ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీకు తెలుసా? 'బిగ్‌బాస్‌లో పాల్గొనాలంటే ఆ పరీక్ష చేయించుకోవాలి' - High Court on Bigg Boss show - HIGH COURT ON BIGG BOSS SHOW

High Court Heard the Petition Filed on Bigg Boss Show : హైకోర్టులో బిగ్‌బాస్‌ రియాల్టీ షోపై దాఖలైన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ షోలో అశ్లీలత, అసభ్యతను అడ్డుకోవాలని, షో పై పరిమితులు విధించి రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు మాత్రమే ప్రసారం చేయాలని పిల్ దాఖలైంది. అలాగే కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు గర్భనిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

High Court Heard the Petition Filed on Bigg Boss Show
High Court Heard the Petition Filed on Bigg Boss Show (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2024, 10:05 AM IST

High Court Heard the Petition Filed on Bigg Boss Show : హైకోర్టులో బిగ్‌బాస్‌ రియాల్టీ షోపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ షోలో అశ్లీలత, అసభ్యతను అడ్డుకోవాలని, షోపై పరిమితులు విధించి రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు మాత్రమే ప్రసారం చేయాలని తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న(బుధవారం) హైకోర్టులో వాదనలు జరిగాయి.

నాగార్జున వకాలత్‌ దాఖలు చేయలేదు : పిటిషనర్‌ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు గర్భనిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే షోలో పాల్గొంటున్న వారు అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. బిగ్‌ బాస్‌ షోను నిర్వహిస్తున్న సినీ నటుడు అక్కినేని నాగార్జున ఈ వ్యాజ్యంలో ఇప్పటి వరకు వకాలత్‌ దాఖలు చేయలేదన్నారు. హైదరాబాద్‌లో ఆయనకు చెందిన భవనాన్ని హైడ్రా కూల్చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

సల్మాన్, ఇమ్రాన్ హష్మీ మూవీల్లో కీరోల్స్‌- చివరకు డీజేగా సెటిల్​- ఆ యాక్టర్‌ ఎవరంటే? - Bollywood Actor Movie Career

అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం : అశ్లీలత గురించి వివరించే క్రమంలో న్యాయవాది వినియోగించిన పదప్రయోగంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ ప్రత్యక్ష ప్రసారం అవుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. హైడ్రా కూల్చివేతకు ప్రస్తుత కేసుకు ఏమి సంబంధం? అని ప్రశ్నించింది. మరోవైపు స్టార్‌ ఇండియా తరఫున సీనియర్‌ న్యాయవాది మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిబంధనలకు లోబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

ఎలాంటి ఆధారాలనూ చూపలేదు : టీవీ ప్రసారాల్లో అశ్లీలతపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యామ్నాయమార్గం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ ఫిర్యాదుల్ని పరిశీలించేందుకు కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ చట్టం ప్రకారం మూడు అంచెల వ్యవస్థ ఉందన్నారు. చట్టనిబంధనలకు లోబడే బిగ్​బాస్ రియాల్టీ షో కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నామన్నారు. అశ్లీలతపై పిటిషనర్‌ ఎలాంటి ఆధారాలనూ కోర్టు ముందు ఉంచలేదని తెలిపారు. ఈ మేరకు వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం రిజర్వు చేసింది.

'9వ తరగతి వరకు చెప్పులు లేకుండానే - వాటిని భరించలేక ఇండస్ట్రీకి వచ్చా'

Bigg Boss 7 Telugu 7th Week Elimination : బిగ్ బాస్ ఓటింగ్​లో సూపర్ ట్విస్ట్​.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్..!

ABOUT THE AUTHOR

...view details