HUGE DONATIONS TO AP CMRF: వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి లోకేశ్‌ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన దాతలను సీఎం అభినందించారు. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 13 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Fri Sep 13 2024- వరద బాధితులకు ఆపన్న హస్తం - భాష్యం 4 కోట్లు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ 3 కోట్లు - HUGE DONATIONS TO AP CMRF
By Andhra Pradesh Live News Desk
Published : Sep 13, 2024, 9:24 AM IST
|Updated : Sep 13, 2024, 9:39 PM IST
వరద బాధితులకు ఆపన్న హస్తం - భాష్యం 4 కోట్లు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ 3 కోట్లు - HUGE DONATIONS TO AP CMRF
విజయవాడలో వేగంగా పారిశుద్ధ్య పనులు- సాధారణ స్థితికి చేరుతున్న కాలనీలు - Vijayawada Recovering to Floods
Vijayawada Recovering to Floods : విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలు వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. సింగ్‌నగర్ ఇప్పటికే పూర్తిస్థాయి సాధారణ స్థితికి చేరుకోగా పాయకాపురంలోని అనేక కాలనీలు క్రమంగా కోలుకుంటున్నాయి. ఇళ్ల మధ్య నిల్వ ఉన్న నీటిని బయటకు పంపే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటురోగాలు ప్రబలకుండా కార్మికులు పారిశుద్ధ్య కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. | Read More
వేణుగానంతో మైమరిపిస్తున్న యువ కళాకారిణి - జాతీయ స్థాయిలో ప్రశంసలు - A Girl Mesmerizing with her Flute
A Young Girl Mesmerizing with her Flute at Satya Sai District : మాటలైనా, పాటలైనా కళ్లకు కట్టే సంగీత సాధనం వేణువు. ఆ మధుర నాదాల మధ్యే పుట్టి పెరిగిందా అమ్మాయి. ప్రాణవాయువును రాగాలుగా మలిచే ఆ వాయిద్యంపై చిన్ననాటే మనసు పారేసుకుంది. తండ్రే తొలి గురువుగా వేణునాదంలో ఆరితేరింది. శాస్త్రీయ రాగాలైనా, సినిమా గీతాలైనా క్షణాల్లో వినిపిస్తూ శ్రోతల్ని పరవశింపజేస్తోంది. | Read More
బోట్ల తొలగింపు మూడోరోజు ముమ్మరం- రంగంలోకి దిగిన అబ్బులు బృందం - Boat Removal process on third day
Barrage Gates Boat Rescue Process Continuing on Third Day : ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ వరుసగా మూడోరోజు ముమ్మరంగా కొనసాగుతోంది. గేట్ల వద్ద చిక్కుకున్న నాలుగు భారీ పడవలను బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రంగంలోకి దిగిన కాకినాడకు చెందిన పడవలను వెలికితీసే నిపుణుడు అబ్బులు నేతృత్వంలోని 14 మంది బృందం భారీ బోట్లు బయటకు లాగే ఏర్పాట్లు చేసింది. | Read More
పట్టాలెక్కిన పరిశోధనలు- ఉద్దానం బాధతులకు కూటమితో ఊరట - kidney disease in Uddanam area
Kidney Disease in Uddanam : గత ప్రభుత్వ హయాంలో ఉద్దానం కిడ్నీ బాధితులకు వైద్యం గాలిలో దీపంలా మారింది. అందనంత దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రజలు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. | Read More
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం - రెండు లారీలు-బస్సు ఢీ - ఆరుగురు మృతి - Road Accident in Chittoor District
Road Accident in Chittoor District: చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 30 మందికి గాయాలు అయ్యాయి. రెండు లారీలు, బస్సు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో కొందరికి తీవ్రగాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. | Read More
ఇసుక అక్రమ తవ్వకాల్లో గత ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు సీరియస్ - Supreme Court Fire YCP Government
Supreme Court Fire YCP Government : రాష్ట్రంలో ఇసుక అక్రమ మైనింగ్‌లో గత ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలిచ్చినా నోటీసుల జారీ, కేసు నమోదులో జాప్యమెందుకైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. జులై, ఆగస్టు వరకు ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 18న చేపట్టనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. | Read More
'చీటీ డబ్బులు అడిగితే చంపేస్తామంటున్నారు - వైఎస్సార్సీపీ నేతల నుంచి ప్రాణహాని ఉంది' - YSRCP Victim at CM House
YSRCP Victim at CM House: వైఎస్సార్సీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వెంకటలక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వైఎస్సార్సీపీ నేత లోలద రమణ వద్ద 2021 నుంచి రూ.15 లక్షలు చీటీ కడుతున్నామని, కట్టిన డబ్బులు చెల్లించకపోగా అడిగితే చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపించారు. భీమిలి నుంచి సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన బాధితురాలికి మంత్రి నారా లోకేశ్ ధైర్యం చెప్పి, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. | Read More
తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చి తనువు చాలించిన తల్లి - అనాథలైన పిల్లలు - Woman Gives Birth Nine Babies
Woman Gives Birth Nine Babies in Bapatla District : నేటి కాలంలో దంపతులకు ఒక సంతానం ఉంటేనే వామ్మో అనుకుంటున్నారు. వారి అల్లరి భరించి, స్కూల్ ఫీజులు, ఆరోగ్యం తదితర అవసరాల వ్యయాన్ని భరించాలంటేనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు విభిన్నంగా బాపట్ల జిల్లాలో ఒక జంట మాత్రం ఇద్దరూ, ముగ్గరూ కాదు ఏకంగా 9 మంది బిడ్డలకు జన్మనిచ్చారు. 9వ బిడ్డకు జన్మనిచ్చి అనారోగ్యంతో ఆ తల్లి మరణించింది. దీంతో ఆ పిల్లలు అనాథలు అయ్యారు. | Read More
భాగ్యనగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు - 2028 నాటికి 34 లక్షల ఉద్యోగాలు - GCCs in Hyderabad
GCCs Establishment in Hyderabad : హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే వాటి వల్ల రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పెరుగతాయని యోచిస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు వాటి జీసీసీ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నాయి. | Read More
'గాయాలను నిర్లక్ష్యం చేస్తే కార్నియాకు ప్రమాదం- అంధత్వ సమస్యను పారదోలడమే లక్ష్యం' - Dr Gullapalli Nageswara Rao
LV Prasad Eye Institute : దేశం నుంచి కార్నియా అంధత్వ సమస్యను పారదోలడమే తమ ముందున్న లక్ష్యమని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు తెలిపారు. కంటికి దెబ్బ తగిలి ఎర్రబడితే పాలు పోయొద్దని సూచించారు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలన్నారు. లేకపోతే కార్నియా ఇన్ఫెక్షన్లు వచ్చి తద్వారా అంధత్వం పెరుగుతుందని అన్నారు. | Read More
రోజుకు 14 సెల్ఫీలకంటే ఎక్కువ తీసుకుంటున్నారా?- ఇక అంతే సంగతులు! - Selfies Reels Becoming Dangerous
Selfies and Reels Becoming Dangerous Habit : సెల్ఫీలు, రీల్స్ సామాజిక మాధ్యమాల్లో విరివిగా పోస్ట్ చేయడం సర్వసాధారణమైపోయింది. దీన్ని కొందరు సమాచార ప్రచారానికి వాడితే మరికొందరు రోజూ వారి అలవాట్ల జాబితాలో చేర్చుకుని వాటికి బానిసలవుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు కూడా. అయితే ఇదో మానసిక రుగ్మత అంటున్నారు నిపుణులు. | Read More
కొత్త డిజైన్లతో గద్వాల్ పట్టుచీరలు - ఆన్లైన్లో ‘పట్టు’కోవచ్చు - Gadwal silk sarees
Gadwal Silk Sarees Selling on Online in Emmiganoor at Kurnool District : గద్వాల్ పట్టు చీరలు అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుతో కర్ణాటక ప్రాంతంలో పేరొందాయి. ఇక్కడి పట్టుచీరలు ఎంతో లైట్ వెయిట్‌గా ఉండంతో మహిళలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. | Read More
మద్యం ప్రియులకు షాక్ - 2 రోజులు మద్యం దుకాణాలు బంద్ - Wines Closed Due to Immersion
WineShops Close for Ganesh Immersion : తెలంగాణ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 17న వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు మూసేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు మూసేయాలని స్పష్టం చేశారు. | Read More
'రాజకీయ కుట్రలు సహించేది లేదు - శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించండి' - CM Revanth Orders to DGP
Telangana CM Revanth Issued Orders to DGP : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. | Read More
గుంటూరులో పడకేసిన పారిశుద్ధ్యం- కొండలా పేరుకున్న చెత్త కుప్పలు - SANITATION IN GUNTUR
Disorganized Sanitation in Guntur: గుంటూరులో పారిశుద్ధ్యం పడకేసింది. వారం రోజులుగా ప్రధాన కూడళ్లు, అనేక కాలనీల్లో చెత్త పేరుకుకుపోయింది. రహదారుల వెంట కుప్పలుగా పోగుబడి దుర్గంధం వెదజల్లుతోంది. గుంటూరు పురపాలక సిబ్బందిని విజయవాడలో పారిశుద్ధ్య నిర్వహణ పనులకు పంపడం వల్లే సమస్య తలెత్తింది. | Read More
డయల్ 100 పని చెయ్యడం లేదా?- 112 కు ట్రై చెయ్యండి - Dial 100 is Not Working at Times
Dial 100 is Not Working at Times And is Causing Problems : ఇటీవల మునగపాకలో ఏటీఎం చోరీ సమయాన స్థానికుడొకరు గుర్తించాడు. వెంటనే డయల్ 100కి ఫోన్ చేశాడు. ఎలాంటి స్పందన లేదు. అనకాపల్లిలో ఓ తగాదాను పోలీసుల దృష్టికి తీసుకురాడానికి డయల్ 100కి కాల్ చేయగా లైన్ కలవలేదు. చోడవరంలో రోడ్డు ప్రమాదం సమయంలో వివాదం చోటు చేసుకుంది. పోలీసులకు సమాచారం ఇవ్వడానికి 100కి డయల్ చేయగా పని చేయలేదు. | Read More
మురికికూపంగా ఆధ్యాత్మిక నగరం - అడుగు తీసి బయట పెట్టలేకున్న తిరుపతి ప్రజలు - Worst Sanitation in Tirupati
Worst Sanitation in Tirupati Municipal Corporation: తిరుపతి నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. గత ఐదేళ్లుగా పూడిక తీయకపోవడం వల్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా కాలనీల్లో మురుగు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. ఒకప్పుడు ఆకర్షణీయ నగరంగా ఓ వెలుగు వెలుగిన తిరుపతి మురుగు నగరంగా మారిపోయింది. | Read More
ఇంకా చిక్కని చిరుత - ట్రాక్ కెమెరాల్లో కనిపిస్తున్నా! - LEOPARD ROAMING IN RAJAHMUNDRY
Leopard Wandering in Rajahmundry : రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో తిష్ట వేసిన అధికారులు ఏర్పాటు చేసిన బోన్లలో మాత్రం చిక్కడం లేదు. అప్పుడప్పుడు ట్రాక్ కెమెరాలలో మాత్ర కనిపిస్తోంది. తాజాగా చిరుత పాదముద్రలను అధికారులు గుర్తించారు. బోన్లకు చిక్కకుండా తిరుగుతున్న చిరుత జాడను కనిపెట్టేందుకు వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. | Read More
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు - స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మంత్రి లోకేశ్ చర్యలు - Telugu Pilgrims Stuck in Kedarnath
Telugu Pilgrims Stuck in Kedarnath: ఈ నెల 11 కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికులు చిక్కుకుపోయియని విషయం తెలిసిందే. అందరూ సురక్షితంగా తిరిగి వచ్చేలా తాను బాధ్యత తీసుకుని, దగ్గరుండి పర్యవేక్షిస్తానని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. మరోవైపుయాత్రికులతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్‌లో మాట్లాడారు. | Read More
పొలాలను వీడని వరద- రైతన్నలకు తీరని వ్యథ - Crops Loss Due to Floods in Guntur
Crops Loss Due to Floods in Guntur District : పదిరోజుల క్రితం వరకూ అవన్నీ పంట పొలాలు! ఇప్పుడు నీటి కుంటలను తలపిస్తున్నాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన పైర్లు నీటి పాలయ్యాయి. వరదలు వచ్చి పది రోజులు దాటినా పంటలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. గుంటూరు వాహినికి పడిన గండ్లు.. రైతులకు కడగండ్లనే మిగిల్చాయి. | Read More
సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాల వెల్లువ - దాతలను అభినందించిన చంద్రబాబు - HUGE DONATIONS TO CMRF AP
Huge Donations to CMRF AP : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు దాతలు స్వచ్చందగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పలువురు విరాళాలు అందజేశారు. కష్టాల్లో ఉన్న బాధితులను ఆదుకునేందుకు తోడ్పాటునిచ్చిన దాతలను సీఎం అభినందించారు. | Read More
కనుమరుగవుతున్న ఆ గ్రామం.. - Old Edlanka Submerged to Krishna
Old Edlanka Village Submerged in Krishna River Floods : ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాలు కృష్ణానది తనలో కలిపేసుకుంటుంది. పదుల సంఖ్యలో ఇళ్లను కృష్ణమ్మ తనలో కలసిపోతున్నాయి. చూసి కన్నీరు పెట్టడం తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితి ఆ గ్రామస్థులది. గ్రామ రక్షణ కోసం వంతెన నిర్మిస్తామని గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హమీ ఇచ్చి మరిచింది. కృష్ణమ్మకు వరదలు వచ్చిన ప్రతిసారీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. | Read More
కాదంబరీ జత్వానీ కేసులో అడ్డంగా దొరికిపోయిన ఐపీఎస్‌లు - ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సార్! - Bollywood Actress kadambari Issue
Bollywood Actress Kadambari Case: ఏదైనా ఘటన జరిగితే, పోలీసులు తొలుత కేసు పెట్టి, తర్వాత దర్యాప్తు చేయడం సహజం. మాజీ సీఎం జగన్ భక్త ఐపీఎస్‌లు మాత్రం నటి కాదంబరీ జత్వానీ వ్యవహారంలో అత్యుత్సాహంతో చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా ముంబయికి విమాన టిక్కెట్లు బుక్ చేసుకుని, దొరికిపోయారు. | Read More
విపత్తు వేళ పరిమళిస్తున్న మానవత్వం - ఈనాడు సహాయ నిధికి విరాళాల వెల్లువ - Donations To Eenadu Relief Fund
Huge Donations To Eenadu Relief Fund: తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు రామోజీ గ్రూపు ఈ నెల 4న 5 కోట్ల స్వీయ విరాళంతో ఏర్పాటు చేసిన ఈనాడు సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. దిల్లీకి చెందిన ఎన్టీఎస్సీ ఛైర్మన్ ప్రేమ్‌కిషన్ గుప్త కోటి రూపాయలు ఇచ్చి ఉదారత చాటుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ఎంతో మంది సహృదయత చాటుతున్నారు. వరద బాధితులకు సాయం చేయాలనుకునేవారు ఈనాడు రిలీఫ్ ఫండ్ యూనియన్ బ్యాంక్ ఖాతా నంబరు 370602010006658కు పంపాలని కోరింది. | Read More