AP JAC Amaravati Demands: ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న అవేదన, అసంతృప్తి, బాధ ఉద్యోగుల్లో ఉందని ఏపీ జేఎసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం 6700 కోట్ల మేర బకాయిలు పడిందని, తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలంని డిమాండ్ చేశారు. ఏపీ జేఎసీ అమరావతి ఉద్యోగ సంఘంలో మహిళా విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఉద్యోగులకు ప్రభుత్వం 6700 కోట్ల బకాయిలు: ప్రభుత్వ ఉద్యోగులలో మహిళల సంఖ్య 50 శాతం కంటే ఎక్కువ ఉందని ఏపీ జేఎసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అందుకే ఏపీ జేఎసీ అమరావతి రాష్ట్ర, జిల్లాల మహిళా యూనిట్ లను ఏర్పాటు చేసుకుందని అన్నారు. ఉద్యోగ సంఘాల చరిత్రలోనే మహిళా విభాగాలు ఏర్పాటు కావడం తొలిసారని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరించారని బొప్పరాజు తెలిపారు. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామన్నారు. ఇంతగా సహకరిస్తే తమకు ప్రభుత్వం బకాయిలు పెట్టిందని అన్నారు. గతంలో ఉద్యమం చేసి ఆర్ధికేతర అంశాలను సాధించుకున్నామని, కానీ ఇప్పటికీ ఆర్థిక పరమైన అంశాలు పరిష్కారం కాలేదని బొప్పరాజు పేర్కొన్నారు. మంత్రివర్గం ఉప సంఘం రేపు మాపు అంటూ బకాయిల చెల్లింపుపై మాటలు దాట వేస్తున్నారన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం 6700 కోట్ల మేర బకాయిలు పడిందని అన్నారు. పోలీసులకు సరెండర్ లీవ్ లు గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం బకాయి పెట్టలేదని అన్నారు. ఉద్యోగులుగా తాము బోనస్ లు అడగటం లేదు తమకు రావాల్సిన బకాయిలు మాత్రమే డిమాండ్ చేస్తున్నామని బొప్పరాజు తెలిపారు.
బకాయిల జీవో జారీ చేశారు, నిధులు చెల్లింపు మరిచారు- సీఎం హామీలే అమలవ్వకపోతే ఎలా? : బొప్పరాజు