AP Govt MoU with NTPC Vidyut Vyapar Nigam Ltd:ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలపై 300 మెగావాట్ల సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు కోసం ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఎన్టీపీసీ- ఏపీ నెడ్ క్యాప్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలపై సౌర విద్యుత్ ఫలకాలను అమర్చేందుకు వీలుగా ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. 2025 నాటికి ప్రభుత్వ కార్యాలయాలపై సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం సౌర ఫలకాలను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సౌర విద్యుత్ ఉత్పత్తి చేయటంతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా 25 ఏళ్ల పాటు ఈ ఒప్పందం విద్యుత్ వ్యయాన్ని తగ్గిస్తుందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 300 మెగావాట్ల విద్యుత్ రూఫ్ టాప్ వ్యవస్థల ఏర్పాటు ద్వారా ఏటా 118.27 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేశారు. 25 ఏళ్లలో 2 వేల 957 కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని సీఎం స్పష్టం చేశారు. దీంతోపాటు ఏడాదికి 3.41 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని 25 ఏళ్లలో 85.25 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించగలమని తెలిపారు.
'హర్ ఘర్ తిరంగా'లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగరాలి : సీఎం చంద్రబాబు - CBN on Har Ghar Tiranga