ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 6 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Fri Sep 06 2024- విపత్తు నుంచి బయటపడేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నా - ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: సీఎం చంద్రబాబు - CM CBN on Flood Relief Measures

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Andhra Pradesh Live News Desk

Published : Sep 6, 2024, 7:55 AM IST

Updated : Sep 6, 2024, 9:45 PM IST

09:44 PM, 06 Sep 2024 (IST)

విపత్తు నుంచి బయటపడేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నా - ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: సీఎం చంద్రబాబు - CM CBN on Flood Relief Measures

CM Chandrababu Press Meet on Flood Relief Measures: నాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై విజయవాడ కలెక్టరేట్‌ వద్ద సీఎం మీడియాతో మాట్లాడుతూ విపత్తు నుంచి బయటపడేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నానని తెలిపారు. శనివారం విజయవాడ కలెక్టరేట్‌లోనే వినాయక చవితి పూజ ఉంటుందని ఆ పూజ చేసుకుంటూనే సహాయ చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. | Read More

ETV Bharat Live Updates

08:36 PM, 06 Sep 2024 (IST)

అల్పపీడనం ప్రభావం - మన్యం జిల్లాలో భారీ వర్షాలు - Heavy Rains in Manyam District

Heavy Rains in Manyam District: అల్పపీడనం ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం దాటికి రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో నగర ప్రజలు, వాహనదారులు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. | Read More

ETV Bharat Live Updates

08:30 PM, 06 Sep 2024 (IST)

డబ్బు కోసం హత్యలు - తెలిసిన వాళ్లే మహిళల ముఠా టార్గెట్​ - Murders by Womens Gang

Murders with Cyanide: డబ్బు కోసం చుట్టుపక్కల వారిని సైనైడ్​తో చంపుతున్న ఘటనలు గుంటూరు జిల్లాలో కలకలం సృష్టించాయి. మహిళ అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టగా పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ముగ్గురు మహిళలు ముఠాగా ఏర్పడి ఈ ఘాతుకాలు చేస్తున్నట్లు తెలిసి పోలీసులు నివ్వెరపోయారు. ఈ ముఠా చేతిలో పడి నలుగురు మరణించగా మరో ముగ్గురు తప్పించుకున్నారు. ఈ వ్యవహారంలో మాజీ వాలంటీర్ ఒకరు కీలక నిందితురాలిగా ఉండటం విశేషం. | Read More

ETV Bharat Live Updates

07:52 PM, 06 Sep 2024 (IST)

గణపయ్యా నీ పూజ చేసేదెలాగయ్యా!- కన్నీరుమున్నీరవుతున్న వ్యాపారులు, ప్రజలు - Vinayaka Chavithi in Vijayawada

Vinayaka Chavithi Celebrations in Vijayawada: గణేశా ఇదేం బాధ అంటూ విజయవాడ వరద బాధితులు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా వినాయక చవితి సందడి నగరంలో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది నగరం వరదార్పణం కావడం ఆవేదన కలిగిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినాయకుడికి తొలిపూజ చేయాలని సంకల్పం గట్టిగా ఉన్నప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో నిరాశకు లోనవుతున్నారు. | Read More

ETV Bharat Live Updates

05:25 PM, 06 Sep 2024 (IST)

వరద బాధితులకు విరాళాల వెల్లువ- స్ఫూర్తిదాయకమని సీఎం అభినందనలు - Huge Donations To CMRF AP

Huge Donations To CMRF Andhra Pradesh : ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్థం విరాళాలివ్వడానికి సంస్థలు, వ్యక్తులు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో చంద్రబాబుని పలువురు కలిసి విరాళానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. వారికి సీఎం అభినందనలు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates

05:14 PM, 06 Sep 2024 (IST)

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.3,300 కోట్లు సాయం - Central Govt Help to Telugu States

Central Government Help Telugu States Due to Floods: వరదలతో అతలాకుతమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలకు కలిపి రూ.3,300 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. | Read More

ETV Bharat Live Updates

05:06 PM, 06 Sep 2024 (IST)

బుడమేరుకు చేరుకున్న ఆర్మీ - కాసేపట్లో గండి పూడ్చే పనులు ప్రారంభం - LEAKAGE WORKS Under Indian Army

Indian Army is Reached Budameru Leakage Area : బుడమేరులో గండి పడిన ప్రాంతానికి ఆర్మీ పెద్ద స్థాయిలో చేరుకుంటుంది. 6th మద్రాస్ రెజిమెంట్ నుంచి 120 మంది అధికారులు, ఆర్మీ జవాన్లు వచ్చారు. మరికొద్ది సేపట్లో మిలిటరీ ఆధ్వర్యంలో గండి పూడ్చే కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

05:05 PM, 06 Sep 2024 (IST)

వరద బాధితులకు అండగా వెంకటేశ్‌, రానా - తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం - Hero Venkatesh Rana Donation

Venkatesh, Rana Donation to Help Flood Victims: వరద బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమ నటులు ముందుకు వచ్చారు. ఇప్పటికే చాలామంది తమవంతు సాయం అందజేశారు. తాజాగా వెంకటేశ్​, రానా విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం అందజేయనున్నట్లు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates

03:55 PM, 06 Sep 2024 (IST)

శరవేగంగా బుడమేరు గండ్ల పనులు- కట్టపై రామానాయుడు, లైవ్​ ద్వారా లోకేశ్​ పర్యవేక్షణ - BUDAMERU LEAKAGE WORKS ON FAST

BUDAMERU LEAKAGE WORKS ON FAST : మంత్రులు లోకేశ్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేయగా, మూడో గండి పూడ్చివేత పనులు ప్రారంభమయ్యాయి. డ్రోన్ లైవ్ ద్వారా సూచనలు ఇస్తూ పనులను లోకేశ్ పర్యవేక్షిస్తున్నారు. పూడిక పనులను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా పర్యవేక్షించారు. | Read More

ETV Bharat Live Updates

03:33 PM, 06 Sep 2024 (IST)

వరద పరిస్థితిపై చంద్రబాబు కన్నీళ్లను గమనించా- రైతులను ఆదుకుంటామన్న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ - Flood Affected Areas in AP

Central Minister Shivraj Singh Chouhan: వరద కారణంగా నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండగా ఉంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో ఆయన కృష్ణ జిల్లా కేసరపల్లికి వచ్చారు. బుడమేరు దెబ్బకు నిండా మునిగిన పంట పొలాలను పరిశీలించారు. | Read More

ETV Bharat Live Updates

02:27 PM, 06 Sep 2024 (IST)

పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచాలి- ఆర్మీ సహకారంతో గండ్లు పూడ్చివేత : సీఎం చంద్రబాబు - CBN Tele Conference in Officials

Madras Army Reached The Budameru Canal: వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బుడమేరు కాలువ గండ్లు పూడ్చేందుకు ఆర్మీ బృందం ఘటనా స్థలానికి చేరుకుందన్నారు. అత్యంత క్లిష్టంగా ఉన్న మూడో గండి పూడ్చివేత పనులను ఆర్మీ అధికారుల సహకారంతో ప్రభుత్వం వేగంగా పూర్తి చేయనుంది. | Read More

ETV Bharat Live Updates

12:27 PM, 06 Sep 2024 (IST)

సింగ్​నగర్​లో మళ్లీ వరద- సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు - Floods Increasing to Singh Nagar

Floods Increasing to Vijayawada Singh Nagar: విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో క్రమంగా వరద పెరుగుతోంది. వరద పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నిన్నటి వరకు వరద తగ్గడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన వారంతా సింగ్ నగర్ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం వరద పెరగడంతో తిరిగి ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. | Read More

ETV Bharat Live Updates

12:12 PM, 06 Sep 2024 (IST)

బుడమేరు రెండు గండ్లు పూడ్చివేత- పనులపై చంద్రబాబుకు నివేదిస్తున్న మంత్రి నిమ్మల - BUDAMERU LEAKAGE WORKS

Ramanaidu Inspects Budameru Leakage Works: భారీ వర్షాలు, వరదలతో బుడమేరు కాలువకు పడిన గండ్లలో రెండు పూడ్చివేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రస్తుతం బుడమేరు కాలువకు 9 వేల క్యూసెక్కుల వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి వస్తోందన్నారు. మూడో గండిని చేరుకునేందుకు వీలుగా అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. | Read More

ETV Bharat Live Updates

10:36 AM, 06 Sep 2024 (IST)

విద్యాసాగర్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు మద్దతు ఇస్తున్నారు: నటి కాదంబరీ - Bollywood Actress kadambari Issue

Bollywood Actress kadambari Jethwani Issue Update : ముంబయికి చెందిన సినీ నటి కాదంబరీ జత్వానీపై అక్రమ కేసు వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆమె విజయవాడ పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. దర్యాప్తు అధికారి ఏసీపీ స్రవంతి రాయ్‌ని కలిసి పలు అంశాల గురించే ఫిర్యాదు చేశారు. | Read More

ETV Bharat Live Updates

10:16 AM, 06 Sep 2024 (IST)

చీకట్లను చీల్చుకుంటూ బయట పడుతున్న విజయవాడ - చురుగ్గా సాగుతున్న సహాయక చర్యలు - Relief Work in Flood Affected Areas

Relief Works in Vijayawada Flood Affected Areas: విజయవాడలో వరద ముంపు ప్రాంతాలు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. కొన్ని చోట్ల నీరున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడింది. దీంతో సింగ్‌నగర్ సహా వేర్వేరు ప్రాంతాలకు వాహన రాకపోకలు పునరుద్ధరించారు. వరద నీరు తగ్గిన సింగ్ నగర్ నుంచి పైపుల రోడ్ వరకూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. బురద, వ్యర్థాల తొలిగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. బాధితులకు ఆహారం, నీరు సరఫరా చేస్తూనే అంటు వ్యాధుల ప్రబలకుండా చర్యలు చేపట్టారు. | Read More

ETV Bharat Live Updates

10:16 AM, 06 Sep 2024 (IST)

వరద ప్రాంతాల్లో మూగజీవుల ఆకలి కేకలు - పశుగ్రాసం సరఫరా చేయాలని రైతుల విజ్ఞప్తి - Flood Areas No Food in Cattles

Flood Areas No Food in Cattles : కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాల్లో మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరద దాటికి గడ్డివాములు కొట్టుకుపోవడంతో పొలాల్లో పశుగ్రాసం లేక అల్లాడుతున్నాయి. పొలాల్లోకి తీసుకెళ్లి మేపుదామన్నా బురద కారణంగా వెళ్లే పరిస్థితి లేదు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రభుత్వం పశువులకు మేత అందించేలా ప్రణాళికలు రూపొందించింది. | Read More

ETV Bharat Live Updates

10:17 AM, 06 Sep 2024 (IST)

ఇంట్లో ఆత్మ తిరుగుతోందని మాయ మాటలు - పూజ పేరుతో రూ.30 లక్షలు స్వాహా - Miscreants Stole 30 Lakhs in Pooja

Criminals RS 30 Lakhs Fraud : ప్రస్తుత టెక్నాలజీ యుగంలోనూ మంత్రాలకు డబ్బు కట్టలు, ఆరోగ్యం బాగుటుందని భావించే వారు చాలా మందే ఉన్నారు. ఇలా నమ్మిన ఓ ఫ్యామిలీ ఏకంగా రూ.30 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లో వెలుగు చూసింది. | Read More

ETV Bharat Live Updates

09:18 AM, 06 Sep 2024 (IST)

జగన్‌కి జడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత కల్పిస్తున్నాం: ఎస్‌ఎన్‌ విశ్వనాథ్‌ - AP High Court on Jagan Security

AP HC on Jagan Security: మాజీ సీఎం జగన్‌కి జడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత కల్పిస్తున్నామని, 58 మంది సిబ్బంది రక్షణగా ఉన్నారని రాష్ట్ర స్థాయి భద్రత రివ్యూ కమిటీ సభ్యులు, ఐపీఎస్‌ అధికారి ఎస్‌ఎన్‌.విశ్వనాథ్‌ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. భద్రతపై ఆందోళన ఉంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి తప్ప హైకోర్టులో వ్యాజ్యం వేయడానికి వీల్లేదన్నారు. తనకు ముప్పు ఉన్నట్లు ఆధారాలతో అధికారులకు జగన్‌ ఎలాంటి వినతి ఇవ్వలేదన్నారు. హానికర ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. వ్యాజ్యం దాఖలు చేయడానికి ఇతర కారణాలున్నట్లు కనిపిస్తున్నాయన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని జగన్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. | Read More

ETV Bharat Live Updates

09:10 AM, 06 Sep 2024 (IST)

వరదలా సీఎంఆర్​ఎఫ్​కు విరాళాల వెల్లువ- చంద్రబాబుకు చెక్కులు అందించిన దాతలు - Donations For Flood Victims

Donations to CM Relief Fund: వరద బాధితులకు సహాయం చేయాలన్న సీఎం చంద్రబాబు పిలుపు మేరకు సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున దాతలు విరాళాలు అందిస్తున్నారు. వరద బాధితుల సహాయార్థం ఎస్బీఐ ఉద్యోగులు రూ.5.87 కోట్ల విరాళం ప్రకటించారు. బ్యాంకు ఉద్యోగులతో అమరావతి సర్కిల్‌ జీఎం రాజేష్‌కుమార్‌ పటేల్‌ సంబంధిత చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. బాధితుల పక్షాన విరాళాలు ఇచ్చి అండగా నిలిచేందుకు ముందుకొస్తున్న వారికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates

09:07 AM, 06 Sep 2024 (IST)

బుడమేరు విస్తరణ పనులను అర్ధాంతరంగా ముగించిన జగన్ సర్కార్ - కోట్లు కొట్టేసిన నేతలు - YSRCP Govt on Budameru Expansion

YSRCP Government Irregularities in Budameru Expansion: బుడమేరు విస్తరణ పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచేసింది. పనులను ప్రీక్లోజర్‌ పేరుతో అర్ధాంతరంగా రద్దు చేసింది. దీనిలో కొందరు ఆ పార్టీ నేతలు, అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కై కోట్ల రూపాయలు స్వాహా చేశారు. అసంపూర్తి పనులు, బుడమేరు పాయల మధ్యలో వైఎస్సార్సీపీ నేతల ఆక్రమణలే పొలాల మునకకు కారణమైందనే విమర్శలూ వస్తున్నాయి. | Read More

ETV Bharat Live Updates

07:48 AM, 06 Sep 2024 (IST)

కార్ల ఖర్చు 'తడిసి' మోపెడు - ఆందోళనలో వాహనదారులు - Cars Damage in Flood Disaster

Cars Heavily Damaged in Flood Disaster: భారీ వర్షాలు కురవడంతో వరద బీభత్సానికి విజయవాడలో పెద్ద సంఖ్యలో కార్లు దెబ్బతిన్నాయి. ఒక్కో కారుకు కనిష్టంగా 70 వేలు నుంచి లక్ష రూపాయలపైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కార్ల నష్టాన్ని అంచనా వేయలేని రీతిలో ఉన్నాయి. మరమ్మతులకు సైతం భారీగా ఖర్చు అవుతుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. | Read More

ETV Bharat Live Updates

07:55 AM, 06 Sep 2024 (IST)

వరద నష్టంపై నేడు కేంద్రానికి నివేదిక పంపుతాం: సీఎం చంద్రబాబు - Chandrababu on Floods Damage in AP

CM Chandrababu Naidu on Vijayawada Floods: వరద నష్టంపై ఇవాళ సాయంత్రంలోగా కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుడమేరు గండి పూడ్చివేతలో సైన్యం సాయం తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇళ్లు శుభ్రం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలు తెప్పిస్తున్నామన్న ముఖ్యమంత్రి, ఆన్‌లైన్‌ ద్వారా నిర్ణీత ధరలకే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్‌ల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. నేటి నుంచి నిత్యావసరాలతో పాటు కుటుంబానికి మూడు ప్యాకెట్ల నూడుల్స్, యాపిల్స్, పాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సెప్టెంబరు నెల విద్యుత్తు బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. | Read More

ETV Bharat Live Updates

07:03 AM, 06 Sep 2024 (IST)

వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన - ఆర్థిక సాయంపై కేంద్రానికి నివేదిక - Central Team Visit in Flood Areas

Central Team Visit AP Flood Affected Areas: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టంపై వివరణ ఇచ్చేందుకు కేంద్ర బృందం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించింది. క్షేత్రస్థాయిలో వరద ముంపు పరిస్థితులను పరిశీలించిన కేంద్రం బృందం నష్టాన్ని అంచనా వేసింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందేలా తక్షణం కేంద్రానికి నివేదిక పంపుతామని తెలిపింది. | Read More

ETV Bharat Live Updates
Last Updated : Sep 6, 2024, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details