సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట- ప్రభుత్వ అప్పీల్ కొట్టివేత (ETV Bharat) HC on IPS AB Venkateswara Rao Suspension:సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని హైకోర్టులో రాష్ట్రం ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరించింది. క్యాట్ తీర్పులో జోక్యం చేసుకోబోమని చెప్పిన హైకోర్టు ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో సచివాలయంలో సీఎస్‌ను కలిసిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ఆదేశాలను ఆయనకు అందజేశారు. దీంతోపాటు కోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టింగ్‌పై ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీఈవో కార్యాలయానికి ఉత్తర్వుల ప్రతిని ఇచ్చారు.
ఏబీవీకి మద్దతుగా 87 దేశాల నుంచి సంతకాల సేకరణ - ప్రభుత్వంపై ఏపీ టుమారో సంస్థ ఆగ్రహం - campaign for AB Venkateswara Rao
రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌ను సమర్థించింది. అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకనుగుణంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏకారణంతో సస్పెండ్ చేశారో తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్ ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరించింది.
ప్రభుత్వమే పగబడితే ఎలా?!- ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా వేధింపులు - AB Venkateswara Rao Posting