళ ఫిర్యాదు - COMPLAINT ON EX MINISTER RELATIVE
Woman Complaint on Former Minister Mekathoti Sucharita Relative: గత ప్రభుత్వ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి మేకతోటి సుచరిత మరిది తమ స్థలాన్ని అద్దెకు తీసుకుని బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఓ మహిళ వాపోయారు. అధికారులు యంత్రాంగం స్పందించి తమ స్థలం ఇప్పించాలని ఆమె కోరుతున్నారు. | Read More
మంగళగిరిలో "నైపుణ్య గణన" ప్రాజెక్టు ప్రారంభం - 25 అంశాల్లో సమాచార సేకరణ - Skill Enumeration Project Started
Computation of Skill in Practice Today : కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న నైపుణ్య గణనను మంత్రి లోకేశ్మంగళగిరిలో ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యలను సరిదిద్దుకుంటూ నేడు పలు ప్రాంతాల్లో విజయవంతంగా ''నైపుణ్య గణన'' జోరుగా సాగింది. | Read More
11ఏళ్లకే 19 పతకాలు - కరాటేలో సత్తా చాటుతున్న తణుకు చిన్నారి - TANUKU KARATE GIRL
Tanuku Girl Excelling in Karate : 11 ఏళ్ల ప్రాయంలోనే కరాటేలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ ఔరా అనిపిస్తోంది ఆ బాలిక. జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైతం సత్తా చాటుతూ పతకాలు సాధిస్తోంది. ఆ చిన్నారే పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన సౌమ్య శ్రీ వైష్ణవి. | Read More
గౌతమి మధ్యలంక ప్రాంతాల్లో చిరుత అలజడి! - డ్రోన్లతో గాలింపు చేపట్టిన అటవీ శాఖ - Leopard movement in East Godavari
Tiger Roaming in East Godavari District : ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు అధికారుల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడి డ్రోన్ల సాయంతో వెతుకుతున్నారు. | Read More
తిరుమలలో మూడో రోజు సిట్ విచారణ - పిండి మర, ప్రయోగశాలలో తనిఖీలు - SIT Investigation in Tirumala
SIT Investigation on Tirumala Laddu Adulteration Case: తిరుమల లడ్డూ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ముమ్మర దర్యాప్తు చేస్తోంది. మూడో రోజూ సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మూడు రోజులుగా తిరుపతిలోనే మకాం వేసిన సిట్ సభ్యులు మూడు బృందాలుగా విడిపోయి తిరుమలలోని వివిధ విభాగాల్లో విచారణ చేపట్టారు. | Read More
'పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు' - కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం - Farmer Suicide Attempt
Farmer Suicide Attempt in Front of Collectorate in Satya Sai District : కలెక్టరేట్ ముందు ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమి ఆక్రమించుకుని పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు సమస్యపై డీఆర్వో వచ్చి ఆరా తీశారు. అతనికి న్యాయం చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. | Read More
'కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి' - తిరుమల కల్తీ నెయ్యిపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు - SC on Tirumala Laddu Adulteration
Supreme Court on Tirumala Laddu Ghee Adulteration: తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లడ్డూ వ్యవహారంపై సిట్ కొనసాగించాలా? లేదా? సహకారం ఇవ్వాలని ఎస్‌జీని కోరిన సుప్రీంకోర్టు, కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని పేర్కొంది. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? చెప్పాలని కేంద్రాన్ని కోరింది. రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని, కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. | Read More
"చార్మినార్ కూల్చివేతకు సిబ్బంది, యంత్రాలు అడిగితే ఇస్తారా?" - Hydra case in highcourt
Hydra case in highcourt : హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా అసలు లక్ష్యాలను వదిలేసిందని, ఇదే వైఖరి కొనసాగితే ఏర్పాటుపై స్టే ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. విచారణకు హైడ్రా కమిషనర్ రంగానథ్ వర్చువల్‌గా హాజరు కాగా, అమీన్‌పూర్ తహసీల్దార్ నేరుగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. | Read More
తిరుమలగిరుల్లో ఈ జలం సేవిస్తే జ్ఞానయోగం - శేషగిరుల్లో 66 కోట్ల తీర్థాలు, ఏడు ముక్తిప్రదాలు - tirumala tirupati
tirumala tirupati : కోట్లాది మంది భక్తులు కలియుగ ప్రత్యక్షదైవంగా భావించే శ్రీ వేంకటేశ్వరస్వామి శేషపర్వతం ముఖభాగాన్ని వేంకటాద్రి, మధ్యభాగాన్ని నృసింహాద్రి, వెనుక భాగాన్ని శ్రీశైలం అని పురాణాలు పురాణాలు అభివర్ణిస్తున్నాయి. ఈ శేషగిరులు అనేకానేక వృక్షసంపద, జీవసంపద, జంతుకోటికి ఆలవాలమే కాకుండా అనేకానేక పుణ్యతీర్థాలు కలిగి జలసంపదకు నిలయంగా ఉన్నాయి. | Read More
ఇంద్రకీలాద్రిపై ప్రతిష్ఠాత్మకంగా దసరా ఏర్పాట్లు : మంత్రి ఆనం - Dussehra Arrangements
Minister Anam Review on Dasara Arrangements in Vijayawada : దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఏ మాత్రం అసౌకర్యం లేని విధంగా నిర్వహించాలని మంత్రి రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలసి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. | Read More
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల - ఈ నెల 9న నియామక పత్రాల అందజేత - DSC Results 2024
CM Revanth Reddy Will Release DSC Results 2024 : అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ ఫలితాలను విడుదల చేశారు. | Read More
ఏలూరులో కాల్‌మనీ ఆగడాలు - మంగళవారం వచ్చిదంటే బాధితులకు వణుకు - Call Money Harassment in Eluru
Eluru Call Money Victims Issues : మంగళవారం వచ్చిందంటే చాలు వారిలో భయం మొదలవుతుంది. ఈ వారం ఎంత వడ్డీ కట్టమంటారో? ఎక్కడి నుంచి తేవాలో కట్టలేకపోతే ఎలాంటి బెదిరింపులు ఎదురవుతాయో? అనే భయం వారిని నిద్రపోనివ్వకుండా చేస్తుంది. అసలుకి అసలు వడ్డీకి వడ్డీ కట్టినా సరే డబ్బుల రూపంలో మనుషుల రక్తం తాగే వారి అత్యాశకు సరిపోయేది కాదు. ఉన్నదంతా ఊడ్చి వారి చేతుల్లో ధారపోసినా ఇంకా కట్టాల్సిందేననే సమాధానం విని బాధితుల గుండెలు బరువెక్కేవి. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక నేతలు సాగించిన కాల్‌మనీ దందాకు బలైన బాధితుల ఆవేదన. | Read More
ఐదేళ్లలో 7.75 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా 'సమీకృత ఇంధన పాలసీ' - New Energy Policy in State
New Energy Policy in State : రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో రూ. 10లక్షల కోట్ల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా ‘సమీకృత ఇంధన పాలసీ’ని ప్రభుత్వం రూపొందించింది. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయో ఫ్యూయల్, పీఎస్‌పీ, హైబ్రిడ్ ప్రాజెక్టులు సోలార్ పార్కులు, తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఒకే పాలసీని తీసుకొస్తోంది. ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదాను కల్పించనుంది. ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడుల లక్ష్యంగా ప్రభుత్వం పాలసీని రూపొందించింది. పునరుత్పాదక తయారీ జోన్‌లను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం 500 విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలను సైతం నెలకొల్పనుంది. | Read More
టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకర్ల నోటీసులు- 'ఇళ్లు ఇవ్వకుండా వాయిదా ఎలా కట్టాలి?' - TIDCO Beneficiaries Facing Problems
YSRCP Took Loans TIDCO Beneficiaries Facing Problems in Krishna District : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకం టిడ్కో లబ్ధిదారులకు శాపంగా మారింది. ఇళ్ల నిర్మాణం పేరుతో గత ప్రభుత్వం తీసుకున్న రుణాలు లబ్ధిదారుల మెడకు చుట్టుకుంటున్నాయి. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుండటంతో టిడ్కో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం తమ పేరు మీద తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. | Read More
'తల్లిదండ్రులూ' తస్మాత్ జాగ్రత్త - పక్కనే మృగాళ్లున్నారు!! - POCSO Act
POCSO Act : కామం కళ్లనే కాదు మెదడునూ మూసేస్తుంది. వావీ, వరసలు కన్పించకుండా చేస్తుంది. కోరిక మనిషినే కాదు. మానవత్వాన్ని చంపేస్తుంది. చిన్నా, పెద్దా అనే గౌరవాలను తుంచేస్తుంది. దుర్మార్గపు ఆలోచన మృగాళ్లుగా మారుస్తోంది. స్త్రీలు అయితే చాలు పసి పిల్లలు, వృద్ధులనే తేడా లేకుండా కాటేస్తోంది. మానవీయ విలువలకే సమాధి కట్టే, మనుషులమేనా అని అనుమానం వచ్చేలా దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మృగాళ్ల వాంఛాగ్నిలో చిన్నారులు కలువల్లా కాలిపోతున్న సంఘటనలు అనేకం. | Read More
కడప జిల్లాలో దారుణం - మంచం కింద డిటోనేటర్లు పేల్చి వీఆర్‌ఏ హత్య - Detonators Blast in YSR District
VRA Died in Kadapa District : వైఎస్సార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొత్తపల్లిలో వీఆర్‌ఏ ఇంట్లో డిటోనేటర్లు పేలాయి. వారు నిద్రిస్తుండంగా ఓ దుండగుడు వారి మంచం కింద డిటోనేటర్లు ఏర్పాటు చేసి పేల్చాడు. ఈ ఘటనలో వీఆర్ఏ మృతిచెందగా ఆయన భార్య తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. | Read More
బ్రెయిన్ యాక్టివ్ కావాలా - ఈ ఐదు పనులు చేస్తే అంతా సెట్! - Five Steps to Brain Health
Five Steps to Brain Health : మన శరీరంలో మెదడు ఎంతో కీలకమైన అవయవం. దాని ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే బ్రెయిన్ ఆరోగ్యంగా చురుగ్గా, పవర్‌ఫుల్‌గా వర్క్ చేయాలంటే కొన్ని అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు వైద్యనిపుణులు. వాటి నుంచి బయటపడేందుకు కొన్ని సలహాలు, సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకోవాలాంటే ఈ స్టోరీ చదవాల్సిందే. | Read More
'మేమేం చేశాం అమ్మా' - ఇద్దరు చిన్నారులతో కాలువలోకి దూకిన తల్లి - Mother Commits Suicide
Mother Commits Suicide With Two Children in Vijayawada : చిన్నచిన్న కలహాలు భార్య, భర్తల మధ్య చిచ్చుపెడుతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాలకు శాపాలుగా మారుతున్నాయి. ప్రశాంతంగా కూర్చోని ఆలోచిస్తే పరిష్కారం అయ్యే సమస్యలను భూతద్దంలో పెట్టి చూసి మరణాలకు స్వాగతం పలుకుతున్నారు. దంపతుల మధ్య కలహాలతో అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులతో పాటు వారు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలాంటి హృదయవిదారక సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. | Read More
నైపుణ్యాలే ఉపాధికి ఊతం - ఎలక్ట్రికల్ నుంచి సాఫ్ట్ వేర్ కోర్సుల వరకు శిక్షణ ఆ భవనంలోనే!! - digital Training Unemployed Youth
Skill Development Training for Unemployed Youth in West Godavari : ఉన్నత చదువులు చదివినా, ఉద్యోగం సాధించాలంటే సరైన నైపుణ్యం తప్పనిసరి. నైపుణ్య లేమితో కంపెనీల్లో కొలువు సాధించలేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ, గ్రామీణ యువతకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పీఎం లంకలోని డిజిటల్ కమ్యూనిటీ భవనం పరిష్కార మార్గం చూపుతోంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ డిజిటల్ భవనం ఇప్పటికే ఎంతోమందికి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇస్తుంది. | Read More
మద్యం రిటైల్ వ్యాపారం ఇక ప్రైవేటుకి - నేడో రేపో ప్రకటించే ఛాన్స్ - AP New Liquor Policy Notification
New Liquor Shops Notification in AP : రాష్ట్రంలో మద్యం విధానంపై నేడో రేపో నోటిఫికేషన్ విడుదల కానుంది. రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్‌కు అప్పగించే ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు అక్టోబర్‌లో లైసెన్సుల జారీ పూర్తిచేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నద్ధమవుతోంది. | Read More
దూకుడు పెంచిన సిట్ - నెయ్యి సరఫరా టెండర్లపై ఆరా - SIT Inquiry Adulteration Ghee Case
Adulteration Ghee Case in Tirumala : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఏర్పాటైన సిట్ రెండోరోజు దర్యాప్తును ముమ్మరం చేసింది. అధికారులు పని విభజన చేసుకుని విచారణ వేగవంతం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావుతో భేటీ అయ్యి నెయ్యి సరఫరా టెండర్లపై ఆరా తీశారు. ప్రొక్యూర్‌మెంట్ జీఎంకు పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. | Read More