ETV Bharat / state

అప్రమత్తమైన ప్రభుత్వం- రాష్ట్రవ్యాప్తంగా భూకంప లేఖిని కేంద్రాల ఏర్పాటు - SEISMOLOGY CENTERS IN AP

ఏపీలో సెస్మోలజీ కేంద్రాలను నిర్మించాలని విపత్తు నిర్వహణ సంస్థ నిర్ణయం

Seismology Centers in AP
Seismology Centers in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2025, 5:04 PM IST

Updated : Jan 12, 2025, 6:12 PM IST

Seismology Centers in AP : ఏపీ వ్యాప్తంగా భూకంప లేఖిని కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ భావిస్తోంది. ఇటీవల విజయవాడ, జగ్గయ్యపేట, ప్రకాశం జిల్లాలో వచ్చిన స్వల్ప ప్రకంపనల నేపథ్యంలో ఈ సెస్మోలజీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎక్కడో ఇండో-నేపాల్‌ సరిహద్దుల్లో భూకంపం వస్తే ఆంధ్రప్రదేశ్​లోని జగ్గయ్యపేట, విజయవాడల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇక బంగాళాఖాతానికి ఆవల ఉన్న ఇండోనేషియా పరిసర ప్రాంతాల్లో భూమి ప్రకోపించినా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ప్రకంపనలు వచ్చి భయపెడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్​లో ఎక్కడా భూ ప్రకంపనల్ని కొలిచేందుకు, రిక్టర్ స్కేల్‌పై వీటి తీవ్రతను నమోదు చేసేందుకు భూకంప లేఖిని కేంద్రాలు లేవు. దీంతో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సెస్మోలజీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి ఏపీ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలన్నీ జోన్​-3లో ఉన్నాయి. అంటే తక్కువ స్థాయి ప్రకంపనలు మాత్రమే ఈ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రత్యేకించి విజయవాడ పరిసరాల్లో ఉన్న ప్రాంతాలన్నీ జోన్​-3లో ఉంటే, విశాఖ ఆ సమీపంలో ఉన్న ప్రాంతాలు జోన్-2లో ఉన్నాయి. రిక్టర్ స్కేలుపై 3 కంటే తక్కువ తీవ్రత ఈ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల వచ్చిన ప్రకంపనల స్థాయి కూడా 1.5 నుంచి 2.3 వరకూ ఉందని అంచనా. వాస్తవానికి రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోనే స్వల్ప స్థాయి ప్రకంపనలకు ఆస్కారం భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే విపరీతంగా పెరిగిపోయిన మైనింగ్‌ లోతుగా బోర్​వెల్స్‌ తవ్వడం వంటివి భూ ప్రకంపనలకు కారణాలుగా మారుతున్నాయని పేర్కొంటున్నారు.

మనకు సంబంధించి జోన్​-3లో ఉంది. ప్రకాశం జిల్లాలో 100 కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది. ఎన్జీఆర్ఐ ద్వారా ప్రకాశం జిల్లాలోని రెండు మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. 10 ప్రాంతాల్లో సెస్మోలజీ కేంద్రాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి డీపీఆర్ తయారవుతుంది. త్వరలోనే భూకంప లేఖిని కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. - రోణంకి కూర్మనాథ్‌, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ

Earthquakes in AP : విచ్చలవిడిగా తవ్వేసిన బోర్‌వెల్స్‌ నుంచి నీటిని తోడేయటంతో భూమి లోపలి పొరలు సర్దుబాట్లకు గురికావడం వల్ల స్వల్పస్థాయి ప్రకంపనలు ఏర్పడేందుకు కారణమవుతున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్జీఆర్ఐ సంస్థతోనూ విపత్తు నిర్వహణా సంస్థ ఒప్పందం చేసుకుంది. భూ ప్రకంపనల తీవ్రతను ఆధారంగా ఆయా ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు, రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఆస్కారం ఉంది.

ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం - 24 గంటల్లో 2 సార్లు కంపించడంపై స్థానికుల్లో ఆందోళన

భూకంపం ఎఫెక్ట్ - ప్రకాశం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు

Last Updated : Jan 12, 2025, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.