AP High Court Abolished Common Elementary Exam: ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న ఎలిమెంటరీ విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహణను హైకోర్టు తప్పుబట్టింది. ఎలిమెంటరీ విద్య చదువుతున్న రాష్ట్రంలోని విద్యార్థులకు ఏకరూప ప్రశ్నాపత్రంతో ఉమ్మడి పరీక్ష నిర్వహించడం విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29కి(Curriculum and Evaluation Procedure) విరుద్ధమని తేల్చిచెప్పింది. ఉమ్మడి పరీక్ష రాసేందుకు వీలుగా 2022లో తీసుకొచ్చిన విధానం విద్యార్థుల హక్కులను హరించేలా ఉందని పేర్కొంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలను నిర్ధిష్ట సమయంలో అభిప్రాయాలను చెప్పాలని ఒత్తిడి చేయడమే అవుతుందని, అంతేకాక వారిని బాధ, భయాందోళనకు గురిచేసినట్లుందని అభిప్రాయపడింది.
తరగతిగది ఆధారిత మదింపు(Classroom Based Assessments) ద్వారా ఒకటి నుంచి ఎనిమిదో తరగతుల పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఉమ్మడి పరీక్ష కోసం ఉద్దేశించిన షెడ్యూల్, టైం టేబుల్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చారు. సపోర్టింగ్ ది ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రోగ్రాం(సాల్ట్) కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ విద్యా సంస్థలు తప్పనిసరిగా ఉమ్మడి పరీక్ష ప్రక్రియలో పాల్గొనాలని, అందుకోసం రుసుములు చెల్లించాలని పేర్కొంటూ రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (State Council of Educational Research and Training) డైరెక్టర్ 2022 అక్టోబర్‌లో ఉత్తర్వులు జారీచేశారు.
బైకర్స్ అలర్ట్ - ఇకపై హెల్మెట్ మస్ట్ - హైకోర్టు ఆదేశం - Helmet Must For 2 Wheeler Riders